S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనాంతికం - బుద్దా మురళి

08/07/2016 - 00:20

‘‘సినిమా చూపిస్త మామా! నీకు సినిమా చూపిస్త మామా! సీను సీనుకూ నీతో సీటీ కొట్టిస్త మామా’’
‘‘చూపిస్తా చూపిస్తా అనడమే కానీ ఒక్క సినిమా ఐనా చూపించావా?’’
‘‘మనం చూడాలనుకున్న సినిమాకు టికెట్లు దొరకవు, టికెట్లు దొరికిన సినిమాకు లీవు దొరకదు. రెండూ కుదిరితే సినిమా బాగోదు జీవితం ఇంతే. ఐనా నేను పాడింది నీకు చూపించే సినిమా గురించి కాదు.. మోదీ చూడబోయే సినిమా గురించి’’

07/31/2016 - 22:00

‘‘దీని వెనుక పెద్ద అంతర్జాతీయ కుట్ర ఉంది?’’
‘‘ఏదీ మనం తినే పిజ్జా వెనుకనా? మన ఫుడ్ మనం మరిచిపోయి ఆరోగ్యం పాడు చేసే ఇలాంటి తిండి తినడానికి మనకు అలవాటు చేయడం వెనుక బహుళ జాతి కుట్రే కారణం’’
‘‘ఎప్పుడూ తిండి యావేనా? ఆంధ్రకు ప్రత్యేక హోదాను కేంద్రం ప్రకటించక పోవడం వెనుక పెద్ద అంతర్జాతీయ కుట్ర ఉందని తెలుగు నేత ఒకరు నాకు రహస్యంగా చెప్పారు’’

07/24/2016 - 01:02

‘‘అబ్బాయి కమల్ హాసన్ అంత అందగాడు. ఐటి కంపెనీ ఉద్యోగం
నెలకు లక్ష.. డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ రెండు, బ్యాంకులో డిపాజిట్. ఐనా అమ్మాయి నో చెప్పింది’’
‘‘ఎందుకు? ’’
‘‘కబాలి మొదటి రోజు మొదటి ఆటకు టికెట్ సంపాదించగలవా? అని పెళ్లి చూపుల్లో అమ్మాయి అడిగితే నా అబ్బాయి నా వల్ల కాదు అన్నాడట! దాంతో ననే్నం సుఖపెడతావు సంబంధం క్యాన్సిల్ అంది’’

07/17/2016 - 05:12

‘‘నీకో నగ్న సత్యం చెప్పాలా?’’

07/10/2016 - 03:51

‘‘ఏంటీ దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?’’
‘‘ఇంటికీ, గొడ్ల చావడికీ పై కప్పు గురించి మాత్రం కాదులే .. నువ్వూ చేతులు కలుపుతానంటే చెబుతాను. మనం ఇద్దరం కలిశామంటే మన ప్లాన్ ఫలిస్తే వందల కోట్ల రూపాయల స్థలం మనదవుతుంది’’
‘‘వంద గజాల ప్లాటే కొనలేకపోయాం. వందల కోట్ల స్థలం ఉచితంగా ఇచ్చినా తీసుకునేంత సీన్ మనకుందా? సక్సెస్ అయితే వందల కోట్లు, కాకపోతే జైలుకేనా?’’

07/03/2016 - 01:59

‘‘ఏదీ శాశ్వతం కాదు.’’
‘‘ఔను ఎప్పుడైనా అనుకున్నామా సికిందరాబాద్‌లో ఆనంద్ భవన్ మూసేస్తారని, జె రామచంద్రయ్య క్లాత్ స్టోర్‌ను కూల్చేసారని, నగరం రూపే మారిపోతోంది’’
‘‘అఫ్ఘానిస్తాన్‌లో అంత పెద్ద బుద్ధుని విగ్రహానే్న , రష్యాలో ఎర్ర దేవుడు లెనిన్ విగ్రహాలను కూల్చేసినప్పుడు ఆనంద్‌భవన్‌ను కూల్చడం ఎంత సేపు.. నేనంటున్నది దాని గురించి కాదు. కొన్నిసార్లు మనం అస్సలు ఊహించనివి జరుగుతుంటాయి’’

06/25/2016 - 23:17

‘‘పని మనిషి రాలేదు. బ్రెగ్జిట్ ప్రభావమట! వాళ్ల గుడిసె అద్దె పెంచమని చెప్పారట!మనం జీతం పెంచాలట!పొద్దున అటోవాడు కూడా కిరాయి పెంచితేనే రేపటి నుంచి పిల్లాడిని స్కూల్‌కు తీసుకెళతానంటున్నాడు. ఎవర్ని పలకరించినా బ్రెగ్జిట్ అంటున్నారు! ? ’’
‘‘చిన్నప్పుడు స్కైలాబ్ పడుతుందని, రోజులు దగ్గర పడ్డాయని బర్రెలు, గొర్రెలు అమ్ముకుని జల్సా చేశారు గుర్తుందా? ఇది కూడా అలాంటిదేనన్నమాట’’

06/19/2016 - 00:48

‘‘డార్లింగ్ గుడ్ న్యూస్. మన కలలు ఫలిస్తున్నాయి.. ’’
‘‘మీ బంధువులెవరన్నా పోయి మనకు ఆస్తి కలిసొస్తుందా? రజనీకాంత్ సినిమాలోలా ఎప్పుడో ఇంటిని విడిచి వెళ్లిపోయిన మీ నాన్న కోట్ల రూపాయల ఆస్తి నీకే చెందుతుందని విల్లు రాశాడా? ’’

06/12/2016 - 02:07

‘‘పినాకిని వాళ్ల అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. హైదరాబాద్‌లో మూడు వందల గజాల ప్లాట్, పాతిక లక్షల కట్నం ఇస్తున్నారట!’’
‘‘అమ్మాయి అందవికారంగా ఉంటుందా? కాలం మారి చాలా కాలం అయింది. అమ్మాయిలే అబ్బాయిలను రిజెక్ట్ చేస్తున్నారు. మన కాలంలో అబ్బాయి కట్నం వద్దంటే ఏదో లోపం అనుకునే వాళ్లు. ఇప్పుడు అమ్మాయికి భారీ కట్నం ఇస్తే ఏదో లోపం అనుకుంటున్నారు.’’
‘‘మళ్లీ కన్యాశుల్కం వస్తుందేమో’’

06/04/2016 - 23:49

‘‘సాటి మనిషిలోని మేధస్సును మనం ఒప్పుకోం. మేధావులందరూ ఎప్పుడో ఒకప్పుడు పిచ్చివాళ్లుగా ముద్ర పడిన వారే.’’
‘‘ఈ రోజుల్లో మేధావి అని పిలిస్తే సిగ్గుపడాలి కానీ, ఇంత బాధెందుకోయ్’’
‘‘నా బాధ లోకం గురించి. మేధావుల మాటలను తేలిగ్గా తీసుకునే సమాజం గురించి’’

Pages