మెయిన్ ఫీచర్

సాధికారత సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, అని మన స్మృతులు చెప్పాయి. అంటే ‘ఎక్కడ స్ర్తిలకు గౌరవం లభిస్తుందో, అక్కడ దేవతలు పూజలందుకొంటారు సమాజంలో ఉన్న అసమానతలను రుగ్మతలను తొలగించిన నాడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది.. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రతి మహిళా సద్వినియోగం చేసుకోవాలి ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆనందంగా ఉంటుంది. మన దేశానే్న మనం ఒక స్ర్తిగా మూర్త్భీవించిన భారతమాతగా పేర్కొంటున్నాం. నాడు యుద్ధ రంగంలో వీర విజృంభణ చేసిన రాణీ లక్ష్మీబాయి నుంచి నేడు ఒకే రాకెట్‌లో 104 ఉపగ్రహాలను పంపిన ఇస్రో మహిళా శాస్తవ్రేత్తల వరకు వివిధ రంగాల్లో తమకు సాటిగల వారు లేరని స్ర్తిలు నిరూపిస్తున్న విషయాన్ని మనం గుర్తెరగాలి. సైన్స్, టెక్నాలజీ రంగాల్లోనే కాకుండా రాజకీయాలు, కళలు, సాహిత్యం, క్రీడలు, విద్య మొదలైన అనేక రంగాల్లో దేశం రాణించడానికి, అభ్యున్నతి చెందడానికి భారతీయ మహిళలు అద్భుతమైన కృషి చేశారు. ఆథ్యాత్మికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా స్ర్తిలను బలోపేతం చేయడమనే విషయాలు మహిళా సాధికారతలో ప్రస్తావించబడ్డాయి. స్వశక్తిపై విశ్వాసాన్ని అభివృద్ధిపరచడం కూడా సాధికారతలో కలిసి ఉంటుంది. 1990వ సంవత్సరంలో విదేశీ సంస్థల విరాళాల నుంచి పొందిన నిధుల ద్వారా మహిళల దృష్ట్యా పనిచేసే నూతన స్వచ్ఛంద సంస్థ ఏర్పర్చబడింది. స్వయం ఉపాధి మహిళా సంఘాలు (ఎస్.ఇ.డబ్ల్యు.ఎ-సేవా) వంటి స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు భారతదేశపు స్ర్తిల హక్కులపై ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. నర్మదా బచావో ఆందోళనలో మేధా పాట్కర్‌లాగా స్థానిక ఉద్యమాలలో చాలామంది మహిళా నాయకురాళ్లు ఉద్భవించారు. 2001 సంవత్సరాన్ని భారతదేశం మహిళా సాధికారతా సంవత్సరం (స్వశక్తి)గా ప్రకటించింది. స్ర్తి స్వశక్తిపై జాతీయ విధానం (పాలసీ) 2001 సంవత్సరంలో జారీ అయింది. భారతదేశపు మహిళా హోదా గృహహింస నిరోధ చట్టం, మహిళా సంక్షేమ పథకాలు, ఎన్నో పథకాలు స్ర్తికి రక్షణగా ఉన్నాయి.
ఒక చదువుకున్న తల్లి వంద మంది ఉపాధ్యాయులతో సమానం. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం, ఒక స్ర్తి తన ఇంటితో పాటు సమాజాన్ని, దేశాన్ని అభివృద్ధి చేస్తుంది. స్ర్తిలు ప్రతి రంగంలో అగ్రస్థానాలలో నిలిచి మంచి నిర్వాహకులు అని పేరుప్రతిష్ట తెచ్చుకున్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ అని ‘‘స్ర్తి’’ని ఉపనిషత్తులో అందరి కంటే అగ్రపూజ అందవలసిన మాతృమూర్తిగా అభివర్ణించారు.
ప్రకృతికి ప్రతీకగా జాతికే తొలి విజ్ఞానమైన ఋగ్వేదం తొలి ఆధారం. ఐతరేయ బ్రాహ్మణంలో
‘‘తజ్జాయా జాయ భవతి
యుద్దస్వాం జాయతే పునః’’
అంటూ పురుషుడు స్వయంగా స్ర్తి గర్భం నుండి పుత్ర రూపంలో జన్మిస్తాడని. ఈ స్ర్తి వలన పురుషునికి విశ్రామస్థానం, సుఖస్థానం అని చెప్పి స్వయంగా స్ర్తి గృహరూపం అంటూ సంభాషించింది. వేదకాలం నుండి సమాజంలో పురుషులకు స్ర్తి పట్ల పూజ్యభావం అమితంగా ఉన్నది. నాటి కాలంలో కూడా స్ర్తిలు పురుషులతో సమానంగా విజ్ఞాన మార్గంలో, బ్రహ్మజ్ఞానంతో ప్రకాశించే వారు కాబట్టే నాటి కాలమే స్ర్తిని పురుషుడు అమితంగా గౌరవించేవారు. వైదిక విద్య అందరికీ విస్తరించింది. ఋగ్వేదంలో ప్రథమ మండలంలో 48, 49 సూక్తులు ప్రత్యేకంగా స్ర్తిల కోసమే ఉపదేశించాయి.
వైదిక సంస్కారాలన్నీ విశేషంగా స్ర్తి గౌరవాన్ని చాటుతాయి.
స్ర్తియశ్చా - పురుషా మార్గాం సర్వాలంకార భూషితాః
నిర్భయా ప్రతిదద్యనే్త
యధారక్షిత భూమిపాః
ఏ దేశంలో అయితే మహిళలు సర్వాంగ సుందరంగా ఆభరణాలతో అలంకరించుకుని పురుషుని సహాయం, తోడు లేకుండా రహదారులలో, వీధులలో ధైర్యంగా ఏ భయ భ్రాంతులు లేకుండా తిరగగలదో ఆ దేశం సుపరిపాలన కలది అని పంచమ వేదమైన మహాభారతం చెప్పింది.
వేదకాలం నుండి స్ర్తిని అత్యధికంగా గౌరవిస్తూనే స్ర్తి రక్షణ కొరకు అనుక్షణం ఆరాటపడుతూనే ఉంది. యావత్ సమాజంలో నేటికీ కొనసాగుతూనే ఉంది. గాంధీమహాత్ముడు కూడా ఈ మాటే అన్నాడు. స్ర్తికి రక్షణ ఉంటే లోకానికే రక్షణ కలుగుతుందని చెప్పాడు. అనాదిగా కొనసాగుతున్న పితృస్వామ్య వ్యవస్థ మహిళలను శారీరకంగా, మానసికంగా బలహీనులుగా మార్చి లింగపరమైన అసమానతల సమాజంగా మార్చడం వల్లనే మహిళలపై వివిధ రకాల దాడులు జరుగుతున్నాయని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
నైతిక విలువల పతనం చట్టంపై అవగాహనారాహిత్యం లైంగిక వేధింపులు, బెదిరింపులు సమాజంలో మార్పు, కేవలం చట్టాల సవరణ, కొత్త చట్టాల రూపకల్పన ద్వారా మహిళా రక్షణ కలిగించవచ్చు. మహిళలపై అత్యాచారాలను రూపుమాపవచ్చు అనే అభిప్రాయం సరి అయినది కాదు. ఎన్ని చట్టాలు వచ్చినా సమాజంలో ముందు మార్పు రావాలి. చట్టాల ద్వారా మార్పు రాదేమో కానీ అభ్యుదయం జరుగుతుంది. ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధిగా అమలు చేయాలి. అప్పుడే మహిళా సాధికారత సిద్ధిస్తుంది.

-సముద్రాల శ్రీదేవి 9949837743