S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/14/2019 - 22:14

వాసన లేని పూవువలె వాక్కు రచించని విద్యలేల పే
రాల సంపదల్ శుభమునందగ జేయవు జ్ఞాన సిద్ధిచేన్
సంస్కృతి బాపి మానవుల జన్మము సార్థకమందజేయవే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

05/13/2019 - 19:40

ఆది శంకరుల వలె దేశాటన ద్వారా సంపాదిత జ్ఞానాన్ని ప్రజల వద్దకు చేర్చడం లక్ష్యంగా ఎంచుకుని, సఫలీకృతులై, ప్రజల హృదయాలలో చిరస్థానం సంపాదించుకున్నారు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. వైదిక మతావలంబులైనా కులమతాలకు అతీతంగా వ్యవహరించి, సమాజ సంస్కర్తయైనారాయన.

05/13/2019 - 19:04

జ్ఘ

సీ. శృంగేరి పీఠాన బంగారు తల్లివై
చల్లంగ జూడుమా శారదాంబ
వాణివై బాణివై వరుస సత్కృతుల వై
చల్లంగ జూడుమా శారదాంబ
భాసిల్లు దానవో భవ్య భారతి మమ్ము
చల్లంగ జూడుమా శారదాంబ
పల్కు తేనియ లొల్కు బ్రాహీ
నీ దయయున్న
చల్లంగ జూడుమా శారదాంబ

05/12/2019 - 22:33

6. మాసము మండలమ్ము నధమమ్మును మూడు దినమ్ములైన శ్ర
ద్ధాసమ భక్తితత్పర వ్రతంబున గొల్చి మధూకరంబుతో
వాసము జేసి నీదు గుడి వాకిట నిద్దురలున్న సిద్ధి
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దారుని! శ్రీ సరస్వతీ!

05/10/2019 - 19:22

భగవంతుని అవతారాలలో అత్యద్భుత అవతారంగా చెప్పగలిగే అవతారం నారసింహావ తారం. సగం మనిషి, సగం మృగం ఆకారంలో రూపు దాల్చడం నరసింహావతార ప్రత్యేకం. దుష్ట శిక్షణ...

05/07/2019 - 19:48

వేదాలలో, ఉపనిషత్తులలో, భగవద్గీతలో ఉన్నదే అయినప్పటికి, ప్రజలు మరిచి పోయిన అంశాలను తిరిగి ఉటంకిస్తూ, బౌద్ధమతంలోని మంచి సిద్ధాంతాలను చేర్చి, అద్వైత మత స్థాపనాచార్యుడైనాడు ఆది శంకరుడు.

05/06/2019 - 19:43

ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే మాసాలలో వైశాఖ తృతీయ అక్షయ సంపదలు అందిస్తుంది. ‘‘వైశాఖ మాస శుక్ల తృతీయా- అక్షయ తృతీయోచ్ఛతే’’ అని శాస్త్ర వచనం. కుబేరుడే ఈరోజున మహాశివుని దగ్గర నుంచి అక్షయ సంపద లను పొందాడని పురాణ వచనం. వైశాఖాన్ని మాధవం అని కూడా పిలుస్తుంటారు.

05/05/2019 - 22:59

భృగు వంశోద్భవుడు, జమదగ్ని మహర్షి కుమారుడు, సహస్ర బాహుడైన కార్తవీర్యార్జునుని సంహరించిన మహావీరుడు పరుశురాముడు. తండ్రి ఆజ్ఞానువర్తియై, కన్నతల్లిని హతమార్చి, తిరిగి తండ్రి ఆశీస్సులతో పునరుజ్జీవితురాలిగా చేసిన ధర్మవీరుడు, భూ భారాన్ని తగ్గింప భార్గవరాముని రూపంలో ఉదయించాడు శ్రీహరి.

05/01/2019 - 19:59

సీ. విఘ్నాలు తొలగించు విఘ్నేశ్వరా! మమ్ము
గాచేటి వాడవే కరుణతోడ
శ్రీ శంకరా! మాకు సిరులిచ్చి బ్రోచేటి
వాడవీవే నయ్య భవభయ హర
మంగాపతీ! మాకు మార్గంబు ఁజూపుచు
రెప్పవై గాచేటి ఱేడువయ్య
శ్రీ ఆంజనేయ! మా సేమంబుఁ గోరేటి
వాడవే! శ్రీరామభక్తితోడ

04/30/2019 - 19:26

స్వేచ్ఛామృత ధారలతో
స్వర్ణాన్ని పండించే ఓ రైతన్నా!
ఇక్కట్ల ఇనుప తెరలు
చుట్టేసిన నేపథ్యంలో
ఊపిరి సలపక
విలవిల్లాడిపోతున్నావే!
శ్రమైక జీవన సౌందర్యాన్ని
ఆవిష్కరిస్తున్న ఓ శ్రామికా!
వెట్టి చాకిరితోవెన్నువిరిగి
అచేతనంగా పడిపోయిన నీకు
ఆసరా దొరకక
అల్లల్లాడిపోతున్నావే!
బిగించిన ఉక్కు పిడికిలి
ఉద్యమస్ఫూర్తికి చిహ్నంగా

Pages