మెయిన్ ఫీచర్

ట్రిపుల్ తలాక్ తెలుసుకోవాల్సిన విషయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు అయిన ‘ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్’కు గురువారం రోజున లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్ బిల్లును ఇకపై క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. ఈ బిల్లుపై రాజ్యసభలో కూడా చర్చించి.. ఆమోదం పొందితే అది చట్టంగా రూపొందుతుంది. అసలు ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్ అంటే ఏంటంటే..
‘ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్’ లేదా ‘తలాక్ - ఉల్- బిద్దత్’ అనేది తలాక్ చెప్పే ఒక విధానం. దీని ద్వారా భర్తలు ఒకే సమయంలో మూడుసార్లు ‘తలాక్, తలాక్, తలాక్’ అని చెప్పడం ద్వారా విడాకులు పొందవచ్చు. దీనిని మాటల ద్వారానైనా లేదా టెక్ట్స్ మెసేజ్ ద్వారానైనా, ఈమెయిల్ ద్వారానైనా.. ఫోన్‌లోనైనా.. ఎలాగైనా చెప్పవచ్చు. దీనిని నిషేధించాలంటూ ముస్లిం మహిళల నుంచి సుప్రీంకోర్టుకు పెద్ద ఎత్తున పిటిషన్లు వెల్లువెత్తడంతో కోర్టు ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ 2017 ఆగస్టులో దీనిని నిషేధించింది.
* సున్నీ ఇస్లామిక్ చట్టంలోని మూడు సంప్రదాయాలు ‘ట్రిపుల్ తలాక్’ విధానం ఇప్పుడు చెల్లుబాటు కాదని చెబుతున్నా, నాలుగోది అయిన దేవ్‌బంద్ సాంప్రదాయంలో మాత్రమే ఈ వివాదాస్పద విధానం ప్రస్తుతం చెల్లుబాటులో ఉంది.
* భారతదేశంలోని ముస్లింలలో ఈ ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్‌పై అధికారిక గణాంకాలు ఏవీ లేవు. అతి తక్కువ మందితో నిర్వహించిన ఓ ఆన్‌లైన్ సర్వేలో ఒక్క శాతం కన్నా తక్కువ మంది ఈ రకం విడాకుల విధానాన్ని ఉపయోగించుకున్నారని తెలిసింది.
* విడాకుల ప్రక్రియను ఒక ముస్లిం పురుషుడు ప్రారంభిస్తే దానిని ‘తలార్ - ఉల్ - అహ్సాన్’ అని పిలుస్తారు. పరిస్థితులు చక్కబడేందుకు, దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు తొలగించుకునేందుకు అవకాశం కల్పించే విధంగా ఇది మూడు నెలల వ్యవధిలో జరగాలి.
* ఇందులో ఎవరైనా ముస్లిం మహిళ కూడా ముందుకు వచ్చి విడాకులు కోరవచ్చు. దీనిని ‘ఖులా’ అంటారు. ఒకవేళ మహిళే.. తనకు విడాకులు కావాలనుకుంటే.. అందుకు భర్త నిరాకరిస్తుంటే.. ఆమె ఎవరైనా ఖాజీ వద్దకు లేదా షరియా కోర్టుకు వెళ్లి విడాకులు కోరవచ్చు. ఈవిధంగా న్యాయబద్ధం జారీ అయిన విడాకులను ‘్ఫష్క్ - ఎ - నిఖా’ అని అంటారు.
* వివాహం జరిగేటప్పుడే.. వివాహ ఒప్పందం ‘నిఖానామా’లోనే ఒక మహిళ ‘తలాక్’ నియమ నిబంధనలను పేర్కొనవచ్చు. దీన్ని ‘తఫవీద్ - ఎ - తలాక్’ అంటారు. అంటే భార్యకు తలాక్ హక్కుల బదిలీ అని అర్థం.
వివాదం
* ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు ప్రకారం ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్‌ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. దీని కింద ఒక ముస్లిం పురుషుడికి అత్యధికంగా మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించవచ్చు.
* అంతేకాకుండా భర్త ఆ కాలంలో బాధితురాలికి భరణాన్ని కూడా చెల్లించాలి. జైలు శిక్ష అనుభవిస్తున్న ముస్లిం పురుషుడు భరణాన్ని ఎలా చెల్లించగలడు?
* కొన్ని ముస్లిం మహిళా బృందాలు దీనివల్ల ముస్లిం మహిళలకు ప్రయోజనం ఉండదని వాదిస్తున్నాయి. వివాహ బంధాన్ని కొనసాగించడంలో మహిళలకు కూడా సమానమైన హక్కు లు, రక్షణ వ్యవస్థలు ఉండాలని, వివాహ రద్దు విషయంలో తమ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.
* కేవలం జైలు శిక్ష విధించడం వల్ల లక్ష్యం నెరవేరదు. దీనివల్ల భర్తలు తాము జైలులో ఉండటం వల్ల భరణం చెల్లించలేకపోతున్నామని కూడా చెప్పే అవకాశం ఉంది. అప్పుడు భార్యలే తమను, తమ పిల్లలనూ పోషించుకోవాల్సి వస్తుందని వారు అంటున్నారు.