మెయిన్ ఫీచర్

ఆమె దీక్షకు జోహార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె పేరు జెస్సికా కాక్స్. వయస్సు 36 సంవత్సరాలు. ఈమెది అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలోని టక్సన్ ప్రాంతంలో 1983లో జెస్సికా జన్మించింది. ఆమె జన్మించినప్పుడు ఆమెకు ఇరుభుజాలు లేవు. ఆమెను చూసిన డాక్టర్లు, తల్లిదండ్రులు స్థాణువులయ్యారు. జెస్సికా తల్లి గర్భంతో ఉన్నప్పుడు చేసిన స్కానింగ్ రిపోర్ట్స్ సాధారణంగా ఉన్నాయని భావించడం వల్ల లోపల ఉన్న పాపాయికి భుజాలు లేవు అన్న విషయాన్ని గమనించలేకపోయారు. అందుకే పుట్టిన వెంటనే జెస్సికాను చూసినప్పుడు తట్టుకోలేకపోయారు. ఏడ్చారు. కానీ అంతలోనే వారు పాపకు భుజాలు లేవు అన్న వాస్తవాన్ని స్వీకరించారు. ధైర్యంగా నిలబడ్డారు. పాప పెరిగిన తరువాత కూడా తనకు చేతులు లేవు అని ఎప్పుడూ కుంగిపోనీకూడదని కోరుకున్నారు. అందుకే ముందునుంచీ పాపకు అన్నీ నేర్పించాలనుకున్నారు. అందుకని అందరి పిల్లలకు భిన్నంగా ఆమె పెంచాలనే ఆలోచనను మానుకున్నారు. తాను అందరిలాంటిదే అన్న భావన జెస్సికాకు కలిగేలా మామూలు స్కూల్లోనే ఆమెను చదివించారు జెస్సికా తల్లిదండ్రులు. మామూలు పిల్లలతోనే ఆడుకునేలా చేశారు. అయితే ఆ పిల్లలకు ఆమెకు చేతులు లేవని జెస్సికాను ఎక్కువ ప్రేమగా చూడటం, ఆమె పట్ల జాలి చూపించడం జెస్సికాకు విసుగు తెప్పించేది. అందుకే అందరితో కలిసి ఆడుకోవడం నచ్చక.. తనకు తానుగా ఆడుకోవాలని తహతహలాడేది.
జెస్సికా ఐదు సంవత్సరాల వయస్సులో ఆమెకు కృత్రిమ చేతులు పెట్టారు. రోజూ స్కూలు నుంచి వచ్చాక కృత్రిమ చేతులను ఎలా ఉపయోగించాలన్న విషయంపై జెస్సికాకు ప్రాక్టీసు ఉండేది. పద్నాలుగేళ్ల వరకు కృత్రిమ చేతులతోనే జెస్సికా తన బాల్యాన్ని గడిపింది. ఎన్ని రోజులు గడిచినా జెస్సికాకు అవి కృత్రిమ చేతులే అనిపించాయి కానీ తన చేతులు అనిపించలేదు. పైగా ఆ కృత్రిమ చేతులతో అన్ని పనులూ కష్టంగా తోచాయి ఆమెకు. అందుకే ఆమె ‘ఇవి నాకెందుకు? నాకంటూ రెండు కాళ్లను దేవుడు ఇచ్చాడు. కష్టమైనా వాటినే నా రెండు చేతులుగా మార్చుకుంటాను’ అని నిర్ణయించుకుంది. నెమ్మదిగా ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంది. అలా కృత్రిమ చేతులను పక్కకు పడేసింది. అప్పటినుంచి జెస్సికా తనను తానుగా ఎంతో పట్టుదలతో సాధన చేసింది. అక్కడినుంచి ఆమె జీవితం మలుపు తిరిగింది.
కాళ్లతో షూస్ వేసుకోవడం, ఈతకొట్టడం, టైప్ చేయడం, పియానో వాయించడం, కారునడపడం వంటివాటన్నింటినీ ఎంతో పట్టుదలతో, శ్రద్ధతో నేర్చుకుంది. అంతేకాదు యుద్ధవిద్య ‘టైక్వాండో’లో జెస్సికా బ్లాక్‌బెల్ట్ సాధించింది. వీటితో పాటు కళ్లలో కాంటాక్ట్ లెన్సులు పెట్టుకోవడం, తీయడం కూడా ఆమె కాళ్లతో అతి సులువుగా చేయగలదు. ఇవన్నీ ఆమె ఎంతో కష్టపడి నేర్చుకుంది. శారీరక పరిమితులను లెక్కపెట్టలేదు. అందుకే మెదడు వేసే బంధనాలను తెంచుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. జెస్సికా ఫిలాసఫీలో డిగ్రీ చేసింది. తరువాత ఆమెకు విమానం నడపాలనే కోరిక పుట్టింది. మొదట ఈ కోరిక పుట్టినందుకు భయపడింది. తరువాత నేను తలచుకుంటే ఇది సాధ్యమే.. అని తనను తాను సంసిద్ధం చేసుకుంది. ఆమెకు ట్రైనింగ్ ఇచ్చేందుకు మొదట ఏవియేషన్ క్లబ్బులు సందేహించినా 2005లో అంగీకరించాయి. ఇక జెస్సికా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రైనింగ్ మొదలుపెట్టింది. అనేక ప్రయత్నాలు, వైఫల్యాల తర్వాత 2008లో ఆమెకు విమానం నడపడానికి అనుమతిపత్రం లభించింది. ఇప్పుడు జెస్సికా ధైర్యంగా, సీతాకోకచిలుకలా ఎగురుతోంది.
పెడల్స్ లేని లైట్ వెయిట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడపడానికి ఇప్పుడు జెస్సికా దగ్గర లైసెన్స్ కూడా ఉంది. ఇలాంటి లైసెన్స్ పొందిన మహిళ జెస్సికా ఒక్కతే. జెస్సికా విజయగాథ విని దాదాపు ఇరవై దేశాల యూనివర్శిటీలు స్ఫూర్తిదాయక ప్రసంగాల కోసం ఆమెను ఆహ్వానించాయి. ఆమె స్వయంగా మోటివేషనల్ స్పీకర్‌గా జనాలను ఉత్తేజపరుస్తుంటుంది. టైక్వాండో శిక్షణలో పరిచయమైన పాట్రిక్‌నే జెస్సికా వివాహం చేసుకుంది. నేడు వారిద్దరూ ఎంతో సంతోషంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నేడు ప్రపంచమంతా జెస్సికానే చూస్తోంది. ‘మీ కలలు కేవలం రెండు భుజాలు మాత్రమే ఉన్నాయన్న భావనని మొదట తీసేయండి. మీకు వేయి భుజాలు ఉన్నాయని నమ్మినప్పుడే దేన్నయినా సాధిస్తారు’ అని చెబుతుంది అందరికీ జెస్సికా. అన్నట్లు చెప్పడం మరిచాను.. జెస్సికా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. హేట్సాఫ్ జెస్సికా.
*