Others

అఖండ పుష్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనక్కి వెళ్లడం
పురోగమనం కాకపోవచ్చు గాని
అప్పుడప్పుడు వెళ్లిరాక తప్పదు.
విడిచి వచ్చిన ప్రాంతాల్లోకి
వాటి జ్ఞాపకాల్లోకి
విడిపోయన చేతుల వెచ్చదనంలోకి
నెరవేరని వాగ్దానాల్లోకి
ఒక్కసారయనా వెళ్లిరాక తప్పదు

వెనక్కి వెళ్తే
అప్పటి నువ్వు లేకపోవచ్చు
ఇప్పుడున్న మనుష్యులు
కొత్తగా కనపడొచ్చు
కాలం ఊడ్చేసిన చెత్తకుప్పల్లో
ఏమీ దొరక్కపోవచ్చు
ఏమో! నువ్వు పోగొట్టుకున్న
ఉంగరం దొరుకుతుందేమో!
వెనుకకు పోయందంతా
వెనకనే ఆగిపోయందని కాదు

ప్రగతి కాముకులకు
గతం
ఒక మూసేసిన పుస్తకం కావచ్చు
అక్షరాలు
రాజేసిన స్వప్నాల్లాంటివి
ఆరిపోయే సమస్యే లేదు
కాలానికి మధ్య గీసే గీతలు
ఎంతోకాలం నిలువవు
జీవితమొక
అఖండపుష్పం.
అది ఎప్పుడో రాలిపోయ వుండొచ్చు
కాని దాని పరిమళం మాత్రం
చిరకాల సూత్రం.

- డా. ఎన్.గోపి