S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/24/2019 - 19:54

మానవుడు తప్ప మిగిలిన జీవరాశులన్నీ ప్రకృతి నియమాలను ఖచ్చితంగా పాటించి తమ జీవనాన్ని కొనసాగిస్తాయి. దైవ సంకల్పంతో సృష్టించబడిన ఎనుబది నాలుగు లక్షల జీవరాశులలో మానవుడొక్కడే నియమాలను ఉల్లంఘించి అధముడగుచున్నాడు. ఏ జీవినైతే అత్యున్నతంగా తీర్చిదిద్దాలని సృష్టికర్త అనుకున్నాడో గానీ అది సఫలీకృతం కాకపోవడం సృష్టి వైచిత్రి. ఆవు గడ్డి తిని మనకు పాలిస్తుంది గాని అది పాలను త్రాగదు.

01/23/2019 - 19:56

దీని ఆవశ్యకత కలియుగంలోనే ఎక్కువగా ఉంటుందనే తలంపుతో అందించాడు. నిజంగానే గీతామృతాన్ని లోకానికి అందించాడు. సంసార సాగరంలో ఈదులాడేవాడు దీనిని తప్పక చదవాలి. ఈ సంసార సాగరంలో మునిగిపోయేవాడికి, లేదా మునిగిపోతున్నవాడికి నిస్సంశయంగా యిది ఒక నావే!

01/22/2019 - 20:03

గీతయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్రవై
ఏ స్థలమున గీతా గ్రంథమెసగుచుండు
నెచట సద్భక్తిగీత పఠింపబడునో
అచటనుండును సర్వ ప్రయాగ పుణ్య
తీర్థములు సంతతంబు సుస్థిరములగుచు!

01/20/2019 - 22:36

హోమం, యజ్ఞాలు ఒకప్పుడు దేవతలు చేసేవారు. ఆ తరువాత రాజ్యం సుభిక్షంగా ఉండటంకోసం రాజులు ప్రజలయొక్క మేలుకోరి, రాజ్యం సదా పచ్చగా పాడిపంటలతో ఉండాలని, కరువుకాటకాలు రాకూడదని చేసేవారు. రానురాను యజ్ఞయాగాదులు, హోమాలు నిర్వహించడం చాలా తక్కువయింది. ఎక్కువగా దేవాలయాల్లో పండుగలు, పుణ్యదినాల్లోనే చేయడం చూస్తున్నాము. హోమాలు, యజ్ఞయాగాదులంటే పెద్దఎత్తున వ్యయంతో కూడుకున్నవి.

01/18/2019 - 19:29

ఒక గురువుగారు ఆశ్రమంలో చెట్ల క్రింద గురుకుల విద్యార్థులకు వేదాలు బోధిస్తున్నారు. అందరూ ఎంతో శ్రద్ధగా గురువుగారు బోధించే పాఠాలను చక్కగా వింటున్నారు. అంతలో ఒక విద్యార్థి లేచి నిలబడి గురువుగారూ మనం దేవునికి పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తాము కదా! అపుడు స్వామివారు ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తారా? ఒకవేళ ఆ నైవేద్యాన్ని భగవంతుడు గనుక తిన్నట్లయితే ఆ పాత్రలోని నైవేద్యం కాస్తయినా తరిగిపోవాలి కదా!

01/17/2019 - 19:17

రామాయణం, మహాభారతం, భగవద్గీత, భాగవతం మానవజాతికి సరియైన దారిలో నడిపించే దిక్సూచికలు అంటారు. మనిషి జన్మ పొందిన వారు ఎలా నడుచుకోవాలి. ఏవిధమైన నడవడి ఉంటే ఎలాంటి జీవితం ఉంటుంది. మరుజన్మలో ఏవిధంగా ఉంటుందో చెప్తాయ. దేనికోసం అనే్వషించాలో కూడా ఇవి చెబుతాయ.

01/16/2019 - 18:32

యుగధర్మాన్ని రక్షించుటకై శ్రీ మహావిష్ణువు కృష్ణపరమాత్మునిగా అవతరించాడు. మార్గశిరమాసమంతా కృష్ణనామస్మరణతో దేవాలయాలు మారుమ్రోగుతుంటాయ. కానీ ప్రతి క్షణమూ కృష్ణనామాన్ని స్మరించుకుంటూ కృష్ణుడు చేసిన, చూపిన, చెప్పిన విషయాలను అర్థం చేసుకొని ఆచరణలో పెడితే కృష్ణుడికి మనుష్యునికి తేడా ఉండదు. అందుకే నరనారాయణులుగా కృష్ణార్జనులు పుట్టారు. మనమూ కృష్ణునితో స్నేహం చేసి కృష్ణులుగా మారాలి.

01/16/2019 - 21:39

సంక్రాంతంటే బంతిపూల తోరణాలు కానేకాదు!
బతుకు పూల తరంగమై బడుగు జీవులు ఎదగాలి!!
సంక్రాంతంటే నువ్వుల చకినాలు, బెల్లం అరిసెలు అసలే కాదు!
నవ్వుల కేరింతల పిల్లలు, తీయని అనుబంధపు స్పర్శలు
వూరు వాడలంతా వెల్లివెరియాలి!!
సంక్రాంతంటే ముగ్గుల అల్లికలు, గొబ్బెమ్మల ఆటలు అంతేనా?
రంగుల రంగువల్లుల లోగిళ్లల్లో
హరిదాసులకు, గంగిరెద్దుల విన్యాసాలకు స్వాగతోరణాలుకదూ!!

01/14/2019 - 19:24

జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు మకరరాశిలోనికి పరివర్తనం చెందే రోజు సంక్రాంతి. ఈ రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ సంక్రాంతి పండుగ తెలుగువారికి మూడు రోజుల పండుగ పెద్దపండుగ. ముందు రోజు భోగిపండుగ. ఈ రోజున గోదాదేవి మార్గళి వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుని చేపట్టిన రోజు అని గోదారంగనాథుల వివాహాన్ని చేస్తారు.

01/13/2019 - 23:32

యుగయుగాలుగా, తరతరాలుగా అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తున్న క్షీరధార హైందవ సంస్కృతి. ఆ పాలవెల్లువలో పెల్లుబికిన మీగడ తరగలే మన సాంప్రదాయాలు. హైందవ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆచారాలకు ‘పండగ’ కేంద్ర బిందువు.

Pages