S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/26/2019 - 20:39

ఎప్పుడైనా కాలం కలిసి వస్తే
పొమ్మనకు నేస్తం
ఇన్నాళ్లు ఎందుకు రాలేదని అలిగి
గొడవ పడకు
అందర్నీ కాదని ఎందరినో వద్దనుకుని
నీ దగ్గరికి వచ్చాను సుమా

పిలిచినప్పుడు రాలేదని విసుక్కోకు
మళ్ళీ వెళ్లిపోతుందేమోనని
నన్ను బంధించకు సుమా
రాత్రికి రాత్రికి మధ్య
నిశ్శబ్దంగా జారిపోతుంటాను నేను
నేను క్యాలెండర్లో లేను
జీవితంలోనే ఉన్నాను

05/26/2019 - 20:38

వాన జల్లులు కురియగా
నాడు కళకళలాడిన చెరువు

మేఘాల చప్పుడు కానక
నేడు తడిలేక విలవిలలాడుతుంది

బంకమట్టి పండు ముసలి
చర్మంలా వేలాడుతున్న
చెరువు గుండెలు పగిలి
వెక్కి వెక్కి ఏడుస్తుంది

05/26/2019 - 20:36

భూ మాతని నేను
సహనానికి రూపాన్ని నేను
తాపాన్ని సహించలేను
పాపాన్ని భరించలేను

చెట్టుకి కాయ బరువు కాదు
కానీ కూర్చున్న కొమ్మని నరికే
మీకు ఏమని చెప్పను?
నా భూతాపం! ఆ ‘కలి’ఘోరం!
మానవా! నా మనో నేత్రమా!
వ్యర్థాలను తొలగించు
ప్లాస్టిక్‌ని నిరోధించు
నా ఉనికిని నిలబెట్టు

05/26/2019 - 20:34

సీ: కార్పొరేట్ స్కూల్ గదిన్ కాసింత చోటీను
ఎలుగెత్తుదును ‘తెల్గు-తెలుగ’టంచు;
మన వత్సరపు పేర్లనణుమాత్ర మెరుగను
అరచు చుందును నే‘నుగాది’యనుచు;
నా పేరు పొరుగింటి నరునకు తెలియదు -
అయన మహాకవిఖ్యాతిగందు;
అనుదినంబెదొ వర్గదినమే - ఇపుడు వార
లణగార్చబడి రంచు కనలు చందు;
చిత్తశాంతికై మన సంఘ సేవ చేయ
ఉరక ఉరుకుల పరుగుల దొరనెయగుదు;

05/20/2019 - 22:46

కం॥ గజగమన కాదు ఇయ్యది
గజసదృశ శరీర సీటు కంతయు తానై
అ జగరమై కూర్చున్నది
గజిబిజియై పోయె మనసు కన్నులు కూడన్‌॥
ఆయన గుత్తి దగ్గరున్న ప్యాపిల గ్రామాన్ని, కాళహస్తిని దర్శించినప్పుడు ఆయనకు తారసపడిన వారిని వర్ణించాడు.
కం॥ మొగమున కెగిరెడు చన్నుల
సొగసుల చిన్నారిదాన చూడగనీవే
బిగి జక్కవ చనుగవలో
వగ గల బంగారు గలదో వయసే గలదో.

05/20/2019 - 22:45

ఇన్ని రోజులు గడిచాక
నెమ్మది నెమ్మదిగా చూపుల్ని నెడుతూ
ఒంటరి ఇల్లును వదిలి
స్వస్థలం చేరుకోడానికి ఆరుబయట ఊగే గాలిలా
మనసు నిలకడగా లేదు

చుట్టూ చూస్తున్నాను
ఆదరించే ప్రపంచం నెలకొని ఉంది
ఒకచోట ఉండాలనే ఉంటుంది
వీచే గాలులు ఉరిమే ఉరుములు
ఏవీ నాలో నన్ను ఆట్టే ఉండనీయవు

05/20/2019 - 22:44

ఆలోచన కలంతో
మొదలయ్యంది ఈ కలకలం
మింటి కెగిసిన మేడలు
మంటి కతికిన గూడులు
వీటి మధ్య, మధ్యతరగతి గోడు
నిద్రపోయన నగరం మత్తులో
నాగరికతల గమ్మత్తులు
ఒకవైపు బలిపెట్టిన కర్షక బ్రతుకుల తాకట్టు
మరోవైపు బలిపీఠంపై కట్టిన కార్మికుని మెట్టు
ఇదే కదా కలం గళ్లకట్టు
మాతృగర్భం చీల్చుకుని వచ్చిన
సమస్యల వలయాలతో
మృత్యుగర్భం దాల్చుకున్న

05/20/2019 - 22:42

కవిత్వం ఒక యజ్ఞం
కవిత్వం ఒక తపస్సు

కవిత్వమంటే
నాలుగు అక్షరాల కూర్పు కాదు
పలు ప్రపంచాల సమాజాన్ని ఆవిష్కరించడం

నాలుగు పదాల మేళవింపు కాదు
నవతరాన్ని మేల్కొలిపే అక్షర సైన్యం

నాలుగు వాక్యాల పద విన్యాసం కాదు
కొత్త లోకాన్ని ఆవిష్కరించే అధునాతన దిక్సూచి

05/14/2019 - 02:08

ఇన్నాళ్ళుగా
పుస్తకాలు మాత్రమే చదువుతూ
లోకాన్ని అధ్యయనం
చెయ్యడం మానుకున్నాను
పురాణాలు వింటూవింటూ
కదులుతున్న కాలాన్ని విస్మరించాను

05/14/2019 - 02:06

నా మనోఫలకంపై
కదలాడే...
భావచిత్రాలు
పేదవాని గుండెచప్పుళ్ళను
పదిమందికి వినిపించాలని...
అక్షరాలను పెనవేసుకుని...
శే్వతపత్రంతో జతకడతాయ!

Pages