మెయిన్ ఫీచర్

బొద్దుగా ఉన్నారా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మాయిలు బొద్దుగా మారడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆరోగ్య కారణాలు, వంశపారంపర్యం, వ్యాయామలేమి.. ఇలా ఎన్నో.. అలాగని బొద్దుగా ఉన్నవారు ఫ్యాషన్ జోలికి వెళ్లకూడదా? రకరకాల ఫ్యాషన్లు అనుసరించడానికి వీలులేదా? బొద్దుగా ఉంటే అన్ని డిజైన్లు నప్పవు.. ఇలాంటివన్నీ పాత మాటలు. ఇప్పుడు బొద్దుగా ఉన్నవారికి కూడా రకరకాల ఫ్యాషన్లలో దుస్తులు లభిస్తున్నాయి. ఆన్‌లైన్లలో కూడా నచ్చిన డిజైన్‌ను డబుల్ ఎక్సెల్‌లో కూడా చేసి ఇస్తున్నారు. కొంతమంది ఏకంగా ఓన్లీ డబుల్, లేదా ట్రిపుల్ ఎక్సెల్ సైజుల్లో డిజైన్లను ఆన్‌లైన్ షాపింగులో విక్రయిస్తున్నారు. ప్లస్ సైజ్ ఫ్యాషన్ అనీ, డబుల్ ఎక్సెల్ ఫ్యాషన్ అనీ రకరకాల డిజైన్లలో బొద్దుగా ఉన్నవారి కోసం తయారవుతున్నాయి. సన్నగా, నాజూకుగా ఉన్న అమ్మాయిలకే అన్ని డిజైన్లు, రంగుల దుస్తులు నప్పుతాయి వంటి మాటలకు ఫుల్‌స్టాప్ పెడుతూ.. బొద్దుగా ఉన్న అమ్మాయిలకు కూడా చాలా రకాల ఫ్యాషన్లు అందుబాటులో ఉంటున్నాయి. అవేంటో చూద్దాం..
* బొద్దుగా ఉన్నవారికి నలుపు ఫ్రెండ్లీ కలర్. ఏ రకం దుస్తులైనా ఈ రంగులో ఎంచుకుంటే సన్నగా కనిపించవచ్చు.
* ముదురు రంగులు వాటిపైన లేత ఛాయలు బొద్దుగా ఉన్నవారికి బాగా నప్పుతాయి.
* బొద్దుగా ఉన్నవారు సన్నగా కనిపించాలంటే రెండు మూడు రంగుల దుస్తులు కాకుండా ఒకే రంగును ఎంచుకోవడం మంచిది. దీనిపై సన్నని పూలు కానీ, డిజైన్ కానీ ఉన్నా ఫరవాలేదు.
* అనార్కలీ వంటివాటిని ఎంచుకోవాలనుకుంటే స్లిట్ లేకుండా చూసుకోవాలి. లైన్స్ ఉన్న అనార్కలీలు బొద్దుగా ఉన్న వారికి బాగా నప్పుతాయి.
* దుపట్టాలను ఎంచుకునేటప్పుడు మామూలు రకాలను కాకుండా డ్రేప్ తరహావి ఎంచుకోవాలి.
* మెడ విషయానికి వస్తే.. షర్ట్ కాలర్ టైపువి కాకుండా ఓపెన్ కాలర్స్ బాగుంటాయి. ఇవి భుజాలు పెద్దవిగా కనిపించకుండా చేస్తాయి.
* సంప్రదాయ దుస్తులు ఎంచుకున్నా, వెస్ట్రన్ టాప్‌లు అయినా సరే.. ఎంపైర్ లైన్ ఎంచుకుంటే చాలు పొట్ట భాగం హైలెట్ కాకుండా ఉంటుంది. జార్జెట్, సిల్క్, క్రేప్, హ్యాండ్‌లూమ్ రకాలు బొద్దుగా ఉన్నవారికి సౌకర్యంగా ఉంటాయి. సన్నగా కనిపించేలా చేస్తాయి. జార్జెట్ వంటివాటితో టాప్ కుట్టించుకుని దానికి జతగా బ్లూ డెనిమ్ వేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది.
* జీన్స్ ఫిట్టెడ్ రకాన్ని ఎంచుకుని దానికి జతగా పొడవాటి టాప్‌ను ఎంచుకోవాలి. హై అండ్ లో, ఎసెమెట్రికల్ టాప్స్ వీరికి చక్కగా నప్పుతాయి.
* లావుగా ఉన్నా ఎత్తుగా ఉన్నవారికి పొడవాటి గౌన్ బాగుంటుంది. దీనికి చిన్న చిన్న కుచ్చిళ్లు కూడా పెట్టించుకోవచ్చు. అయితే వెయిస్ట్ దగ్గర ఫిట్టింగ్ కానీ, పార్టిషన్ కానీ లేకుండా చూసుకోవాలి. ఈ నియమం అన్ని రకాల టాప్‌లకూ వర్తిస్తుంది.
* జంప్‌సూట్స్, క్లౌట్టీస్ రకాలు కూడా బొద్దుగా ఉన్నవారికి బాగా నప్పుతాయి. ముఖ్యంగా క్రాప్డ్ క్లౌట్టీస్, షార్ట్ టాప్‌తో జత చేసుకుంటే అందంగా ఉంటారు. దీనికి జతగా షార్ట్ జాకెట్ వేసుకుంటే కూడా కొత్త లుక్ వస్తుంది.
* లావుగా ఉన్నవారికి జాలువారే స్కర్టులు బాగుండవు అని అందరి అభిప్రాయం. కానీ లేత రంగుల్లో లాంగ్ స్కర్టుని ఎంచుకుని దానిపైకి సాలిడ్ కలర్ టాప్ వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో.. దీనిపైకి స్కార్ఫ్ కూడా వేసుకోవచ్చు.
* బొద్దుగా ఉన్నవారికి స్ట్రైప్స్ అంతగా బాగుండవు అనే అభిప్రాయం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు బ్రాండ్స్, డిజైనర్లు కొత్తగా డిజైన్ చేయడం వల్ల అసెమెట్రికల్ స్ట్రైప్స్ బాగుంటాయి.