మెయిన్ ఫీచర్

బురఖాతో బరిలోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని ‘మలేషియా ప్రొ రెజ్లింగ్’ స్టేడియం.. కండలు తిరిగిన కుర్రాళ్లున్న బరి.. వారితో కుస్తీ పట్టడానికి బురఖాతో ఉన్న పందొమ్మిదేళ్ల అమ్మాయి వచ్చింది. కండలు తిరిగిన అబ్బాయిలతో ఒకమ్మాయి.. అదీ బురఖాతో ఉన్న అమ్మాయి కుస్తీనా.. అనుకునేలోపే.. ఆమె బెబ్బులిలా రింగులోకి దూకి.. ఒక్కొక్కరినీ మట్టికరిపించింది. అంతే స్టేడియమంతా అభినందనలతో, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. అంతే ఛాంపియన్‌షిప్ బెల్టును విజయదరహాసంతో చేతుల్లోకి తీసుకుంది ఆమె. ఇంతకూ ఆమె పేరు చెప్పలేదు కదూ.. నూర్ డయానా. క్రీడాప్రియులు ఆమెను ముద్దుగా ‘్ఫనిక్స్’ అని పిలుచుకుంటారు. బరిలో ఉన్నప్పుడు ఆమె చురుకుదనాన్ని చూసిన ప్రేక్షకులు ఆమెను అలా పిలుస్తారు. వివరాల్లోకి వెళితే..
నూర్ డయానా ముస్లిం కుటుంబం నుంచి వచ్చింది. మలేషియాలో సుమారు 3 కోట్ల 20 లక్షల మంది సాంప్రదాయ ముస్లింలు ఉన్నారు. వీరిని మలయ్ ముస్లింలు అంటారు. అందులో డయానా కుటుంబం ఒకటి. ముస్లిం కుటుంబాల్లోని ఆంక్షలు అందరికీ తెలిసినవే.. రెజ్లర్‌గా శిక్షణ తీసుకోవాలని డయానా అనుకున్నప్పుడు ఆమె ఆలోచనలను కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. సాంప్రదాయానికి భిన్నంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు బంధువులు. ఒక ముస్లిం అమ్మాయి రెజ్లింగ్‌లో శిక్షణ తీసుకుంటానంటే సహజంగానే వ్యతిరేకత వస్తుంది. బురఖా ధరించి కుస్తీ పట్టడం అంటే అసాధ్యమని చాలామంది ఆమెను నిరుత్సాహ పరిచారు. చివరకు ఆమె పట్టుదల చూసిన డయానా కుటుంబ సభ్యులు మాత్రం ఆమెకు అండగా నిలిచారు. వారి ప్రోత్సాహంతోనే ఆమె రెజ్లింగ్‌లో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. ఆయేజ్ షౌకత్ దగ్గర డయానా శిక్షణ తీసుకుంది. కుస్తీ పట్టినప్పుడు సివంగిలా కనిపించే ఆమె భయస్తురాలు, నెమ్మదస్తురాలు. ఆమె మాటలు కూడా మృదువుగా ఉంటాయి. మలేషియాలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది డయానా. బరిలోకి దిగేటప్పుడు మాత్రం చాలా రఫ్‌గా మారిపోతుంది డయానా. ఎక్కడలేని ధైర్యం, తెగింపువచ్చేస్తుంది. అలుపెరుగకుండా పోరాడుతుంది. మామూలుగా నెమ్మదితనంగా వ్యవహరించే డయానా బరిలో ఆడబెబ్బులిలా పోరాడుతుందని.. ఆమె అభిమానులు ఆమెను ‘్ఫనిక్స్’ అని పిలుస్తారు. ఈ పక్షిలాగే డయానా కూడా భిన్నమైన వ్యక్తి. ఎవరూ ఊహించని విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది.
మొదట్లో డయానా తనను ఎవరూ గుర్తుపట్టకూడదని ముఖా
నికి మాస్క్ వేసుకుని బరిలోకి దిగేది. అయితే గత ఏడాదిలో ఒక మ్యాచ్ ఓడిపోయింది. ఈ సందర్భంలో మాస్క్ తీసేసి కేవలం తలపై మాత్రమే బురఖా ధరించడం మొదలుపెట్టింది. మొదట విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని భయపడినా తరువాత వరుస విజయాలు సాధించడంతో ఎవరూ ఆ వైపుగా దృష్టి పెట్టలేదు. ఆమె తెగువ, ధైర్యాన్ని మెచ్చుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు డయానాకు. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడు డయానా కోచ్ ఆయేజ్ షౌకత్ దగ్గర చాలామంది ముస్లిం అమ్మాయిలు మేము రెజర్లమవుతాం అని క్యూలు కడుతున్నారట. పసుపు, నారింజ రంగులు కలిసిన డిజైన్ వేసిన ట్రౌజర్, నలుపు, నారింజ రంగుల్లో ఉన్న టాప్.. అవే రంగులు కలగలసిన బుర్ఖా ధరించిన నూర్ డయానా బరిలోకి అడుగుపెడుతుంది. చూడటానికి నెమ్మదిగా, సున్నితంగా కనిపించే డయానాను చూసి ప్రత్యర్థి తక్కువ అంచనా వేశాడంటే ఓటమి తప్పదు. కనిపించేంత సున్నితంగానే వారి పట్టునుంచి తప్పుకుని ప్రత్యర్థిని మట్టికరిపించే నేర్పు ఆమె సొంతం. కేవలం ఐదడుగులా ఒక్క అంగుళం, 43 కిలోలు మాత్రమే ఉన్న డయానా వేగాన్ని పసిగట్టడం ఎవరికైనా కష్టసాధ్యమే.. ఇలా డయానా తనదైనపట్లతో దూసుకుపోతోంది. ‘మలేషియా ప్రొ రెజ్లింగ్’లో మగ ప్రత్యర్థులను మట్టికరిపించి, ఛాంపియన్‌గా నిలబడింది. కేవలం మూడు సంవత్సరాల్లో నెట్‌లో వీడియోలు చూసి, శిక్షణ తీసుకుని ఛాంపియన్‌గా ఎదగడం డయానాకే చెల్లింది. అమెరికాలోని ‘వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్(డబ్ల్యు.డబ్ల్యు.ఈ)కి ఎంత గుర్తింపు ఉందో ‘మలేషియా ప్రొ రెజ్లింగ్’కి కూడా అంతే గుర్తింపు ఉంది. ప్రతీ రెండు మూడు నెలలకు ఒకసారి సుమారు 30 మంది ఫైటర్లతో ఈ పోటీలను నిర్వహిస్తూ ఉంటారు. అయితే వాళ్లంతా మగవాళ్లే.. మలేషియాలో ఉన్న ఇద్దరు మహిళా రెజ్లర్లలో డయానా ఒకరు. డయానా కేవలం మలేషియా తొలి ఛాంపియన్ మాత్రమే కాదు.. ప్రపంచంలోనే బురఖా ధరించిన తొలి రెజ్లర్‌గా కూడా ఈమె రికార్డు సృష్టించింది.

-మహి