S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/09/2018 - 21:28

ఇం: అలాగే వుంది. ఆయాసం పొద్దున్నకంటే ఎక్కువైంది.
కృ: అయ్యో పాపం! లక్ష్మేదీ?
ఇం: అమ్మ గదిలో ఉంది. పిలవనా?
లక్ష్మి: (ప్రవేశిస్తూ) ఏం కృష్ణవేణీ! ఇంకా నిద్రపో లేదేం? పగలల్లా ఆఫీసులో కష్టపడి మళ్లీ సాయంత్రం అందరికీ వండి వార్చి-
కృ: ఏవుందీ మామూలు గొడవే! రాను రాను బతుకంటే అసహ్యం వేస్తోంది.
లక్ష్మి కొత్తగా ఇప్పుడేం వచ్చింది? అన్నయ్య పురాణమేనా?

02/09/2018 - 21:08

తెలుగుభాషకు సొబగులు అద్దేవి సామెతలు. సామెతలు జీవనసారమంతా ఒక్కమాటలో చెప్పాలంటే అనువైన పదం కేవలం సామెతనే. సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు ఉండదంటారు. సామెతలు జీవితసారానికి దర్పణాలు. సామెతలు సేకరించడం భద్రపర్చడం నేటి తరం వారి బాధ్యతగా తీసుకోవాల్సి ఉంటుంది.

02/08/2018 - 21:14

తెలుగు నేలలో అన్ని జానపద కళారూపాలతోపాటు హరికథా గానం ఒక వెలుగు వెలిగి, ప్రజాభిమానాన్ని పొందింది. ఆంధ్రుల హరికథా చరిత్రలోనే హరికథ గానం ఒక అపురూపమైన స్థానాన్ని, అపారమైన గౌరవాన్ని పోగేసుకుంది. ఈ కళా ఖండాన్ని ఒక విశిష్ట కళారూపంగా తీర్చిదిద్దిన వారు విజయనగరం జిల్లాలోని ఆదిబట్ల నారాయణదాసు. ప్రజలు కాలంతో పరుగిడుతూ జానపద కళలను ఆదరిం చడం మరుస్తున్నారు.

02/08/2018 - 21:14

యు: ఏం మిగిలిందండి?
తా:చెప్పానుగా! శరీరంలో రకరకాల జబ్బులూ, తొమ్మండుగురు పిల్లలూ, వాళ్ళకి నామీదుండే వల్లమాలిన అభిమానం. ఇదీ నా ఆర్జన!
యు:జరిగిందానికంతకీ యిప్పుడు విచారిస్తే ఏం లాభం చెప్పండి!
తా:్ఛఛా! ఎంతమాటన్నావు! విచారమా! అది నా జన్మలో లేదు. జరిగింది చెప్పానంతే. లాటరీ వేశాం, ఓడిపోయాం! ఇంకోరకం లాటరీ ఉందేమో ప్రయత్నించి చూడమంటున్నాను.

02/07/2018 - 22:05

ఈ కాలంలో అన్నీ మిక్సీలు వచ్చేసాయి. బర్ మనే శబ్దం తప్ప మరేమీ ఉండదు. కాని పూర్వకాలంలో దంచినా, నూరినా, రుబ్బినా, ఆఖరికి చెరిగినా వంటింటిల్లో చేసే పనుల్లో ప్రతిదానికి ఒక పాటను పాడుకొనేవారు. నలుగురు స్ర్తీలు కూర్చుని పనులు చేసుకొంటూ పురాణ సంబంధమైనవోలేక చారిత్రక వీరుల గురించో ఏదో ఒక విషయానికి సంబంధించి పాటరూపంలో ఆ విషయాలన్నీ చెప్పుకునేవారు. వారు చేసేపనికి ఊతంగా ఈ పాట సాగేది.

02/07/2018 - 22:02

యు:నిద్ర రావటంలేదు ఎంత ప్రయత్నించినా! ఎంచేతో తెలిదయు! నిజంగా తెలీదా? పొద్దున్నించీ కడుపుమాడిపోతుంటే నిద్ర ఎలా వస్తుంది? ఉంగరం అమ్మేస్తే వచ్చిన డబ్బు గది అద్దె అడ్వాన్సుకే చాలలేదు. మిగిలింది నేనూ నా బొమ్మలూ! ఎటొచ్చీ మేకులు కొడితే ఇందిర నిద్రపోయిది. బొమ్మలు చూస్తే కృష్ణవేణి హడలిపోతుందనుకుంటాను. వియోగం, దుఃఖం, గులాబీ తోటలో కాలసర్పం- ఇలాంటి బొమ్మలే ఎందుకు వేస్తాను చెప్మా?

02/06/2018 - 21:53

కొందరికి కొన్ని సంఖ్యలు అంటే ఇష్టం మరికొన్ని అంటే అయిష్టంగా ఉంటుంటాయి. చాలామందికి కొన్ని సంఖ్యలపట్ల కొన్ని నిర్దుష్టమైన అభిప్రాయాలుంటాయి. ‘ఏడు’సంఖ్యను కాదు ఏడు అన్న పదాన్ని పలుకడానికి కూడా ఇష్టపడరు. ఏడు అని చెప్పడానికి జానపదులు ఆరున్నొకటి అంటుంటారు. ఇది వ్యాపారస్థుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏపని చేయని వాళ్లను ‘సాడేసాత్‌గాడు’అని అనడానికి ఏడు అన్న పదం పనికి రాదని భావం.

02/06/2018 - 21:51

(బాజాలు అలా అలా దూరం అయిపోయి, మళ్లీ గల్లీలో వాహనాల చప్పుళ్ళూ జనసమ్మర్దం అవీ వినబడతాయి)

Pages