S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/05/2019 - 19:45

పండుగలు మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకూ, ఆచారాలకూ కేంద్ర బిందువులు. సమాజంలో ప్రతి కుటుంబంవారు పండుగలు జరుపుకుంటారు. పండుగలు మానవులకు కొత్త ఉత్సాహాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. బంధువులు, మిత్రులు అందరూ కలుసుకోవడానికి పండుగలు ఉపకరిస్తాయి. తద్వారా ప్రతిమనిషి మధ్య ఐకమత్యం ఏర్పడుతుంది. దీనితోపాటు ఆధ్యాత్మిక చింతన కూడా ఏర్పడుతుంది.

04/05/2019 - 19:45

విళంబిలో తీపి చేదులను చవి చూసి
కొత్త వసంతానికి చిగురు తొడుక్కున్న ఒక కోయిల
పిలవకనే ఇంటికి వచ్చేసింది!
ఇదేంటంటే? మనవారే కదా
నేను శుభం పలుకాలి కదా! అంది
భవిష్యత్తు భరోసా ఇస్తా
అంటూ ఆశపాటొకటి ఈ కొత్త కోయిల
రాగరంజితంగా ఆలపిస్తోంది
మనిషిలోని వికారగుణాల ఏరివేతకు
నాందీసూచకమే ఈ కొత్త ‘వికారి’ అంటోంది

04/05/2019 - 19:44

ఎందుకీ మావికొమ్మ
విప్లవ గీతాలు వినిపిస్తోంది?
ఎందుకీ మూగ ఎండ
మట్టిని కూడా కాల్చేస్తోంది?

కాలాన్ని కలంగా
మార్చుకుని కాల పురుషుడు
ఏకథ వ్రాయాలనుకొంటున్నాడు?
ఏ యే వ్యధలు చెప్పాలనుకొంటున్నాడు.?

04/04/2019 - 19:48

యుగాది... యుగ, ఆది అన్న పదాల కలయిక. యుగారంభం అని అర్థం. యుగాదే వాడుకలోకి వచ్చేసరికి ఉగాది అయ్యింది. ‘యుగం’ యొక్క ‘ఆది’ అనే అర్థంలో ఉగాది శబ్దం ఏర్పడింది. ‘‘చాంద్రమానం’ ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమితో కాలం ప్రారంభమవుతోంది. కనుక దానే్న సంవత్సరాదిగా, ఉగాదిగా వ్యవహరిస్తున్నాం. బ్రహ్మ చైత్రమాసంలో శుక్ల పాడ్యమినాడు మొదటి నక్షత్రంలో సూర్యోదయ కాలంలో సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టాడు.

04/04/2019 - 19:47

కనుపించువన్ని కనుమరుగై పోవు కాలము కనుకట్టు ‘ఇంద్రజాలం’
కపాలములోని కమ్మని కోరికలు కట్టెల పాలగు ‘మహేంద్రజాలం ’
మానవుని జీవితం మత్స్య కారుని వలలో చిక్కిన చేపల ‘విలువలలు’
ఘీంకరించి హ్రీంకారము చేయు కాలాకార సమిధ ‘వికార’

04/03/2019 - 19:53

హైందవం తల్లిఋణము తీర్చుకోలేనిది అంటుంది. జన్మ నిచ్చి దారిచూపిన తల్లికి ఎంత సేవ చేసినా తక్కువ అవుతుంది. జన్మనిచ్చిన తల్లి, మాతృభూమి స్వర్గముకంటే మిన్నఅనంటారు. తల్లి, తండ్రి, గురువు, దైవము. ఇక్కడ కూడా ప్రథమ స్థానము మాతృమూర్తికే. సృష్టికి ఆదిదంపతులు పార్వతి పరమేశ్వరులు. వీరి కుమారుడు తల్లిదండ్రుల శక్తి ఏమిటో లోకానికి చాటాడు.

04/03/2019 - 19:49

1. ఖాళీ ఆకాశంలో నిరంతర చలనం కాల చక్ర భ్రమణం
ప్రాతిభాసిక, వ్యవహారిక స్వప్న జగత్తులలో నిర్యాణం వరకు ప్రయాణం
జీవితం కోరికల హరివిల్లు మన్మథుని పంచపుష్పబాణ కామాకర్షణం
కోరికల ఓతపాతలు కాకూడదు ‘వికారి’ లో ‘మనీషామమ’

04/02/2019 - 19:50

మానవులకు హరి నామం సర్వదా స్మరణీయం.
హరే రామ హరే రామ -రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ - కృష్ణ కృష్ణ హరే హరే
అనేది మహామంత్రం. దీనిని శ్రద్ధాసక్తులతో ఉచ్చరిస్తే కలిదోషాలు హరిస్తాయని తెలుపబడింది .
రామదాసుగా ప్రఖ్యాతి గన్న కంచెర్ల గోపన్న రామ నామ మహత్వాన్ని తన దాశరథీ శతకంలో
‘రా’ కలుషంబులెల్ల బయలం బడద్రోచితన ‘మా’ కవాటమై

04/01/2019 - 19:57

ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్దదైన, సహజసిద్ధమైన మంచినీటి సరస్సు కొల్లేరు. చారిత్రాత్మకమైన ఈ సరస్సుకి కృష్ణా జిల్లాలోని కైకలూరు, మండపల్లి మండలాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని పెదపాడు, ఏలూరు, దెందులూరు, భీమడోలు, నిడమర్రు, ఉంగుటూరు, ఆకివీడు మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. కొల్లేరు సరస్సులో 145 గ్రామాలు ఉన్నాయి.

03/31/2019 - 22:39

మంచి సంకల్పం చేస్తే మంచి జరుగు తుంది. చెడు సంకల్పాలతో ఉంటే చెడు ఎదురవుతుంది అనేది పామరులైనా పండితు లైనా చెబుతారు. ఇది అందరి అనుభవంలోంచి వచ్చిందే. అందుకే మన పెద్దవాళ్లు ఎపుడు శుభం పలుకమన్నారు. మన మనసులో మంచి సంకల్పం అనే బీజం పడితే అది మొలకై, మొక్కై ఎదగడానికి గట్టి కృషి, పట్టుదల, కార్యదీక్ష కలిసి సమిష్టిగా పనిచేస్తాయి.

Pages