S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/21/2019 - 22:42

పూర్వం త్రిపురుడు అనే రాక్షసుడు వరగర్వంతో బ్రహ్మాది దేవతలపై దాడి చేశాడు. బ్రహ్మ వరం పొంది ఇంద్రాది దేవతలను స్థానభ్రష్టుల్ని చేశాడు. వారంతా శివుని వద్దకు వెళ్లి, త్రిపురుడి కారణంగా వచ్చి పడ్డ కష్టాలను చెప్పుకున్నారు. తమను ఆ రాక్షసుడి బారి నుంచి తమను కాపాడమని కోరారు.

07/21/2019 - 22:34

కృత్రిమత్వపు పూతల కీడునెంచఁ
బఓరు పసుపును మోముకుఁ బూసికొనరు
దిక్కుమాలిన ఫ్యాషన్లు దిశలు గ్రమ్మె
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

07/19/2019 - 20:21

ఆంధ్రాంగ్లముల్లో మేస్ర్తి అయిన గోరాశాస్ర్తీ పుట్టింది శ్రీకాకుళం సరిహద్దు అయిన ఒడిస్సాలో! గోవిందు రామశాస్ర్తీ చదువు చాలాచోట్ల సాగింది, పలు ఉద్యోగాలు చేశారు. చివరికి ఖుర్దా రోడ్డులో రైల్వేశాఖలో ఎ.ఎస్.ఎమ్.గా చేస్తున్నప్పుడు ఖాసా సుబ్బారావు కారణంగా 1945లో పత్రికారంగంలో ప్రవేశించారు. స్వతంత్ర పత్రికలో ఆంగ్ల పాత్రికేయుడుగా ప్రవేశించి, 1948 నుంచి తెలుగు స్వతంత్ర పత్రికకి నిర్వహించారు.

07/17/2019 - 19:27

శ్లో: యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
- చండీ సప్తశతి

07/16/2019 - 19:26

ప్రతిరోజు సూర్యారాధన చేస్తే అంతులేని ధనరాశులు అనారోగ్యమే లేని ఆరోగ్యం లభిస్తుంది. సూర్యుని ఆరాధిస్తే కలిమే కాదు బలిమి కూడా ఉంటుందనేది ఆర్యోక్తి. ప్రాతఃకాలంలో బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్నం మహేశ్వరుడుగాను సాయంకాలంలో విష్ణుమూర్తిగాను ఆదిత్యుడు పూజించాలి.సూర్యుడు నమస్కార ప్రియుడు. సూర్యోదయ సమయంలో చేతులు జోడించి నమస్కరించటం, అర్ఘ్యం సమర్పించటం ఎంతో ముఖ్యమైనవి.

07/16/2019 - 19:25

సాధారణంగా వయసు మళ్లినవారిని చూచి హాయిగా రామాకృష్ణా అనుకుంటే పుణ్యం వస్తుందని ఉచిత సలహా ఇస్తూంటాము. భగవంతుడిని ఎన్నో పేర్లతో పిలుస్తూంటాము. దశావతారాలలోని పేర్లు చాలా ప్రసిద్ధమైనవే. కనీసం అందులోని మరే పేర్లతోనయినా పారాయణం చేయవచ్చు. మరి ఆ దశావతారాలలో రామా కృష్ణా అన్న రెండే పేర్లకు అంత ప్రశస్తి ఎందుకు వచ్చింది? ఈ దశావతారాలను మొదటి ఆరింటిని ఒక భాగంగాను తర్వాత నాలుగింటిని మరో భాగంగాను విభజించాలి.

07/15/2019 - 19:43

శ్రీ గురుతత్త్వమే పరమాత్మ తత్త్వము - అమృతము- శుభంకరము కైవల్యమని అందరూ నిరంతరమూ జ్ఞప్తియందుంచుకొనవలయును. లోకం లో సర్వులూ శ్రీ గురుపాదారవింద సంస్మరణము- సేవలతో తరించినవారే. సకల తత్త్వమార్గదర్శి శ్రీ గురుదేవుడే.

07/14/2019 - 22:33

శ్రవణ, కీర్తన, స్మరణ, ఫాదసేవన, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన అను నవవిధ భక్తిమార్గాలనే గాక వాత్సల్యభక్తి , మధురభక్తి అనే మరో రెండు భక్తి విధానాలు కూడా ఉన్నాయ. మధుర భక్తిని గానీ వాత్సల్యభక్తిని గాని అలవర్చుకుంటే సమదృష్టి ఏర్పడుతుంది. అనిర్వచనీయమైన ఆనందం నిలిచి ఉంటుంది. వాటిని గురించి తెలుసుకొందాం.

07/11/2019 - 22:49

ఆషాఢ శుద్ధ ఏకాదశినే ‘తొలిఏకాదశి’గా అంటారు. పూర్వకాలమందు ఈ తొలి ఏకాదశితోనే సంవత్సర ప్రారంభంగా భావించేవారు. ఈ రోజును ‘శయన ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. శ్రీమహావిష్ణువు ఈ రోజునుండి కార్తీకశుద్ధ ఏకాదశివరకు యోగనిద్రలో ఉంటాడని పురాణాలు చెబుతాయ.

07/11/2019 - 22:44

ఫణుల హారాలు కంఠాన ఫాలభాగ
మందు బూదియునొడలెల్లఁ జందనముగఁ
బూసికొను నిరాడంబర మూర్తివీవు
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: శంకరా! మెడలో పాములనే రత్నహారాలుగా ధరించితివి. ఫాలభాగమందే కాక శరీరమంతా బూడిద నే చందనముగా పూసుకొన్నావు. నిరాడంబర మూర్తివయ్య నీవు.

Pages