Others

అవతారాల మర్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా వయసు మళ్లినవారిని చూచి హాయిగా రామాకృష్ణా అనుకుంటే పుణ్యం వస్తుందని ఉచిత సలహా ఇస్తూంటాము. భగవంతుడిని ఎన్నో పేర్లతో పిలుస్తూంటాము. దశావతారాలలోని పేర్లు చాలా ప్రసిద్ధమైనవే. కనీసం అందులోని మరే పేర్లతోనయినా పారాయణం చేయవచ్చు. మరి ఆ దశావతారాలలో రామా కృష్ణా అన్న రెండే పేర్లకు అంత ప్రశస్తి ఎందుకు వచ్చింది? ఈ దశావతారాలను మొదటి ఆరింటిని ఒక భాగంగాను తర్వాత నాలుగింటిని మరో భాగంగాను విభజించాలి. ఈ రెండో భాగంలోనే రామ, కృష్ణ అవతారాలు ఉన్నాయి. ఇందులో రామ, కృష్ణ రెండు అవతారాల ఆవిర్భావము, అంతర్థానమూ కూడా అయిపోయినవి. బౌద్ధ, కల్కి అవతారాలతో కల్కి ఇంకా ఆవిర్భవించనే లేదు. బౌద్ధరూపం (గౌతమబుద్ధుడు)లోని భగవంతుడు ప్రస్తుతం వౌనంగానే ఉన్నాడు. కాబట్టి చివరి రెండు అవతారాలు చెప్పుకొనటానికే తప్ప పారాయణ చేయవలసినవి కావు.
ఇక మొదటి ఆరింటిలో మొదటిదైన మత్స్వాతారం కేవలం వేదోద్ధరణ కోసమే ఆవిర్భవించింది. అలాగే కూర్మావతారం అమృతాన్ని సాధించి దేవతలకు అమరత్వ సిద్ధికొరకు ఆవిర్భావమయినది. భూదేవిని హిరణ్యాక్షుడు సముద్రంలో ముంచివేసే సమయంలో శ్రీ మహావిష్ణువు అత్యవసరంగా మూడవదైన ఆది వరాహమూర్తిగా ఆవిర్భవించాడు. హిరణ్యాక్షుడిని అంతమొందించడమే ఈ అవతార లక్ష్యము. బాల ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు పెట్టే బాధలనుంచి రక్షించి హిరణ్యకశిపుని సంహరించటానికి అత్యంత ఆవేశంతో ఉద్భవించినవాడు నారసింహుడు. వరాహ, నారసింహ అవతారాలు ఆవేశ అవతారాలు. ఈ రెండూ రౌద్ర రూపాలు. క్రోధం రూపుదాల్చినవారు కనుక ఈ రెండు కూడా పారాయణం చేయదగ్గవి కావు.
అదితి గర్భంలో రాక్షస కుల నాశనం చేయటానికి శ్రీ మహావిష్ణువు వామనుడుగా పుట్టినవాడని రాక్షస గురువు శుక్రాచార్యులు వివరించి అడ్డుకొట్టటానికి ప్రయత్నించినా ఆడినమాట తప్పనని, వామనుడడిగిన మూడడుగుల నేలకు భూమ్యాకావాలు రెండడుగులకే సరిపోగా మూడవ అడుగు కొరకు తన తల చూపిన బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కి బలి చక్రవర్తిని దిగంతాలకు వ్యాపింజేసిన వామనుడు బలి చక్రవర్తి కొరకే అవతారమెత్తినాడు. మరి పరశురామావతారం క్షాత్రకుల నిర్మూలనకే అన్న సంగతి తెలిసిదే. అయితే ఒక కుల నిర్మూలనమన్నది అమానుషమైన చర్య. ఇటువంటి అవతారం జపతపాదులకు ఆమోదయోగ్యంకాదు. రాజన్నవాడు ఎలా ఉండాలి, ప్రజలు ఏ విధంగా మసలుకోవాలన్నదానిని నిరూపించి చూపిన శ్రీరాముడు నాటికే కాదు నేటికీ ఆదర్శప్రాయుడే. ఇక శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీత సమస్త మానవాళికి సర్వకాల సర్వావస్థల్లోనూ ఉపయోగపడేది. ఈ రెండు అవతారాల ప్రత్యేకత ఇదే. అందుకే రామా కృష్ణా నామజపం పవిత్రమైనది.

- ఆయి కమలమ్మ