S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/29/2019 - 19:00

అద్వైత మత స్థాపనాచార్యులైన ఆది శంకరులు తూర్పున జగన్నాథంలో ‘‘గోవర్ధన మఠం‘‘, పశ్చిమాన ద్వారకలో ‘‘శారదామఠం’’, ఉత్తరాన కేదారంలో ‘‘జ్యోతిర్మఠం’’, దక్షిణాన శృంగేరియందు ‘‘శృంగగిరి మఠం’’ స్థాపించి మత కార్యనిర్వహణార్థం దేశం నలు చెరుగులా సంచరించి, అద్వైత తత్వాన్ని వివరించి, దిగ్విజయ యాత్ర కొనసాగించారు.

03/28/2019 - 19:03

ప్రాచీన భారతీయ శాస్త్రాలలో సమస జగత్తును ఆధారమైన వానిని ఈశ్వరుడనియే అందురు. ఈశ్వరుడు అంటే శివుడనో విష్ణువనో కాదు.
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యెవ్వని యందుడిందు బరమేశ్వరుడెవ్వడు
మూల కారణం
బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వ ము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణం వేడెదన్

03/27/2019 - 20:35

రెండవ పద్యం మొదటి పద్యానికి పూర్తి భిన్నంగా అచ్చమైన ఆత్మీయతతో ఆరంభవౌతుంది ఇలా.. రంగన్నా, కరుణింపరా తలపరా, రారా, జగన్మంగాలాపాంగ..
ప్రతి పద్య వైవిధ్య సాధనకోసం కవి చేసిన ప్రయత్నం ఇది.
శతకం ఆత్మీయతకు ప్రతిరూపంగా ఉండాలి. ‘రీతి’లోని విలక్షణత్వం ఆత్మీయ స్పర్శను ప్రగాఢతరం చేస్తుంది. శతక పాఠకుడు పద్యంలో లీనమయేందుకు ‘రీతి’ అమిత రీతిలో తోడ్పడుతుంది. మూడవ పద్యం అందుకు సూచిక. అది

03/26/2019 - 19:22

డా. సి.నారాయణరెడ్డిగారు రచించిన ‘ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు, ప్రయోగములు’ గురించి కవితాభిమానులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఆధునికాంధ్ర కవిత్వాన్ని సాధికారంగా పరిచయంచేసిన ఈ గ్రంథంలో అతి నవ్య కవితా ధోరణులు అన్న అధ్యాయంలో పలువురు కవుల ప్రస్తావనలు వస్తాయి. ఈ సంక్షిప్త ప్రస్తావనల్ని నమోదు చేసే క్రమంలో సినారె ఎంతో జాగరూకతను పాటించారు.

03/25/2019 - 19:56

సర్పభూషణుడు
మళ్లీ ఓసారి పగటి వేళ తలపైకెత్తి చూడండి ఆకసంలోకి! ఏం కనిపిస్తున్నాయి?.. సూర్యుడూ, మేఘాలే కదా? ఆ సూర్యుడే శివుడు. (ఏష బ్రహ్మోచ విష్ణుశ్చ శివః’..కదా! ఉదయమే బ్రాహ్మణోరూపం, మధ్యాహ్నేతు మహేశ్వరః’ కదా?) మన కళ్లెదుటే దివ్యప్రభలతో వెలిగే శివున్ని దర్శించుకోలేక, ఏ శ్రీశైలానికో, కాశీకో, గయకో పరుగులు తీస్తాం మనం!
ఎంతటి అవివేకులం?

03/24/2019 - 23:29

శివతత్త్వ విచారణ
*
ఆలోచిస్తే అన్నీ కరతాలమలకమే! ఒక్కమాటతోనే అన్నీ చెప్పేశారు మన మహర్షులు. కాని మనకే ఓపిక లేక ఆలోచించం.
అదెలాగో చూడండి!

03/25/2019 - 04:28

ఉ. నాగ విభూషణా! దయమానంబున దాల్చి మరంపు హుంకృతుల్
సాగగనీక ఆపి, మనసా ఉపకారము సల్ప పెండ్లి యే
క్ష్మా గురు పర్వతాత్మజ నుమా జననిన్ భవదీయ పత్నిగా
రాగము తో నొనర్పమొకొ! రాగ విదూర ! సదాశివా! సదా!

03/25/2019 - 04:29

శా. కాకోలంబును కంఠ సీమ నిలుపంగా జాలి నొవంచు నిన్
శ్రీకంఠేశ్వరుడంచు మ్రొక్కెదరు గానీ! తీవ్ర వాదానలం
బోకైలాసపతీ! నివారణము సల్పున్ దక్షతన్ జూపినన్
నీకున్ శంకర! భక్తి నిత్య శివరాత్రే జేయమా ! దైవమా!

03/21/2019 - 22:29

సీ. కోపాలు తాపాలు కొట్లాటలను వీడి
అందరివాడవై యలరవలయు
తనవారు పరులంచు ఁ దలపు రానీయక
అందరి హృదయాల నల్లవలయు
ఆర్గురైనట్టి నీయంతరాత్మ న గల్గు
ఆయరిషడ్వర్గ మణచవలయు
బురద పాలవరాదు బుద్ధి యెన్నడు గూడ
వికసితమై వెల్లి విరియ వలయు

03/20/2019 - 22:44

ఆదిపరాశక్తి బ్రహ్మను సృష్టించి సృష్టి రచన చేయమని బోధించింది. అమ్మ ఆదేశం మేరకు చతుర్ముఖుడు సృష్టి రచన ప్రారంభంచేశాడు. దానిలో భాగంగా కర్దముని కోరిక తెలుసుకొన్న బ్రహ్మ అతనిని వివాహం చేసుకొని సృష్టిని పెంచమని చెప్పాడు. కర్దముడు తాను సృష్టికి ఉపయోగపడుతాను కానీ కామసుఖాలను నాకు వద్దు. నేను నిరంతరం దేవదేవుడైన నారాయణుని సంస్మరణలోనే కాలం గడపాలన్నది నా అభిలాష అని చెప్పాడు.

Pages