S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనాంతికం - బుద్దా మురళి

05/26/2017 - 07:55

‘‘అంత ఆసక్తిగా చూస్తున్నావు.. ఎంసెట్ రిజల్ట్స్‌నా? ’’
‘‘ఎంసెట్, ఐఐటి రిజల్ట్స్‌లో ఆసక్తి ఏముంటుంది? ర్యాంకులన్నీ మనవాళ్లేకే కదా! జనసేన పార్టీ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ఫలితాలు చూస్తున్నా. అందరికీ తెలిసిన ప్రశ్నలకు- పవన్‌కల్యాణ్ మదిలో ఉన్న సమాధానాలు ఏంటో ఊహించి రాయడం కష్టం ’’
‘‘ప్రశ్నించేందుకే పార్టీ.. అంటే ఇదేనా? మనమే అర్థం చేసుకోలేదు.’’

05/19/2017 - 07:48

‘‘పార్టీ అన్నావు, పదిమందిని పిలిచావు. ఇక్కడ పార్టీకి కావలిసిన ఆయుధాలు ఏమీ కనిపించడం లేదు. ఇంతకూ పార్టీ ఉందా? లేదా?’’

05/12/2017 - 01:34

‘‘నీకీ విషయం తెలుసా..?’’
‘‘చెప్పదలుచుకున్న విషయం వాస్తవమే అనే నమ్మకం నీకుంటే చెప్పు..’’
‘‘ఏ కాలంలో ఉన్నావోయ్..? వాట్సప్‌లో వచ్చింది చెప్పడమే తప్ప నిజానిజాలు ఎవడిక్కావాలి? సరే ముందు విషయం విను. తనపై ఉన్న కేసుల విషయమే వైకాపా అధినేత జగన్ దిల్లీలో ప్రధాని మోదీని కలిశారు’’

05/05/2017 - 08:23

మోయ్.. ఆ బీరువాలో ఉన్న 12వ నంబర్ మాస్క్ తీసుకురా..! మనింటికి చిదంబరం వస్తున్నాడు’’
‘‘ఇదిగోండి’’
‘‘రెండు మాస్క్‌లు తెస్తున్నావేం?’’
‘‘ఇంకోటి నాకు. వనితగారింటికి వెళ్లి కాఫీ పౌడర్ తెస్తా. ఆమెకు నచ్చినట్టు మాట్లాడాలంటే నాలుగవ నంబర్ మాస్క్ బాగా సూటవుతుంది’’
‘‘రావోయ్ చిదరంబరం . రా..రా.. ఇప్పుడే నీ గురించే అనుకుంటున్నాం. మాటల్లో నువ్వు వచ్చేశావ్.’’

04/28/2017 - 00:32

‘‘ఏం రాస్తున్నావ్!’’
‘‘పురుషుడి కష్టాల గురించి. న పురుష స్వాతంత్య్ర మర్హతి అని రాస్తున్నా’’
‘‘న పురుష కాదు బాబు న స్ర్తి అని రాయాలి’’
‘‘అది నాకు తెలుసు నేను మనువుకు లేటెస్ట్ వెర్షన్ కావాలనుకుంటున్నాను. అందుకే అలా రాస్తున్నా ’’
‘‘ఇదేమన్నా రాజకీయ పార్టీనా? కొట్టుకొచ్చి, గుంజుకొచ్చి.. కొనుక్కొచ్చి మార్చగానే నీ సొంతం కావడానికి’’

04/14/2017 - 01:22

‘‘రామప్ప పంతులు ఇజంపై పరిశోధన చేయాలనుకుంటున్నా.. నువ్వేమంటావ్?’’
‘‘రామాయణంలో మహిళా పాత్రలు, మహాభారతంలో పురుష పాత్రలపై కూడా పరిశోధనలు చేసేస్తున్నారు. రామప్పపంతులిజంపై పరిశోధన చేస్తే వద్దనేదెవరు..? చేసేయ్..! ఐనా హఠాత్తుగా నీకా ఆలోచన ఎందుకొచ్చింది?’’

04/07/2017 - 07:15

‘‘మేధావి గారూ.. దిగులుగా ఉన్నారేం? ఈరోజు ‘ప్ర పంచ డిప్రెషన్ డే’ కదా!. సింబాలిక్‌గా- డిప్రెషన్‌లోకి వెళ్లారా? ’’
‘‘కాదు.. మా సొంతూరు వెళ్లి వచ్చా. అప్పటి నుంచి దిగులు మరింత పెరిగింది. నీకేం హాయిగా ఉంటావ్’’
‘‘ఏదో మిడిల్ క్లాస్ ఆలోచనతో డబ్బులే సమస్య అనుకున్నాను. నికరగువాలో ప్రజాస్వామ్య హక్కులు, అమెరికా సామ్రాజ్య వాదం నుంచి అనకాపల్లి సామాజ్ర వాదం వరకు మీకు అన్నీ సమస్యలే కదా? ’’

03/30/2017 - 23:20

‘‘ప్రతి విజయం వెనుక...’’
‘‘ఇక చాల్లే... నాకు తెలుసు...!’’
‘‘ఏదీ చెప్పు చూద్దాం?’’
‘‘ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి బుడ్డోడూ అమ్మాయిలను ఇంప్రెస్ చేద్దామని రాసే మొదటి మాట ఇదే. ప్రతి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది అనే కదా? నువ్వు చెప్పబోయేది’’

03/24/2017 - 01:02

‘‘ఏంటి గురూ..! దేశంలో ఏ గ్రామంలోనైనా మన పార్టీ అభ్యర్థి సర్పంచ్‌గా గెలిచాడా? గాంధీభవన్ అంతా సందడిగా ఉంది.’’ అని ఒక నేత పక్కనున్న నేతను చమత్కారంగా ప్రశ్నించాడు. ‘సీరియస్ విషయాల్లో ఇలాంటి సిల్లీ జోకులు వద్దు’ అని మరో నేత నుంచి విసుగ్గా సమాధానం.. కవిత్వం ,జోకు.. ఏదో రూపంలో బయటకు తన్నుకు వస్తుంటుంది?

03/17/2017 - 00:55

‘చల్లని రాజా ఓ చందమామా..’
‘‘చల్లని రాత్రి వేళ నిండు పున్నమిని చూస్తూ ఈ పాట వింటుంటే ఆకాశంలో తేలిపోతున్నట్టుంది. చందమామ మీద అన్నీ అద్భుతమైన గీతాలే. ఆ రోజులే వేరు.. పున్నమి చంద్రుణ్ణి అందంగా చూపడమే కాదు, అంత కన్నా అద్భుతంగా పాటలు రాశారు ఆ నాటి సినీ కవులు.. ఇన్ని దశాబ్దాలు అయినా ఆ పాటలు వింటుంటే మరో లోకంలోకి వెళ్లినట్టుగా ఉంటుంది. వౌనంగా ఉన్నావ్... ఏదైనా మాట్లాడు’’

Pages