S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/12/2020 - 22:32

తే.గీ. ఆకలియు లేకఁ దినెడి యాహారమేల?
శ్రద్ధ ఁ జూపక ఁ జదివెడి చదువులేల?
బుద్ధినిలుపగలేనట్టి పూజలేల?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఆకలి లేకుండా భుజించే ఆహారం, ఏ మాత్రం శ్రద్ధ చూపకుండా చదివే చదువు, దేవునిమీద చిత్తం నిలుపలేకుండా చేసే పూజ నిరుపయోగాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించు ప్రభాకరా!

02/12/2020 - 22:31

ఆదెరువు
కరువెక్కడిది
ఊరున్నా చెరువుంటే
భరోసా ఆకాశన్నంటుతుంది
కానీ కాలంపై కనె్నఱ్ఱజేసి
బీడుకు ఊతమై
ఇంటి గరిసెల్ని పంట గింజలతో నింపి
తృప్తితో నవ్వే అమ్మ చెరువు
నిండుకుండలా ఊరంతటికీ పెద్దమ్మాలా
చెరువుంటే అంతకన్నా పండగేముంది?
చల్లదనపు దీవెనల్ని
చెరువునుండి చేదుకుంటే
అంతకన్నా ఆత్మ విశ్వాసం ఎక్కడుంది?

02/11/2020 - 22:14

తే.గీ. నిత్య చైతన్య దీప్తితో నిలచియడుగు
ముందునకు వేయఁదిరుగు లేదెందు మనకు
బద్ధకించినచోఁగార్య ఫలముసున్న
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

02/06/2020 - 22:59

18 అధ్యాయములతో 700 శ్లోకములతో బాధాతప్త హృదయుడై విరక్తి చెందిన అర్జునుడికి కర్తవ్యాన్ని తెలియజేయుటకు భగవంతుడు చేసిన జ్ఞానోపదేశమే భగవద్గీత

02/06/2020 - 22:59

పంచీకరణి యనగా ఐదు విధములు. ఏమిటి రుూ ఐదు విధములు అనగా సూక్ష్మధారియై వున్న అధిష్టాన చేతన బ్రహ్మము స్థూలముగా పంచ భౌతిక రూపమైన సృష్టియందు పంచభూతములతో కూడి ఎనుబది నాలుగు లక్షల జీవనోపాదులకు ఆలంబనగా నిలిచియున్నదన్న విషయాన్నివేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, మరియు అనుభవ వేదాంత యోగులు మనకు నిత్యం అందిస్తూనే వున్నారు. ఈ ఐదు భూతములు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృధ్వి-వీటియొక్క సమిష్టి రూపమే సృష్టి.

02/06/2020 - 22:58

పగలూ రేరుూ
తీరిక లేక నడిచే మరయంత్రం
నోరున్నా మాట్లాడలేను
గాయాలన్నీ కళ్లల్లో నిక్షిప్తం
అలసి సొలసిన మేను
బాధలని మనసుకి చేరనీయక
కలల కళారూపాలు కళ్లల్లో నింపుకుంటాను
ఇల్లు దాటని కాళ్లూ
బాహ్య ప్రపంచం కాంచని కళ్లు
దించిన తలలో మేధో మధనం
మనిషిరూపంలోని
మాంసం ముద్దలనే
చూడగలిగిన కళ్లల్లోకి తెలిసిన అస్త్రాలన్నీ

02/06/2020 - 22:51

తే.గీ. తీవెలకుఁ బూవులందమ్ము దెచ్చునటులఁ
బలుకులందమ్ము నొనగూర్చు బహువిధాల
మానవాళికి సంశయమ్మనవసరము
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: లతలకు పువ్వులు అందాన్ని తెచ్చి పెడతాయి. అలాగే మానవులకు పలుకులే అనేక విధాలుగా అందాన్ని తెచ్చి పెడతాయి. ఇందులో ఎలాంటి సంశయం లేదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించుస్వామీ.

02/05/2020 - 23:03

ఎల్లయందును దావసియించుటెల్ల
యదియు దనయందువసియంచుటండ్రు వాసు
దేవుడను పేరికర్థంబు దెల్లమంత
యెఱుగు జనులందు దగవసియించు శుభము

02/05/2020 - 23:03

తే.గీ. మన ప్రవర్తనతో వంశమందువెల్గు
విస్తరించంగ వలెనంత వింతగొల్పఁ
గడిగినట్టి ముత్యంబులై యడర వలయుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మన ప్రవర్తనతో వంశంలో వెలుగులు విస్తరించాలి. ఎంతో ఆశ్చర్యజనకంగా. అంతేకాదు మనం కడిగిన ముత్యాలమై స్వచ్ఛతను సంతరించుకుని చక్కగా వర్థిల్లాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించు తండ్రీ!

02/04/2020 - 23:26

మాఘ శుక్ల సప్తమి మొదలు ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకాలుగా భావిస్తారు. భారత యుద్ధం సమయంలో క్షతగాత్రుడై, దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకూ, అంపశయ్యపై పరుండి ఉండి మాఘ శుక్ల సప్తమి నుండి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడనాడారని చెపుతారు.

Pages