S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/04/2019 - 22:42

జయం కలిగితే పొంగిపోవడం, అపజయం కలిగితే బాధతో కుంగిపోవడం సాధారణ మానవులకు సహజం. గెలుపు ఓటములు జాతకాలను అనుసరించి ఉంటాయని గుడ్డిగా నమ్మడం మూర్ఖత్వం. అసలు ఓటమి ముఖ్యకారణం మీరు సరియైన ప్రయత్నం చేయకపోవడమేనని పెద్దల జీవిత చరిత్రలు మనకు బోధిస్తున్నాయి. మనం సరైన పనులు చేసినా, మనకు చెందవలసినవి చెందకుండా ఉంటే అవి మనకు దక్కకపోయనా వాటివలన ఇతరులకు మేలు జరిగితే మనం సంతోషించే నేర్పును అలవర్చుకోవాలి.

12/04/2019 - 22:38

అతిదానత్ హతః కర్ణః తు అతి లోభాత్ సుయోధనః
అతి కామాత్ దశగ్రీవః తు అతి సర్వత్ర వర్జయేత్
భావం: అతిగా దానం చేసే కర్ణుడు, అతిలోభత్వంతో సుయోధనుడు, అ కామంతో పదితలలవాడు నాశనం అయ్యారు. అందుకని అతిని ఎల్లపుడూ నివారించండి.
లాలయేత్ పంచవర్షాణి దశవర్షాత్ తాడయేత్
ప్రాప్తేతు షోడసే వర్షే పుఅతే మిత్రావద్ ఆచరేత్

12/04/2019 - 22:47

తే.గీ. దేవుడిచ్చిన దేహమ్ము దేశసేవ
లోనఁదరియించవలెఁ గదా జ్ఞాన వంతు
లము మనుజులము మరువంగ రాదు సుమ్మి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

,
12/03/2019 - 23:11

నేడు ఘంటసాల జయంతి
*

12/03/2019 - 23:07

విద్యానామ నరస్య రూపం అధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం
విద్యా భోగకరి యశః సుఖకరి విద్యా గురూణాం గురుః
విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరదేవత
విద్యా రాజసు పూజిత న తు ధనం విద్యావిహీనః పశుః

12/03/2019 - 23:06

తే.గీ. శిక్షలమలులో జాప్యము చేయరాదు
తప్పుఁజేసిన వెంటనే తగిన శిక్ష
వేయవలయునద్దానితో భీతిఁజెంది
చెడుకు సాహసింపరు గదా చిన్నపాటి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

12/02/2019 - 22:34

మనసుండాలే కానీ మార్గాలు కోకొల్లలు.చేసే పనిమీద మనసును లగ్నం చేస్తే అన్ని సఫలం అవుతాయి. ‘చిత్తం శివునిమీద, భక్తి చెప్పులమీద’ అన్నట్లుగా ఉంటే ఫలితం ఉండదు. మనం చేసే ఏ పనిమీదనైనా సూక్ష్మదృష్టి పెట్టి చేస్తే అది ఫలవంతమవుతుంది. ‘సంకల్ప బలం’ ఉండి ఏకాగ్రతతో ఏ పని చేసినా చివరికి దాని ఫలితం లభిస్తుంది.కశ్యప మహామునికి దితి, అదితి అని ఇద్దరు భార్యలు ఉన్నారు. దితి సంతానం రాక్షసులు, అదితి సంతానం దేవతలు.

12/02/2019 - 22:33

యంబ్రహ్మ వరుణేంద్రరుద్రమరుతః స్తువంతి దివ్యైః స్తవై
వెదైః సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః
ధ్యానావస్థిత తంగతేన మనసా పశ్యన్తి యం సామగాః
యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః

12/02/2019 - 22:28

తే.గీ. చెల్లెలిగఁ దల్లిగనుఁ బరస్ర్తినిఁదలుపఁ
బోకఁ గామాంధకారానఁ గన్ను మిన్నుఁ
గానకుండగ వర్తింప ఁ గడకువంశ
నాశనంబది తథ్యమా నరమృగాలఁ
జూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

11/30/2019 - 22:00

కుచైలినమ్ దంతమలోపధారిణం
బాహ్యశినమ్ నిష్ణురభాషినమ్‌చ
సూర్యోదయే చప్తామితే శయానం
విముంచ్యతి శీర్యాది చక్రపాణిః

Pages