S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/11/2019 - 19:25

శ్రీ వివేకానంద స్వామీ జయంతి నుద్దేశించి జరుపుకుంటున్న ఉత్సవంలో నేడు ముఖ్యంగా నేటి యువతకు ఆయన ప్రబోధాలు ఎంతవరకు ఉపయుక్తమో తెలుపడానికి ఈ వ్యాసం! ఆయన పుట్టు పూర్వోత్తరాలు, ఆయన పర్యటనలు, ఆయన ప్రపంచ మహాసభ వివరాలు- నేను వ్రాయడంలేదు. హరినాథ్ నాకు ఓ పూర్వ విద్యార్థి. ‘ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారం’ అందుకుంటున్న సందర్భంలో ‘ది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద’ వేదిక మీద నాకు బహూకరిచాడు.

01/10/2019 - 19:56

బాలచంద్రార్ధ సంకాశ ఫాలభాగ!
వృషభ వాహనారూఢ! విశ్వమాత!
సృష్టిపాలన లయకార్య చిహ్నశూలి!
త్రిజగవంద్య! శ్రీ శైలపుత్రీ నమోస్తు!

ఒక్కచేతను జపమాల లెక్కచేయ
మరొక చేత కమండల మంత్రజలం
జనగుణాలకు గుణముల సరిగ ఇచ్చు
బ్రహ్మచారిణి! రుద్రాణి ప్రణుతులివిగొ!

01/10/2019 - 19:54

ఆధ్యాత్మికత పొడచూపిన వేళ!
ఆత్మానందానికై అనే్వషణ!
తీర్థాలు మునిగాను, క్షేత్రాలు దర్శించాను
ప్రవచనాలు ఆలకించాను, పురాణ గ్రంథాలు శోధించాను
ఆచార్యులను సంప్రదించాను , అలసినాను, సొలసినాను
కడలి నడుమ చుక్కాని చెదరిన
నావ వోలె నిలిచినాను !!

01/09/2019 - 19:44

పరిపూర్ణం
ఒక వైద్యుడే కావచ్చు గాక!
రోగుల పట్ల అతడి హృదయస్పందనలు
మంచివేనా అంటే
ఎలా చెప్పగలం?

ఒక ఉపాధ్యాయుడే
కావచ్చుగాక!
పిల్లల భవితల్ని కాంక్షించే
నిత్యస్వాప్నికుడు
అతనిలో ఉన్నాడా అంటే
ఎలా చెప్పగలం?

ఒక కొలువుచేసే
అధికారే కావచ్చుగాక!
ఆ కొలువులోని నీతి
అతనిలో కొలువై
ఉందా అంటే
ఎలా చెప్పగలం ?

01/08/2019 - 19:56

ఎనభై నాలుగులక్షల జీవరాశుల్లో పూర్తిగా జన్మపరంపరల గూర్చి ఎవరికీ తెలియదు. గత జన్మలో తనది ఏ జన్మో, ఇంకా రాబోయేది ఏ జన్మ అనేది కూడా అసలు తెలియదు.
ఇంకా చెప్పాలంటే ఒక్క మనిషి అనేకానేక ఊహాగానాలతో, అనుకుంటారే తప్ప, ఇతర జీవులకు, తమ జన్మ ఇదని, పుట్టుక, మరణం, గూర్చి ఏమితెలియదు. అందుకే జీవులన్నిటిలో ఉత్కృష్టమైన జన్మ మనిషి జన్మగా పేర్కొనడం జరిగింది అది యదార్థము.

01/07/2019 - 19:58

భారతీయ అనే మాటకు ’ భా ’ అనే ధాతువు ఆధారం. భ యంటే ప్రకాశించు అని అర్థం. సమ్యక్ కృత అంటే బాగుగా చేయబడిన అని తాత్పర్యం. మానవుడు ప్రకృతిసిద్ధంగా సాగిపోతుంటాడు. అందుకు భిన్నంగా జీవిస్తే వికృతి. ప్రాకృతిక జీవనం సానపట్టినట్లయితే సంస్కృతి భారతీయ సంస్కృతిని శ్రేయస్సు అభ్యుదయము అనే రెండు మూలసూత్రాలపై ఆధారపడింది. సుఖము శాంతి రెండింటినీ లక్ష్యంగా చేసుకున్నది.

01/06/2019 - 22:53

జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయము ఆ మాసంలో పౌర్ణిమ రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చేయబడుతుంది. చైత్ర పౌర్ణిమ రోజున చంద్ర సంచారము చిత్తా నక్షత్రమున అవుతుంది కనుక ఆ మాసానికి చైత్ర మాసమని, విశాఖ నక్షత్రమందు సంచరించుట వలన వైశాఖ మాసమని, ఇలా పనె్నండు మాసాల పౌర్ణమిలలో చంద్రుని సంచారం ఆధారంగా పేర్లను నిర్ణయించారు. చంద్రుడు పూర్ణిమ రోజున పుష్యమి నక్షత్రములో సంచరించే మాసం పుష్యమాసం.

01/06/2019 - 22:47

సీ పాంచభౌతికము దుర్భరమైన కాయం బి
దెప్పుడో విడుచుట -యెఱుకలేదు
శతవర్షముల దాక -మితముఁ జెప్పిరి గాని
నమ్మరాదామాట -నెమ్మనమున
బాల్యమందో మంచి -ప్రాయమందో, లేక
ముదిమియందో లేక -ముసలియందొ
యూరనో, యడవినో- యుదక మధ్యముననో
యెప్పుడో విడుచుట యే క్షణం బొ
తే మరణమే నిశ్చయము; బుద్ధి - మంతుఁడైన
దేహమున్నంతలో మిమ్ముఁ- దెలియ వలయు

01/01/2019 - 04:00

ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో సంవత్సరాది పండగను వివిధ దినాలలో జరుపుకుంటారు. ఇలా జరుపుకోవడానికి కారణం సంవత్సర పరిగణనం వేరువేరు మాసాలలో జరగడమే. ప్రపంచంలో అత్యధికులు ఆచరించేది నేపుల్స్‌కు చెందిన అలోయిసియన్ అనే వైద్యునిచే రూపొందించ బడి, పోప్ గ్రెగోరీ - 8చే యయారు చేయబడిన ప్రస్తుత గ్రెగోరియన్ క్యాలెండర్ క్రీ.శ.1582లో రూపొందించినది.

12/31/2018 - 00:20

భగవంతుని మన చర్మచక్షువులతో సగుణరూపంలో చూడడానికి ఈలోకంలో సనాతన కాలంనుంచి ఋషులు, మహర్షులు ఏర్పాటు చేసిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఈ దేవాలయాల్లో కొన్ని మనుష్యులు ప్రతిష్ఠించినవి మరికొన్ని దేవతలు ప్రతిష్ఠించినవిగా చెప్పేవి ఉన్నాయి. ఇవేకాక స్వయంభూ దేవాలయాలుగా కూడా ప్రసిద్ధిచెంది ఉన్నాయి. దేవాదిదేవుడే భక్తుల కోరిక మేరకు వారు కోరుకున్న రూపంలో ప్రత్యక్షం అయి నేడు అర్చామూర్తిగా దర్శనం ఇస్తున్నారు.

Pages