Others

తనను తాను తినే చిలక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపం ఒక పెద్దమనిషి
ఒక చిట్టి చిలకను మోజుపడి తెచ్చుకున్నాడు
దానిలోనే తన ప్రాణం పెట్టి
పెంచుకోవడం మొదలుపెట్టాడు
ఊరంతా తిరగడానికి బాగానే స్వేచ్ఛనిచ్చాడు

పండ్లు, కాయలు, గింజలు..
బాగానే పెడుతున్నాడు
వాటన్నిటికీ ఓ నాజూకు రూపమిస్తూ
బాగానే పెద్దదయంది

అదేంటో కాని పెద్దదైన చిలక మనసులో
ఒక ఆకలి పులి ప్రవేశించింది
ఊళ్ళో దొరికిన జంతువుల్ని
పట్టి పీక్కుతునే విపరీత కళ కనిపెట్టింది
పండ్లు, కాయలు, గింజలు దూరంగా
నెట్టేయడం మొదలెట్టింది..
మాంసం తినొద్దని ప్రేమగా చెప్పాడు
బయటకు వెళ్లకుండా
ఇంట్లోనే చిలకను పెట్టాడు
చిలక ఊరుకుందా!
పెంపుడు జంతువుల్ని తినడం కూడా నేర్చింది
ఇక తప్పలేదు -
మనస్కరించకపోయనా పంజరంలో పెట్టాడు..

చిలక చిలక అనుకున్నారా,
మాంసం రుచి బాగా మరిగింది కదా -
కళ్ళు మూసుకుపోయ కటి కాకలితో
తనను తానే రక్కేసుకుని
తన మాంసం తానే తినడం మొదలుపెట్టింది..
ఇప్పుడు నా దిగులంతా
చిలక గురించి కాదు-
చిలకలో ప్రాణం పెట్టుకున్న
పెద్దమనిషి గురించి!

- డా. రావి రంగారావు, 9247581825