S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనాంతికం - బుద్దా మురళి

12/30/2016 - 00:18

‘‘రావోయ్ రా..! సమయానికి వచ్చావు.. టీవీలో చాలా ఇంట్రస్టింగ్ న్యూస్ వస్తోంది. ప్రముఖ వ్యాపారి గన్నయ్య ఇంటిని పోలీసులు చుట్టు ముట్టారు. వందల కోట్ల రూపాయల కరెన్సీ ఉందని సమాచారం అందడంతో ఐటి శాఖ అధికారులు దాడి జరిపారు. నోట్ల కట్టలను టీవీలో జూమ్ చేసి మరీ చూపిస్తున్నారు.

12/23/2016 - 00:36

‘‘మీ మెగాస్టార్ 150 సినిమాలో అమ్మడు కుమ్ముడు పాట నీకంత నచ్చిందా? ఎగిరిగంతేస్తున్నావ్’’
‘‘ అన్నగారు మూడు దశాబ్దాల క్రితమే ఆరు దశాబ్దాల వయసులో ఆకు మాటు పిందె తడిచే, ఆరేసుకోబోయి పారేసుకున్నావు అంటూ ఎప్పుడో కుమ్మేశాడు. ఇదేం కొత్త కాదు. చిన్ననాటి నా ప్రేమ, నాకల, నా సిద్ధాంతం ఈ దేశానికి ఇప్పుడు నచ్చడంతో ఈ సంతోషం. ’’
‘‘ఏమా సిద్ధాంతం?’’

12/16/2016 - 01:12

‘‘తెలుగు సినిమా ప్రేమికుడిగా సంతోషంతో కూడిన గర్వంతో ఉన్నాను. ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని పనిని తెలుగు సినిమాలో హీరో ఒంటరిగా చేస్తే అంతా నవ్వేవాళ్లు. అదే ఇప్పుడు నిజమవుతోంది. అందుకే గర్వంగా ఉంది.’’
‘‘ఏ హీరో? ఏం సాధించాడు?? అది చెప్పు’’

12/09/2016 - 00:52

‘‘అంతగా నవ్వొచ్చిన విషయం ఏంటో..? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. మాకు చెబితే మేమూ నవ్వుతాం..’’
‘‘అవినీతి తాట తీస్తా- ఇక అంతా ఆన్‌లైన్‌లోనే.. అని ప్రధానమంత్రి చెబుతున్నారు’’
‘‘దీనిలో నవ్వడానికేముంది..? 70 ఏళ్ల తరువాత దేశాన్ని ఒక మొనగాడు పాలిస్తున్నాడు. దానికి సంతోషపడాలి’’
‘‘అదేంటి వాజపేయిని, మోదీ రెండున్నరేళ్ల పాలనా కాలం కూడా కాంగ్రెస్‌లోనే కలిపేశావా? 70 ఏళ్ల లెక్క ఏంటి? ’’

12/01/2016 - 23:17

‘‘హలో... నేను బాగున్నా... అమెరికాలో నువ్వెలా ఉన్నావ్..? యూనివర్సిటీ నుంచి నేరుగా రూమ్‌కు వెళ్లు .. బయట ఎక్కువగా తిరగకు, దారిలో ‘ట్రంప్’ నిన్ను చూశాడనుకో.. ఇండియా నుంచి వచ్చావని తెలుసుకుని హైదరాబాద్‌కు తిరిగి పంపించేస్తాడు.. సరే మా సంగతికేం?

11/25/2016 - 06:26

‘‘కెవ్వు.. ఎవడ్రా నువ్వు.. నా చెయ్యి పట్టుకున్నావ్.. ‘షీ టీమ్’ను పిలిచానంటే నీ తాట తీస్తారు.. పిచ్చి సన్నాసీ’’

11/17/2016 - 23:29

‘‘మిమ్ములను డిస్ట్రబ్ చేసినందుకు క్షమించాలి.. కుటుంబరావు గారేనా?’’
‘‘అవును’’
‘‘నమస్కారం. నేను కుక్కుటేశ్వరరావును.. మున్సిపల్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాను. మున్సిపల్ పర్మిషన్ పూర్తయింది. సమయం ఇస్తే మేమే ఇంటికి వచ్చి ఇస్తాం.’’
‘‘ 50 వేలు కావాలన్నారు కదా? ఆ ఏర్పాట్లలోనే ఉన్నా.. చెయ్యి కాస్త టైట్‌గా ఉంది.’’

11/11/2016 - 07:22

‘బ్రేకింగ్ న్యూస్.. నీకే ముందు చెబుతున్నా.. మా ఊరి పంచాయితీ వార్డ్ మెంబర్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయాన్ని గుర్తిస్తున్నట్టు ఇప్పుడే ప్రకటించాడు. పద్ధతులు మార్చుకుని అందరితో కలిసి పని చేయాలని, అమెరికా అభివృద్ధికి కృషి చేయాలని సూచించాడు’
‘‘ఏడ్చినట్టే ఉంది నీ బ్రేకింగ్ న్యూస్. పంచాయితీ వార్డు మెంబర్ ట్రంప్ గెలుపును గుర్తిస్తే ఎంత ? గుర్తించక పోతే ఎంత?’’

11/03/2016 - 22:30

‘‘ఇలా పార్టీలు మార్చడం అన్యాయం..’’
‘‘ఔను.. సుప్రీం కోర్టు కూడా ఇదే మాట చెప్పింది’’
‘‘నేను చెప్పింది అమెరికా గురించి’’
‘‘అక్కడ ఉన్నవే రెండు పార్టీలు. ఎలా మారుతారు?’’
‘‘ నేను చెప్పింది ప్రజల గురించి ’’
‘‘ఏం మాట్లాడుతున్నావ్! ప్రజలు పార్టీలు మార్చడం ఏమిటి? ’’

10/27/2016 - 23:47

‘‘కొన్ని విషయాలు మనకు అస్సలు అర్థం కావు’’
‘‘ఏంటో.. నీకు అంతగా అర్థం కాని విషయాలు...’’
‘‘ఎంతో అందంగా కనిపించే సినీ హీరోయిన్లను నమ్మడానికి వీలులేదు’’
‘‘నువ్వు ప్రేమించిన హీరోయిన్ ఎవరికైనా సొంతమైందా? ’’
‘‘నా గురించి కాదు.. కమల్‌హాసన్ గురించి? ’’
‘‘పవన్ కల్యాణ్‌లా పెళ్లిళ్లు, సహజీవనంతో కమల్ హాయిగానే ఉన్నాడు కదా? ’’

Pages