Others

సూర్యశతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృత్రిమత్వపు పూతల కీడునెంచఁ
బఓరు పసుపును మోముకుఁ బూసికొనరు
దిక్కుమాలిన ఫ్యాషన్లు దిశలు గ్రమ్మె
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: నేటికాలంలో ఆడవాళ్లు కృత్రిమమైన మైపూతల వల్ల కలిగే కీడును గుర్తించకున్నారు. ముఖానికి పసుపు రాసుకోరు. దిక్కుమాలిన ఫ్యాషన్లు అంతటా వచ్చేశాయి.చూడవయ్య సూర్యదేవ!
చూడఁ బిజ్జాలు బర్గర్ల జోరు పెరిగెఁ
గంటికానవు శాస్ర్తియ వంటకాలు
ఫాస్టు పుడ్లకు నెగఁబ్రాకు వారలకట
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: అంతటా పిజ్జాలు, బర్గర్లు తినడానికి అలవాడు పడిపోయారు. శాస్ర్తియమైన వంటకాలేవీ కనబడడం లేదు. అంతా ఫాస్టు ఫుడ్లకు ఎగబడుతున్నారు చూడవయ్య సూర్యదేవ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262