S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/22/2019 - 22:15

వెలుగు నీడలు నలుపు తెలుపుల్లో
కష్టసుఖాలకు గుర్తులుగా
గోడమీద కొబ్బరి ఆకు
మదిని చీల్చే అర్థం లేని విమర్శల జ్ఞాపకంగా
వరండాలో సన్నని స్తంభాలు వరుసగా
న్యాయానికి అన్యాయానికి సూచనగా
జైలు ఊచలని తలపిస్తూ
కాగితంమీద నా చేత పట్టిన కలం
అమ్మాయల ఆత్మబలానికి ఏమాత్రం తీసిపోనట్టు
పిడికిలి బిగించి అవసరమైతే కత్తినవుతానన్నట్లు

04/22/2019 - 22:13

రాజకీయం సర్వదా ఒక అవకాశవాదం
రాజ్యాంగ ముసుగులో దాగిన మరో వేదం
అన్ని రంగాలను ఆవహించిన పెను ప్రమాదం
స్వార్థపరుల మనుగడకు సదా ప్రమోదం
నయవంచన దీని లక్షణం
మాట మార్చగలదు తక్షణం
పదవి ప్రధాన లక్ష్యం
పాలన మాత్రం సాంతం నిర్లక్ష్యం
సప్తవ్యసనాలకు కీలక కేంద్రం
అవినీతికి అంతులేని సంద్రం
తరతరాలకు తరగని ఆస్తి

04/15/2019 - 23:22

వెనక్కి వెళ్లడం
పురోగమనం కాకపోవచ్చు గాని
అప్పుడప్పుడు వెళ్లిరాక తప్పదు.
విడిచి వచ్చిన ప్రాంతాల్లోకి
వాటి జ్ఞాపకాల్లోకి
విడిపోయన చేతుల వెచ్చదనంలోకి
నెరవేరని వాగ్దానాల్లోకి
ఒక్కసారయనా వెళ్లిరాక తప్పదు

04/15/2019 - 23:21

కృతజ్ఞతో కృతఘ్నతో
ప్రేమో ద్వేషమో
మంచో చెడో ఏదో ఒకటి
లోనిదంతా కక్కెయ్యాలి..

మొన్నటిదీ నిన్నటిదీ
ఇవ్వాళ్టిదీ అంతా
కూడేసుకునీ కుప్పేసుకునీ
మనసెంత బరువైపోయందో

04/15/2019 - 23:19

రాత్రి పోతూ పోతూ
ఉదయాన్ని భూమికి ఇచ్చిపోయంది

సూర్యుడు అస్తమిస్తూ
కలను కండ్లకు దానం చేసిపోయాడు

నిద్ర రాగానే చీకటి ఎచటికో వెళ్లింది

మెలుకవ కాగానే
కాంతి శాంతి లేకుండా చేసింది

కదులుతున్న కాలయానంలో
మనిషి గడియారంలో

తాడుతో కట్టేయకుండానే
జీవిత ఖైదీ అయ్యాడు

ఇక మనసు
ఎప్పటికీ శిక్ష నుంచి
విముక్తి కాలేదు.

04/15/2019 - 23:18

నాలో నేను.. నాతో నేను
మాట్లాడి పోట్లాడుకోవాలె
నా ప్రశ్నల వర్షంలో
జవాబులు తానమాడి
కవితాక్షరాలై వెలసి
బతుకు వెతల్ని పేల్చి
ప్రేమానురాగాల్ని నింపాలె!
పదాల వెంట పరుగు
కాదేమో కవిత్వం
పదాలు పరవశంలో నీ వశమై
భావ ప్రవాహంతో
మది మడుల్ని తడిపి.. తడిమి..
వినూత్న ఆలోచనా చిగుర్లు
మొలిపించి మురిపించాలె!

04/15/2019 - 23:17

చిక్కిన కడుపుకు
గుప్పెడు మెతుకులు పెట్టలేని
అమృత ఘడియలెందుకు

మనిషి పుట్టుకను ఆపలేని
దుర్ముహూర్తం ఊసెందుకు

మంచి చెడులను నిర్థారించలేని
తిథుల కుతి ఎందుకు

జీవిత గమనానికి
దిక్సూచి కాలేని
హస్తరేఖల గోలెందుకు

అభాగ్యుల జీవితాల్లో
చిరునవ్వులు పూయంచలేని
చిలుక పలుకులెందుకు

04/08/2019 - 22:06

అతనికి అందరూ తెలియకపోవచ్చు
కానీ అన్నం తెలిసిన ప్రతివాడికీ
అతను తెలుసు, ఆకలి తెలిసినట్లే...

04/08/2019 - 22:02

అది అక్షరాలను
సృష్టించే గర్భస్థలం
అచటి నుంచి
ఎన్ని అస్త్రాలు
ఆయువు పోసుకుంటున్నాయో
కాలానికే తెలుసు

అది పదాల పొదరిళ్లను
నిర్మించే విశ్వకర్మ క్షేత్రం
అచట సమాజాన్ని కదిపే
ఎన్ని శిల్పాలు సృష్టించబడుతున్నాయో
కాలానికే తెలుసు

04/08/2019 - 22:01

అలలు అలలుగా
అస్పష్టమే స్పష్టం అన్నంత స్పష్టంగా...
చుట్టూ అల్లుకున్న తెరల్లో...

నాది కాని నా ఉనికే నేనై..
నేను కాని నేనే అనంత విశ్వమై!

నిన్నటి నీడలే నీ ఉనికి అంటూ...
ఊపిరిని బంధించిన పంజరాలు
కనబడని సంకెళ్లతో కవాతులు!

ఊహలకు రెక్కలు తొడిగే ప్రయత్నంలో
పటపటమని తెగుతున్న
యుగయుగాల బంధనాలు

Pages