S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

08/01/2019 - 18:50

సోషల్ మీడియా.. ఈ రోజుల్లో మనుషులు ఇందులో నవ్వుతున్నారు.. ఏడుస్తున్నారు.. అరుస్తున్నారు.. ఇంకా ఏమేమో చేస్తున్నారు. ప్రపంచ జనాభాలో దాదాపు 300 కోట్లమంది సోషల్ మీడియాలో విహరిస్తున్నట్లు అంచనా. అంటే దాదాపు ప్రపంచ జనాభాలో నలభై శాతం మంది. వీరు రోజుకు సగటున రెండు గంట సమయం ఇందులోనే గడుపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జీవితంలో ఇంతగా భాగమైపోయిన ఈ సోషల్ మీడియా మనిషికి భారంగా మారుతోందా?

07/31/2019 - 18:42

తేనె కంటే తీయనివి.. అమృతం కంటే మధురమైనవి.. ఇలా తల్లిపాల గురించి ఎన్ని విశేషణాలు చెప్పుకున్నా తక్కువే.. నవమాసాలు తన కడుపులో దాగి, బయటపడ్డ బిడ్డను చూడగానే.. గుండెల్లోంచి ఉప్పెనలా పొంగే చనుబాల కంటే వింత మరొకటి ఉంటుందా? ఈ లోకంలో.. కడుపులో ఉన్నప్పుడే కాదు, శిశువు బయటకు వచ్చిన తరువాత కూడా.. అంటే ఈ లోకంతో పరిచయమయ్యేవరకు తన శరీరంలోని అమృతంతోనే బిడ్డను పెంచుతుంది తల్లి.

07/30/2019 - 19:07

డాన్స్, బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్, యోగ, టెన్నిస్.. వీటన్నింటినీ ఆత్మవిశ్వాసం,
పట్టుదలతో నేర్చుకుని వినికిడి లోపాన్ని మరిచిపోయేలా చేసుకుంది. అలాగే అందాల పోటీల కోసం కష్టపడింది.
గుర్‌గావ్, నోయిడాల్లో అందాల పోటీలకు శిక్షణ తీసుకుంది. అలా విదిశా ‘మిస్ డెఫ్ వరల్డ్ ’గా నిలిచింది.

07/29/2019 - 18:25

ప్రాచీన కాలంనుంచి సౌందర్య సాధనాలలో గోరింటాకు ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. ఆషాడంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటున్నారు. వేదాలలో గోరింటాకు ఎరుపును సూర్యునికి ప్రతీకగా చెపుతారు. సంస్కృతంలో గోరింటాకు చెట్టును ‘మెంథికా’ అంటారు. ఆ పదం నుంచే మెహిందీ వచ్చింది.

07/28/2019 - 22:49

ఆమె పేరు జెస్సికా కాక్స్. వయస్సు 36 సంవత్సరాలు. ఈమెది అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలోని టక్సన్ ప్రాంతంలో 1983లో జెస్సికా జన్మించింది. ఆమె జన్మించినప్పుడు ఆమెకు ఇరుభుజాలు లేవు. ఆమెను చూసిన డాక్టర్లు, తల్లిదండ్రులు స్థాణువులయ్యారు. జెస్సికా తల్లి గర్భంతో ఉన్నప్పుడు చేసిన స్కానింగ్ రిపోర్ట్స్ సాధారణంగా ఉన్నాయని భావించడం వల్ల లోపల ఉన్న పాపాయికి భుజాలు లేవు అన్న విషయాన్ని గమనించలేకపోయారు.

07/26/2019 - 18:37

ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు అయిన ‘ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్’కు గురువారం రోజున లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్ బిల్లును ఇకపై క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. ఈ బిల్లుపై రాజ్యసభలో కూడా చర్చించి.. ఆమోదం పొందితే అది చట్టంగా రూపొందుతుంది. అసలు ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్ అంటే ఏంటంటే..

07/25/2019 - 18:51

అమ్మాయిలు బొద్దుగా మారడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆరోగ్య కారణాలు, వంశపారంపర్యం, వ్యాయామలేమి.. ఇలా ఎన్నో.. అలాగని బొద్దుగా ఉన్నవారు ఫ్యాషన్ జోలికి వెళ్లకూడదా? రకరకాల ఫ్యాషన్లు అనుసరించడానికి వీలులేదా? బొద్దుగా ఉంటే అన్ని డిజైన్లు నప్పవు.. ఇలాంటివన్నీ పాత మాటలు. ఇప్పుడు బొద్దుగా ఉన్నవారికి కూడా రకరకాల ఫ్యాషన్లలో దుస్తులు లభిస్తున్నాయి.

07/24/2019 - 19:42

అది మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని ‘మలేషియా ప్రొ రెజ్లింగ్’ స్టేడియం.. కండలు తిరిగిన కుర్రాళ్లున్న బరి.. వారితో కుస్తీ పట్టడానికి బురఖాతో ఉన్న పందొమ్మిదేళ్ల అమ్మాయి వచ్చింది. కండలు తిరిగిన అబ్బాయిలతో ఒకమ్మాయి.. అదీ బురఖాతో ఉన్న అమ్మాయి కుస్తీనా.. అనుకునేలోపే.. ఆమె బెబ్బులిలా రింగులోకి దూకి.. ఒక్కొక్కరినీ మట్టికరిపించింది. అంతే స్టేడియమంతా అభినందనలతో, చప్పట్లతో దద్దరిల్లిపోయింది.

07/23/2019 - 20:33

పోషకాహారాన్ని ఇండివిడ్యువల్ బేస్డ్‌గా తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? రకరకాల అనారోగ్య సమస్యలకు ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి? ఇలాంటి ఎన్నో సందేహాలు ప్రతి ఒక్కరినీ సతమతపెడుతుంటాయి. వీటన్నింటికీ సమాధానంగా ‘మైటీ మిల్లెట్స్’ స్టార్టప్‌ను ప్రారంభించింది మీనా జైన్. దీని ద్వారా క్లయింట్లకు ఆరోగ్యాన్ని, చక్కని జీవనశైలిని, పోషకాహారాన్ని అందిస్తూ.. వాళ్లకి ఆరోగ్యం పట్ల దిశానిర్దేశం చేస్తోంది మీనా.

07/22/2019 - 18:14

ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు.. ఫలితాలు వచ్చినప్పుడు టీవీల్లో వచ్చే వాణిజ్య ప్రకటన కాదిది. అసోం రన్నర్ పందొమ్మిదేళ్ల హిమదాస్ వరుస పసిడి పతకాలతో సృష్టించిన సంచలనం. పద్దెనిమిది రోజుల్లో ఏకంగా ఐదు స్వర్ణాలు కొల్లగొట్టి భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేసింది హిమదాస్. సరిగ్గా సంవత్సరం క్రితం జులైలోఅండర్-20 వరల్డ్ చాంపియన్‌షిప్ 400 మీ.

Pages