S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/14/2019 - 02:08

ఇన్నాళ్ళుగా
పుస్తకాలు మాత్రమే చదువుతూ
లోకాన్ని అధ్యయనం
చెయ్యడం మానుకున్నాను
పురాణాలు వింటూవింటూ
కదులుతున్న కాలాన్ని విస్మరించాను

05/14/2019 - 02:06

నా మనోఫలకంపై
కదలాడే...
భావచిత్రాలు
పేదవాని గుండెచప్పుళ్ళను
పదిమందికి వినిపించాలని...
అక్షరాలను పెనవేసుకుని...
శే్వతపత్రంతో జతకడతాయ!

05/14/2019 - 02:05

చెలికి మరో రూపం కడలి
గాంభీర్యతలోనూ.. ఆత్మీయతలోనూ..

చూచిన తోడనే ఉరుకున వస్తుంది అల
చాచిన చేతులు కౌగిలిగా బిగియక మునుపే
తాకి, వదిలిపోతుంది మెరుపులా
మెలకువ సోకిన వేకువ కలలా...
చెలికి మరో రూపం కడలి
సంఘర్షణలోనూ... ఆకర్షణలోనూ...

05/14/2019 - 02:03

పాపం ఒక పెద్దమనిషి
ఒక చిట్టి చిలకను మోజుపడి తెచ్చుకున్నాడు
దానిలోనే తన ప్రాణం పెట్టి
పెంచుకోవడం మొదలుపెట్టాడు
ఊరంతా తిరగడానికి బాగానే స్వేచ్ఛనిచ్చాడు

పండ్లు, కాయలు, గింజలు..
బాగానే పెడుతున్నాడు
వాటన్నిటికీ ఓ నాజూకు రూపమిస్తూ
బాగానే పెద్దదయంది

04/29/2019 - 22:31

చట్టుబండలైన చదువు కాదు
చక్కటి చదువే చదివాడు
వివిధ ప్రయత్నాలతో విసుగు చెంది
సఫలీకృతం కాని ప్రయత్నాలతో
చతికిలపడ్డాడు

04/29/2019 - 22:29

గుబురు గుబురుగా అల్లుకున్న మనుషుల మధ్య
చెమట పూలు తెల్లగా విచ్చుకున్నాయ
ప్రయాణం అనాథవ్వకూడదు
అదొక సామూహిక జీవమున్న చలనమవ్వాలి

కోటీలో సోహెల్ భవిష్యత్తు మెత్తగా నవ్వుతోంది
చాదర్‌ఘాట్ ఒంపులో గప్పుమన్న స్వచ్ఛ్భారత్
మలక్‌పేట ఇరుకుల్లో చక్రాల సంశయం
దిల్‌కుష్‌నగర్‌లో ఆందోళన
నక్కినక్కి చూస్తోంది

04/29/2019 - 22:28

నేనొక ఎత్తిపోతల దగ్గర నిలుచున్నా
ఇక్కడ అధికంగా ఉన్న నీరంతా
మా బీడు భూముల్ని తడుపుతాయని
మా రైతన్న కన్నీటిని తుడుస్తాయని
కలలు కంటూ నిలుచున్నా

ఇంతలో ఓ చిన్నారి చేప
నా ముందుకొచ్చి మాట్లాడింది
నా కన్నీరు నీకు కనిపించదు
నేను జలం లోపలే ఉన్నందుకు
అంటూ తనను తాను
పరిచయం చేసుకుంది

04/22/2019 - 22:18

దారి లేని అడవి..
పంజా విప్పి తెల్ల పెద్దపులి
అణువు గుండెనిండా
రేపును ఛిద్రం చేసే
నివురు గప్పిన విస్ఫోటనాలు
వీరుడా.. నువ్వెలా యుద్ధం చేస్తావ్

బోసి నవ్వులకు ఊపిరిలూదే
పిల్ల వాయువులు ఉండబోవు
నువ్వు బంధించిన అరచేతిలోని
సూర్యకిరణాలు నిన్ను ఒంటరి చేస్తాయ

04/22/2019 - 22:17

గుండెల్లో గుబులు
వెన్నులో వణుకు
మనసంతా దిగులు
కన్నీటి ప్రవాహమై
ప్రతిబింబిస్తున్నట్లు
ఎవరి కోసం
ఎంత పిచ్చితనం కాకపోతే
చేతులకు చూపా
ఎంత వెర్రితనం కాకపోతే
కాళ్లకు వినికిడా
అసలు విషయం తేల్చడమా
అనుక్షణం నాన్చడమా
ఎవరినైనా ఎంతకాలం
అయష్టంగా
నెత్తిపై వుంచుకోవడం
ఎవరినైనా అయష్టంగా
పాతాళానికి నెట్టివేయడం

04/22/2019 - 22:16

వౌనమెంత కురిసి
యంత భావవౌతుంది
భావమెంత కరిగి
కొంత వేదనవుతుంది

మాటలన్ని గొంతులోన
వింతలౌతుంటే
వింతలన్ని ఊహలోన
మాటలౌతున్నవి

గుండెలోన దాగివున్న
మధురమైన వేదన
ఎదలోన మిగిలివున్న
అమరమైన రోదన

కన్నీరు కారి కారి
గాయవౌతున్నది
ఇన్నాళ్లు వేచి వేచి
అలసటవుతున్నది

Pages