మెయిన్ ఫీచర్

అమ్మంటే.. అంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నబిడ్డకోసం.. కఠిన ప్రయాణం
*
కరోనా మహమ్మారి..
లాక్‌డౌన్..
పోలీసుల ఆంక్షలు..
ఇవేవీ.. ఆ తల్లి ప్రేమ ముందు నిలబడలేకపోయాయి.. 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడుకును చేరడానికి ఆమె చేసిన ప్రయత్నాన్ని ఆపలేకపోయాయి.. నెల్లూరులో ఆంక్షల కారణంగా ఆగిపోయిన తన కొడుకుని తీసుకురావడానికి ఆ తల్లి చేసిన ప్రయత్నం సాటిలేనిది.. స్కూటీపై 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఆ తల్లి సాహసం గురించి తెలపాలంటే..
బోధన్ పట్టణానికి చెందిన రజియాబేగం ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు.. ఆమె భర్త పనె్నండు సంవత్సరాల కిందట మృతి చెందారు. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్దకొడుకు యాసర్ బీటెక్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. కూతురు ఆయేషా డిగ్రీ పూర్తిచేసింది. చిన్న కొడుకు నిజాముద్దీన్ ఇంటర్ పూర్తిచేసి హైదరాబాద్‌లో నీట్‌కు శిక్షణ తీసుకుంటున్నాడు. నిజాముద్దీన్ సహ విద్యార్థితో కలిసి మార్చి 12న నెల్లూరుజిల్లా రహమతాబాద్‌కు వెళ్లాడు. ఆ తరువాత కొవిడ్-19 నేపథ్యంలో ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో నిజాముద్దీన్ అక్కడి నుంచి కదలలేకపోయాడు. ఇది తెలుసుకున్న రజియాబేగం కలవరపడింది. ప్రపంచమంతా ఆందోళనలో ఉన్న తరుణంలో తన కొడుకుపై ఆమెకు మరింత బెంగ పట్టుకుంది. అక్కడ క్షేమంగా ఉన్నాడులే.. అని మనసుకు ఎంత నచ్చజెప్పుకున్నా.. మనసు ఆమె మాట వినడం మానేసింది. కలవరపడసాగింది.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కొడుకు తన కళ్లెదుట లేడే అనే కలత మొదలైంది. వేరెవరికైనా తన సమస్య చెప్పి తన కొడుకు దగ్గరకి పంపిద్దామనుకున్నా.. ఈ ప్రాణాంతక సమయంలో మరొకరి ప్రాణాలను పణంగా పెట్టడానికి ఆమె మనసు అంగీకరించలేదు.. అందుకని ఆమే స్వయంగా బయలుదేరి వెళ్లాలని నిశ్చయించుకుంది. ఉద్యోగరీత్యా పాతికేళ్లుగా ద్విచక్ర వాహనం నడిపే అలవాటు ఉండటంతో దానే్న రవాణా సాధనంగా మలచుకుంది ఆమె.
ఇంట్లో చెబితే వెళ్లనివ్వరని చెప్పకుండానే బయలుదేరింది. వెళ్లేముందు బోధన్ ఏసీపీ జైపాల్‌రెడ్డిని కలిసి తన సమస్యను వివరించింది. ముందు అతను రజియాకు అనుమతినివ్వలేదు. ఒక ఆడమనిషి అంతదూరం స్కూటీపై ఎలా ప్రయాణం చేస్తుంది అనుకున్నాడు. తరువాత ఆ తల్లి ఆవేదనను గ్రహించి ఆమెకు అధికారిక లేఖను ఇచ్చాడు. ఎక్కడైనా పోలీసులు ఇబ్బంది పెడితే మాట్లాడించమని ఆయన తన ఫోన్ నెంబర్ కూడా ఆమెకు ఇచ్చారు. అలా రజియా రెండు చపాతీలను ప్యాక్ చేసుకుని స్కూటీపై కొడుకు కోసం బయలుదేరింది.
గూగుల్ మ్యాప్‌ను వినియోగించి తన ప్రయాణాన్ని కొనసాగించింది. తను వెళ్లే మార్గంలో ఇంధన సమస్యను అధిగమించడానికి ఐదు లీటర్ల పెట్రోలు డబ్బాను వెంటబెట్టుకెళ్లి.. పెట్రోలు నిరంతరం నిల్వ ఉండేలా చూసుకుంది. తూప్రాన్, గజ్వేల్ మీదుగా ప్రయాణం కొనసాగించి.. 26 గంటల్లో 700 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. దారిలో పోలీసులు ఎన్నోసార్లు అడ్డుకున్నారు. వారికి తన సమస్యను వివరిస్తూ బతిమాలుకుని ఆంక్షల అడ్డంకులను అధిగమించిందామె. కొడుకును చేరుకుంది. తన ప్రాణానికి ప్రాణమైన బిడ్డను కళ్లారా చూసేంతవరకు ఆ తల్లికి మనశ్శాంతి లేదు. తన బిడ్డను గుండెలకు పొదువుకున్నాకే ఆ హృదయం నెమ్మదించింది. తరువాత తన కొడుకుతో పాటు తిరిగి తన ఊరికి ప్రయాణం చేసింది రజియా. పిల్లల విషయంలో తల్లి ప్రేమ ఎక్కడి వరకైనా తీసుకెళుతుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం రజియా.. ఆమె కనబర్చిన ధైర్యం అసామాన్యం. కొడుకు కోసం
ఆమె చేసిన ప్రయాణం
నిజంగా పెద్ద సాహసకృత్యమే..