S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/20/2018 - 19:40

నేనెప్పుడూ అడవిని చూళ్లేదు
మా యంటి చెట్టు ద్వారానే దర్శించాను
గోడల మధ్య పుట్టి
గోడల మధ్యే పెరిగి
గోడలే లోకం అనుకునే నాకు
అరణ్యం ఒక ప్రాకృతిక మాన్యం

అడవిలో మన దారుల్ని
మనమే తీసుకోవాలి
చెట్టుకొమ్మల్లోంచి ఆకాశం
కాస్త కాస్త రాలి పడుతుంది

08/12/2018 - 23:24

‘తూర్పు పడమరల కలయక అసంభవం’ - ఒకనాటి మాట
తూర్పుకిటువైపు
పడమటకటువైపు
వేలాది మైళ్ల దూరాన్ని
కలిపిన ఒకే వాన
ఒకే కాలాన
సమాంతరంగా
మబ్బుల కుండలన్నీ ఢీకొని
ఉరిమి మెరిసి
పగిలి వర్షించి
ప్రాక్ పశ్చిమాకాశాలన్నీ
జలధారలతో
నేలమీది కాలాన్ని
నిర్నిద్ర సెల్‌ఫోన్ల సిగ్నల్స్‌ను
భూగోళ కొసలతో
వాణిజ్య వ్యాపార సూత్రాలన్నీ

08/12/2018 - 23:17

ప్రాచీన కాలంనుండి ఆధునిక కాలం వరకు తెలుగు సాహిత్యానికి వెన్నుముకగా నిలిచింది పదునైన విమర్శే. ఒక్క సాహిత్య రంగంలోనే కాదు, ఏ రంగంలో చూసినా నాణ్యతకు వారధిగా విమర్శ కనబడుతుంది. గాలి వానల బీభత్సానికి ఎదురొడ్డి నిలచిన వృక్షమే మహావృక్షమవుతుంది అన్న చందాన, విమర్శల ధాటికి తట్టుకు నిలబడిన సాహిత్యమే ఉత్తమ విలువలు కలిగిన సాహిత్యం అవుతుంది.

08/12/2018 - 23:16

ప్రసన్నోషోదయ సమయాన
తిమిరపు తెరలు తొలగే తరుణాన
మూసి ఉన్న అంగళ్ళముందు
ముడుచుకొని, వరుసలో కూర్చొని
అనుబంధాలను పత్రికలలో అమర్చుకుంటూ
కట్టలు కట్టుకుంటూ
నిర్దేశింపబడ్డ క్షేత్రాలకై నిష్క్రమించబోతున్న
మన బార్నీ ఫ్లా హెర్టీ వారసులు.

08/07/2018 - 22:19

ఒక మెత్తటి తెల్లని పొరలో
ఆలోచనలు పురుడు పోసుకుంటాయ
కొన్ని రక్తపు ఛాయలతో
ఎర్రటి సూర్యుడిలా
విప్లవాగ్నిని మండిస్తే
మరికొన్ని ఆలోచనల నౌకలు
జన్మించగానే అలల పొత్తిళ్లలోల
శాశ్వతంగా నిద్రిస్తాయ

జయంతో వర్ధంతో
తెలియని అయోమయంలో
అతను కన్నీటి బొట్టులో
అక్షరాన్ని కలిపి
అదే సముద్రంలో కలిపేశాడు

08/07/2018 - 22:17

తలుపుల వాకిళ్ళ ముందు
హృదయాన్ని వెనె్నల్లా పరిచాను
నువు కానరావు
కాలాన్ని తెడ్డుగా చేసుకుని
మది సంద్రాన్ని ఎదురీదాను
జాడ కానరాలేదు
నువ్వెంత మోసకారివి
జీవితకాలం నిలిచే
ప్రతిబింబవౌతావనుకున్నాను
రేఖాచిత్రమై
జీవన ముఖచిత్రాన్ని
అందంగా గీస్తావనుకున్నాను
మాటకారితనంతో
హృదిలో గీసుకున్న రంగులచిత్రాన్ని

08/05/2018 - 22:55

ఎప్పుడో ఎక్కడో
ఒక సంఘటన కలచివేసినప్పుడో
ఒక దృశ్యం కదలనీయకుండా నిలబెట్టినపుడో
సమూహంలో ఈదుతూ తలమునకలైనపుడో
ఒంటరితనంలోకి నడచి వెళ్లినపుడో
మదిలో ఒక చినుకులా
మొదట మెల్లగా కురిసిన అలజడి
ఆనక తుపానులా రూపాంతరం చెందుతుంది
రెప్పల రెక్కల మాటున
ఏవో రంగులు తరలిపోతూ
వాటి గురించిన కలపోతలోకి నెట్టేస్తుంటాయ

08/05/2018 - 22:52

స్వాత్మకథ
*
డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు,
వెల: రూ.558/-
ప్రతులకు: నవోదయ,
ఇతర పుస్తక విక్రయ కేంద్రాలు.
*

08/05/2018 - 22:48

‘అనంత రత్నాలు’- ఖండకావ్యం
రచయిత: వి.చంద్రశేఖర శాస్ర్తీ
పుటలు: 124; వెల: రూ.70/-
ప్రచురణ:
వసంత ప్రచురణలు, అనంతపురం
ప్రతులకు:
విశాలాంధ్ర మరియు నవ చేతన వారి
అన్ని శాఖల పుస్తక విక్రయశాలలు
వి.వైదుషి, 1-2-920-2, ఫ్లాట్ నం.24,
సోమనాథనగర్, అనంతపురం - 515004.
*
పరమ కవిత్వమందు ప్రతి బాలుడు బమ్మెర పోతరాజె;

Pages