మెయిన్ ఫీచర్

బిడ్డకు తొలి రక్షణ తల్లిపాలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేనె కంటే తీయనివి.. అమృతం కంటే మధురమైనవి.. ఇలా తల్లిపాల గురించి ఎన్ని విశేషణాలు చెప్పుకున్నా తక్కువే.. నవమాసాలు తన కడుపులో దాగి, బయటపడ్డ బిడ్డను చూడగానే.. గుండెల్లోంచి ఉప్పెనలా పొంగే చనుబాల కంటే వింత మరొకటి ఉంటుందా? ఈ లోకంలో.. కడుపులో ఉన్నప్పుడే కాదు, శిశువు బయటకు వచ్చిన తరువాత కూడా.. అంటే ఈ లోకంతో పరిచయమయ్యేవరకు తన శరీరంలోని అమృతంతోనే బిడ్డను పెంచుతుంది తల్లి. బిడ్డకు పోషణ, రక్షణ ఇచ్చేది తల్లిపాలే.. శిశువు పెరగడానికి అవసరమైన పోషణను అందించడమే కాక, రోగనిరోధకశక్తి బలోపేతానికి ఊతం అయ్యేవి కూడా తల్లిపాలే.. ఎదిగిన తరువాత కొన్ని జబ్బుల బారిన పడకుండా ఉండటానికి కూడా తల్లిపాలు ఉపయోగపడతాయి. అందుకే పుట్టిన గంటలోపే తల్లిపాలను తాగించడం తప్పనిసరి. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వడం తల్లి చేసే సహజమైన, లాభదాయకమైన కర్తవ్యం. ఏ ఔషధం ఇవ్వని అద్భుతమైన ఆరోగ్య సంబంధమైన లాభాలు తల్లిపాల వల్ల బిడ్డకు కలుగుతాయి. పాలలోని యాంటీ బాడీస్ పుట్టిన వెంటనే బిడ్డకు రోగాల నుండి రక్షణ కల్పించడమే కాకుండా పాలలోని ప్రత్యేక పోషకాలను బిడ్డకు అందిస్తాయి. ఏ విధమైన పదార్థాలు తల్లిపాలు తాగిన బిడ్డకు ప్రస్తుత, భవిష్యత్తు ఆరోగ్యాన్ని ప్రభావితం చెయ్యవు. కానీ ప్రస్తుత సమాజం తల్లిపాలను అనవసరమైనవిగా భావిస్తున్నారు. తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా ఫార్ములా పాలను బిడ్డలకు అందిస్తున్నారు. ఈ ఫార్ములా పాలలో ఎన్ని విటమిన్‌లు, ఖనిజ లవణాలు ఉన్నప్పటికీ తల్లి పాలకు సరితూగవు. తల్లిపాలు ఒక్కటే సహజమైన, పరిపూర్ణమైన, క్లిష్టమైన చిన్న పిల్లల ఆహారం. చంటి పిల్లలకు ఆరోగ్యాన్ని, విలువైన జీవితాన్ని నమ్మకంగా అందిస్తాయి తల్లిపాలు. భవిష్యత్తులో రోగనిరోధకశక్తిని పెంపొందించి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడగల పోషకాలు తల్లిపాలలో మాత్రమే ఉన్నాయి. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యత, ప్రాముఖ్యతపై అవగాహన పెరిగింది. ఏటా తల్లిపాల వారోత్సవాలు ఆగస్ట్ ఒకటోతేదీ నుండి ఏడో తేదీ వరకు నిర్వహిస్తారు. అమెరికన్ ఆఫ్ పిడియాట్రిక్స్, అమెరికన్ హెల్త్ అసోసియేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) బిడ్డలకు ఆహారంగా తల్లిపాలు అన్నింటికన్నా మిన్న అని సిఫార్సు చేస్తోంది. ఆరోగ్యవంతమైన తల్లి బిడ్డ పెరుగుదలకు అవసరమైన పాలను బిడ్డకు ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు ఇవ్వచ్చు అని డాక్టర్ల సలహా.
బిడ్డకు తల్లే ఆధారం. కడుపులో ఉన్నప్పుడైనా.. కడుపులో నుండి బయటపడినప్పుడైనా.. శిశువు అన్ని అవసరాలు తీర్చేది తల్లే.. కడుపులో ఉన్నప్పుడు బిడ్డ శరీర అవయవాలు ఒకరకంగా అభివృద్ధి చెందితే.., బిడ్డ పుట్టిన తరువాత శరీర అవయవాల అభివృద్ధి మూడు నెలల్లో రెట్టింపుగా వృద్ధి చెందుతుంది. కారణం తల్లిపాలు. ఇన్ని విశేషాలు ఉన్న తల్లిపాలను భారతదేశంలో కేవలం 37 శాతం మంది పిల్లలే ఆరునెలల వరకు పూర్తిగా తాగుతున్నారు. తల్లిపాల గొప్పతనం తెలియకపోవడమో, ఇచ్చే వెసులుబాటు లేకపోవడమో, వక్షోజాల అందం తగ్గుతుందనో.. తెలియదు కానీ చాలామంది శిశువులు తల్లిపాల రుచి చూడటం లేదు. నిజానికి చనుబాలు పిల్లలకు ప్రత్యేక ఔషధం. వీటిని సరిగ్గా ఇవ్వగలిగితే ఏటా 8.23 లక్షల మంది పిల్లలను ఐదేళ్లలోపు మరణించకుండా కాపాడుకోవచ్చు. పిల్లలకు చనుబాలు ఇవ్వకపోవడం వల్ల, రొమ్ముకేన్సర్లతో మరణిస్తున్న 20 వేల మందిని కాపాడుకోవచ్చు.
ప్రత్యేకతలు
* తల్లిపాలలో బిడ్డ ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. పైగా ఇవి తేలిగ్గా జీర్ణమవుతాయి.
* తల్లిపాలలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. బిడ్డ శారీరక అవసరాలకు తగినట్లుగా తల్లిపాలు మారుతూ ఉండటం.. అంటే కాన్పు జరిగిన మొదటిరోజు నుంచి నాలుగు రోజుల వరకు ముర్రుపాలు (కొలస్ట్రమ్) అమృతతుల్యం. బిడ్డకు తొలి పోషణ, రక్షణ లభించేది వీటి నుంచే.. 5-14 రోజుల వరకు వచ్చే తల్లిపాలు వేగంగా పెరిగే బిడ్డ శరీర అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. ఇవి ముర్రుపాల కంటే రంగులోనూ, చిక్కదనంలోనూ తేడాగా ఉన్నప్పటికీ బిడ్డకు గొప్ప శక్తిని అందిస్తాయి. వీటిలో లాక్టోజ్, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. రెండు వారాలు దాటిన తర్వాత పాలు పరిపక్వ దశకు అంటే మామూలు దశకు చేరుతాయి. ఇందులో 90 శాతం నీరు, పిండిపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు 8 శాతం, విటమిన్లు 2 శాతంగా ఉంటాయి. ఇవి బిడ్డ సంపూర్ణ ఎదుగుదలకు సాయం చేస్తాయి. అందుకే బిడ్డ పుట్టిన తొలిగంటలో ఇచ్చే ముర్రుపాలను తొలి టీకాగా భావించవచ్చు. మామూలు కాన్పు కాకపోయినా, సిజేరియన్ అయినా సరే వీలైనంత త్వరగా బిడ్డకు తల్లిపాలను ప్రారంభించాలి.
* తక్కువ కాలం తల్లిపాలు తాగిన వారితో పోలిస్తే, ఎక్కువకాలం తల్లిపాలు తాగిన పిల్లల్లో ఇన్‌ఫెక్షన్లు, మరణాల ముప్పు తక్కువగా ఉండటమే కాక, తెలివితేటలు అధికంగా ఉంటాయి.
* తల్లిపాలు తాగిన వారికి భవిష్యత్తులో అధిక బరువు, మధుమేహం, కేన్సర్ వంటి ముప్పులు ఉండవు.
* తల్లిపాలల్లో ‘హ్యూమన్ ఓలిగోసాక్రైడ్లు’ ఉంటాయి. ఇవి ఒక విధమైన చక్కెరలు. ఇవి ఇతర పాలిచ్చే జంతువుల్లో ఉండవు. కేవలం తల్లిపాలల్లో మాత్రమే ఉంటాయి. ఇవి పేగుల్లోని చెడు బాక్టీరియాను నిలువరించి, మంచి బాక్టీరియాను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
* తల్లిపాలతో రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా వారు ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడవచ్చు.
* పిల్లలకు ఆరు నెలలు నిండేంత వరకు తల్లిపాలు తప్ప మరే ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రేమగా, ఆప్యాయతగా తల్లి ఇచ్చ పాలతో బిడ్డకు కావలసిన పోషకాలన్నీ అందుతాయి. ఆరునెలల తర్వాత బిడ్డకు తల్లిపాలు ఇస్తూనే ఘనాహారం ప్రారంభించాలి. ఇలా తల్లిపాలను రెండు సంవత్సరాల వరకూ కొనసాగించాలి.
* శిశువులు ఆకలి వేసినప్పుడే కాదు, దాహం వేసినా, తల్లి స్పర్శ కావాలన్నా తల్లిపాల కోసం చూస్తారు.
* తల్లిపాలు చాలా సురక్షితం. వీటివల్ల ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు ఉండవు. అదే పోతపాలతో చాలా చిక్కులు ఎదుర్కోవాలి. సీసాలను సరిగా శుభ్రం చేయకపోయినా, కలిపి ఉంచిన పాలను శిశువుకు తాగించినా విరోచనాలు మొదలవుతాయి. అంతేకాదు గొంతునొప్పి, ఊపిరితిత్తుల్లో నెమ్ము, పిప్పిపళ్లు.. వంటి రకరకాల సమస్యలు తలెత్తుతాయి.
* తల్లిపాలతో అలర్జీలు, అస్థమా ముప్పు తగ్గుతుంది. ఆరు నెలల వరకూ పూర్తిగా తల్లిపాలు తాగే పిల్లలకు చెవి ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ జబ్బులు, విరేచనాల సమస్యలు వచ్చే అవకాశం తక్కువ.
* తల్లిపాలు తాగిన పిల్లలకు ఐక్యూ (తెలివి తేటలు) కూడా ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
* వయసుకు తగ్గ బరువు ఉండేలా చూడటంలో తల్లిపాలు కీలకపాత్ర పోషిస్తాయి.
* శిశువు పాలు తాగడం మొదలుపెట్టగానే తల్లి మెదడు నుంచి సంకేతాలు వెలువడతాయి. ఫలితంగా ఆక్సిటోసిన్ అనే హార్మోను విడుదలవుతుంది. ఇది పాలు పడటానికే కాకుండా గర్భాశయం త్వరగా సంకోచించడానికి కూడా దోహదం చేస్తుంది. దీంతో కాన్పు తర్వాత ఉండే అధిక రక్తస్రావం కూడా తగ్గుతుంది.
* బిడ్డకు పాలు పట్టడం ద్వారా తల్లి శరీరంలో ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. దీంతో గర్భధారణ సమయంలో పెరిగి బరువు త్వరగా తగ్గుతుంది.
* పిల్లలకు తల్లి పాలను ఇవ్వడం వల్ల కాన్పు తర్వాత వచ్చే డిప్రెషన్ తగ్గుతుంది.
* బిడ్డకు పాలిచ్చే తల్లులకు రొమ్ము కేన్సర్, గర్భాశయ కేన్సర్ ముప్పు తక్కువగా ఉంటుంది.
* గుండె జబ్బులు, ఎముకలు వ్యాధులు కూడా రావు.
* తల్లిపాలు తాగే పిల్లల్లో ముఖాకృతి సరిగ్గా ఉంటుంది. పళ్ల వరుస చక్కగా ఉండి, దంత క్షయం రాకుండా ఉంటుంది.
* సిడ్స్ (సడన్ ఇన్‌ఫాంట్ డెత్ సిండ్రోమ్) వల్ల పిల్లల్లో మరణాపాయం ఎక్కువ. పరిశోధనల్లో తేలిందేమిటంటే.. తల్లిపాలు తాగే పిల్లల్లో సిడ్స్ వల్ల ఏర్పడే అపాయం చాలా తక్కువ.
* తల్లిపాలు తాగే పిల్లల్లో విటమిన్ ఇ, రక్తహీనత, అపెండిసైటిస్, అర్థరైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువ.

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి