S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/04/2019 - 20:00

భారతదేశానికి మొదటి ఉపరాష్టప్రతిగా, రెండవ రాష్టప్రతిగా పనిచేసిన భారతీయ తత్త్వవేత్త, రాజనీతివేత్త డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని (సెప్టెంబర్ 5)న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. వీరు సెప్టెంబర్ 5, 1888న మద్రాసులోని తిరుత్తణి గ్రామంలో వీరస్వామి-సీతమ్మ దంపతులకు జన్మించారు. వీరి బాల్యము, విద్యాభ్యాసము ఎక్కువగా తిరుత్తణి, తిరుపతిలో గడిచిపోయాయి. 21 సం.

09/01/2019 - 22:38

ప్రమథగణాలకు అధిపతి అయన గణపతి కేవలం ఒక్క భారతదేశంలోనే కాక ప్రపంచంలో చాలా చోట్ల ఆరాధించ బడుతున్నాడు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, టిబెట్, బర్మా, మంగోలియా, థాయిలాండ్, కాంబోడియా, ఇండోనేషియా, చైనా, జపాన్ దేశాల్లోకూడా విశేషమైన పూజలందు కొంటాడు.

09/01/2019 - 22:32

తే.గీ. పెద్దలను పిన్నలం జేసి వెక్కిరించి
హేళనగ మాటలాడెడి హీనమతులు
శ్రమను తామెరుగరుకదా ! ధరణిలోనఁ
గనులు తెరవరు తెరిపింప ఁ గదలు వారి ఁ

08/30/2019 - 20:27

భారతావనిలో అనాదిగా వివిధ పండగలతోపాటు, వ్రతాలు, నోముల ఆచరణ సత్సాంప్రదాయంగా ఉంది. ప్రతి వ్రతమూ ప్రత్యేకతను సంతరించుకుని, ప్రత్యేక ఆచరణలు ఏడాది పొడుగునా ఆచరించ బడతాయి. అలాంటి వాటిల్లో కౌటుంబికులు, సౌభాగ్యవతులు, కన్యలు ఆచరించే హరితాళికా గౌరీ వ్రతం ఒకటి.

08/29/2019 - 19:45

భారతీయ హిందూ సంప్రదాయంలో కందమొక్కకు పోలాల అమావాస్య రోజు పూజిస్తారు. కందగొడుగు పూజలు అనీ కూడా దీనికే పేరు. ఒక నెల రోజుల ముందునుంచే కంద దుంపను భూమిలో పాతి ఉంచాలి. పోలాల అమావాస్య రోజుకు ఆ కంద మొక్క అంకురించి గొడుగు వలె వస్తుంది. పసుపు కుంకుమలతో కందమొక్కను అలంకరించి గాజులు, రవికల గుడ్డను పెట్టి గౌరిదేవిగా భావించి పూజించడం సంప్రదాయం.

08/28/2019 - 19:41

మౌనం బంగారం మాట వెండి అన్నారు. మాట అత్యున్నతమైంది. మనిషికి మాత్రమే ఉన్న అరుదైన అమూల్యమైన సౌలభ్యం. మాటలతోనే కోటలు కట్టవచ్చు. మంచివారికి దగ్గర అవొచ్చు. దేవునికి కూడా ప్రీతి పాత్రులం కావచ్చు. క్రోధస్వభావులను కూడా మార్చవచ్చు. చెడు దారిన పోయేవారినీ మంచిదారిలోకి మంచి మాటలు చెప్పి తీసుకొని రావచ్చు.

08/27/2019 - 19:45

‘క్షమ’ అనే పదంలో ఉన్న రెండు అక్షరాలు చాలా ప్రాధాన్యం కలవి. అందులో క్ష అనే అక్షరం దృఢత్వాన్ని, మ అనే అక్షరం రమ్యతను తెలియజేస్తుంది. మనిషన్నవానికి గుండె గట్టిగా, మనస్సు మెత్తగా ఉండాలన్నది ఈ క్షమ చెబుతుంది.

08/25/2019 - 22:27

వేణువులో వున్నావని వెతికితే సప్త్ధాతువుల వెదరు వెక్కిరించె
కాళీయ మడుగులో కాళీయుని ఫణిపై వెతికితే పరమాత్మ పాదగుర్తులు కనిపించె
వెన్నకుండలలో వెతికితె వనె్నచినె్నల గోపభామల భ్రాంతులు భాసించె
యోగనిద్రలో వెతికితె వెన్నుపాములోని వెయి వెలుగులు మిణుగులై మదిలో మిణుక్కుమనె

08/25/2019 - 22:23

తే.గీ. ఆడవారిని వేధించెడల్పులారా!
పురుగులే మిన్న మీకన్నఁ బునె్నములకు
నెలవులవ్వారలెఱుగుమీ యిలఁ గనంగఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

08/23/2019 - 19:47

దేవకీ గర్భాన దేదీప్యమానవౌ
దీప్తుల వెదజల్లి తీవుకృష్ణ!
యమునమ్మ దారివ్వనల నందునింటను
ముద్దుగఁ బెరిగిన మువ్వ కృష్ణ!
వ్రేపల్లెలో నంత వివిధంబులైనట్టి
యల్లర్లు సృష్టించు నల్లకృష్ణ!
మేనమామంపంగ మ్రింగేయ వచ్చిన
బహు రాక్షసులఁ జంప బాలకృష్ణ !
పదునాల్గులోకాలు పట్టమ్ము గట్టిన ఁ
బశుల కాపరివె గోపాల కృష్ణ!

Pages