S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/26/2020 - 22:39

తే.గీ. దాచిపెట్టిన ధనమును దానధర్మ
కార్యములకింతఁ జేయరే ఖర్చు తాముఁ
దినరు పెట్టరు రవ్వంత దేని కొఱకు?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

02/25/2020 - 22:53

సనాతన ధర్మం మిక్కిలి నిగూఢమైనది. ఆ పరమాత్మ మినహా ఆ రహస్యాన్ని మానవ సమాజానికి చేర్చగల వారు మరొకరులేరు. ఆయన అనుగ్రహం వల్ల విశుద్ధ భక్తి ముక్తులు అయిన పనె్నండు మహాజనులకే ఆ పరమ రహస్యం అవగతం అయింది.

02/25/2020 - 22:48

ఆశ అనేది అందరికీ ఉంటుంది. ఉండాలి కూడా. ఎందుకంటే నిరాశ నిండినబ్రతుకు. ఎండి పోయిన చెట్టులాగా నిస్సారంగా మారిపోతుంది. బతుకు మీది ఆశతోనే ఎడారిలోనైనా మనిషి బతికి బట్టకడుతాడు. పిరికి పందైనా యుద్ధంలో వెన్నువిరిచి నిలబడడానికి కారణం ఆశనే. ఆశతోనే అవయవ లోపం ఉన్నా పూర్తి ఆయుర్ధాయం ఉంటే లోపాన్ని సరిచేసుకోవచ్చు అని అనుకుంటారు. ఆశ అనేది లేకపోతే మనిషి బతుకు కుంటుపడుతుంది.

02/25/2020 - 22:43

తే.గీ. విద్యయుం గల్గ విశ్వాస వెలుగవచ్చు
నదియు లేకున్న ఁ జీకట్ల నంతముగను
వచ్చియుంజుట్టి వేయంగ వణుకుఁ బుట్టుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: బాగా చదువుకుంటే విశ్వంలో ఎక్కడైనా ఎంతగానో ప్రకాశించవచ్చు. ఆ విద్యలేనట్టయితే చీకట్లనంతంగా వచ్చి చుట్టి ముట్టేస్తాయి. అప్పుడు భయంతో వణికిపోవలసి వస్తుందని కర్మసాక్షివైన ఓసూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించు స్వామి.

02/25/2020 - 01:24

తే.గీ. జ్ఞాన సంపత్తికిందూగు సంపదెచటఁ
గానరాదని గ్రహియించి కనులు దెరచి
దానికై దీక్షఁ బూనుడీ కలమునందుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: జ్ఞాన సంపదతో సరితూగే సంపద ఎక్కడా కనబడదని గ్రహించి కళ్లు తెరిచి అట్టి సంపదను పొందుటకై ఈ భూమిపై దీక్ష బూనాల్సిన అవసరం ఎంతైనా ఉందని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా!ఈలోకానికి ప్రబోధించు స్వామీ.

02/23/2020 - 22:56

చారిత్రక యుగమున శాతవాహన, చాళుక్య, రాష్టక్రూట, కాకతీయ, ఆనంతర కాలమున హైందవ సంస్కృతీ సభ్యతలకు ఆలవాలమైన తెలుగు నేలలో వివిధ రాజన్యుల ఏలుబడులలో శైవమతం పరిఢవిల్లింది. క్రీ.పూ.2వ శతాబ్ది నాటికే శైవారాధన ఉంది. గాథా సప్తశతిలో గౌరీ, పశుపతి స్తోత్రముంది. 1వ శతాబ్దంలో శైవంలో అత్యంత ప్రాచీనమైన పాశుపత శైవాన్ని లకులీస శివాచార్యుడు స్థాపించారు.

02/23/2020 - 22:54

కం. శ్రీకాళహస్తిదేవా
ఆకాశీ విశ్వనాథ ! హరమల్లేశా
రాకాశశాంక భూషణ!
లోకైక సురక్ష! భక్తలోలా! భోళా!

మ. చలువౌ కొండనివాసమై ప్రమథులున్ సర్వామరుల్ గొల్పగా
కొలువున్ దీర్చి యశేష లోకముల సంక్షోభాగ్నులన్ బాపినీ
చలువన్ పూజలనందు శంకర! హరా! శంభో! విభో! సుందరా!
చిలువన్ హారముగా ధరిచిన శివా! శ్రీ చంద్ర వౌళీశ్వరా!

02/23/2020 - 22:53

తే.గీ. కాయమునుఁ గష్టపెట్టిన ఁ గలదుసుఖము
దాని నెంతయో సుఖపెట్టఁ దప్పదనతి
కాలమందునఁ గష్టాలు గాంచనేల?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

02/22/2020 - 22:22

భాషాప్రతిపత్తిమీద భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పడిన తరువాత కృష్ణా జిల్లా నుండి విడిపడి గుంటూరు జిల్లా ఏర్పడింది. 1972లో గుంటూరులోని కొంత భాగాన్ని విడదీసి ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా ఏర్పడ్డది. ప్రస్తుతం వున్న గుంటూరు జిల్లాలో జనాభా దాదాపు 50 లక్షలు. ఆక్స్‌ఫడ్ ఆఫ్ ఆంధ్రాగా పేరుగాంచినది గుంటూరు సీమ. దీనికి చారిత్రక ప్రాధాన్యం ఎంతో వున్నది. శాతవాహనుల రెడ్డి రాజుల రాజధానులు ఈ ప్రాంతంలోనివే.

02/22/2020 - 22:21

నిజమైన, నిక్కమైన కవి మానసంతో ప్రతి శబ్దానికి రంగు, రుచీ, తావీ ఉంటాయని కవిమూర్ధన్యుడు దేవులపల్లి కృష్ణశాస్ర్తీ అంటుండేవారు. ఆగర్భ శ్రీమంతుల లాగానే ఆగర్భకవులుంటారు కొందరు అంటే పుట్టుకతోనే అటువంటి వాళ్ళది కవి హృదయం. అంటే ప్రాప్తనజన సంస్కారం ఉంటే కాని ఎవరూ మహాకవులు కాలేరు అని అర్థం.

Pages