S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనాంతికం - బుద్దా మురళి

03/19/2016 - 23:40

‘‘ మీరెవరు? యమధర్మరాజులా ఉన్నారు? ?’’
‘‘ యమధర్మరాజునే. నీ పేజీ చింపేశాను, పైకి తీసుకెళుతున్నాను’’
‘‘ ఇదన్యాయం నేనొప్పుకోను. కోర్టుకెళతాను’’
‘‘ అసలేం జరిగింది? ’’
‘‘ వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌లో సినిమా చూస్తూ కాలువలో పడిపోయి. ఇక్కడికొచ్చేశావు. ఇంతకూ అంతగా మైమరిపించిన సినిమా ఏంటో’’

03/12/2016 - 22:32

‘‘క్ళ్ల ముందే ఎంత ప్రతిభ ఉన్నా గుర్తించక పోవడం తెలుగు వారి దురదృష్టం’’
‘‘ఆ ప్రతిభ మాకూ చెబితే తెలుసుకుని తరిస్తాం’’
‘‘పగబట్టిన కుక్క అని బ్రహ్మాండమైన టైటిల్‌తో నా దగ్గరో సూపర్ హిట్ సినిమాకు కథ ఉంది. మంచి నిర్మాత దొరకడమే తరువాయి’’

03/05/2016 - 23:18

‘‘ఆపదలో ఉన్న వారిని రక్షించినా యమపాశమై చుట్టుకుంటోంది. ... ఇదేం లోకం’’
‘‘ఈ విషయం సుప్రీంకోర్టు గుర్తించే ప్రమాదాల్లో ఉన్న వారిని రక్షించే వారిని వేధించకుండా చట్టాలు తీసుకు రావాలని సూచించింది. ’’
‘‘ నేను చెప్పేది దాని గురించి కాదు. రోడ్డు మీద ఎవరు చస్తే నాకేం.’’
‘‘ మరి దేని గురించి ?’’

02/28/2016 - 07:28

‘‘మన వీరవాసరం వాళ్ల అమ్మాయికి ఆ నారపల్లి సంబంధం బాగా సరిపోతుంది. నా ఓటు నారపల్లి అబ్బాయికే’’
‘‘ ఆ అమ్మాయి ఐటి ఉద్యోగి. అబ్బాయికి పెద్దగా చదువు సంధ్య లేనట్టుగా ఉంది నీకెలా నచ్చిందమ్మా’’
‘‘వీడు పిల్లాడు వీడికేం తెలియదు. ఆ సంబంధాన్ని ఖాయం చేసుకోమని నా మాటగా చెప్పండి. అబ్బాయి చేతికి వాచీ లేదు,వేలికి ఉంగరం లేదు. నచ్చడానికి ఇంత కన్నా ఇంకేం కావాలి.’’

02/21/2016 - 07:44

‘‘ఇదిగో నిరంజన్‌రావు నీకు వంద సార్లు చెప్పాను. గంజితో ఆరబెట్టి ఇస్ర్తి చేసిన నీ చొక్కా కత్తిలా నా చేతికి గాటు పెట్టింది. గంజిలేని చొక్కా వేసుకోలేవా? ’’
‘‘ అధికారం కోసం మరో రెండు దశాబ్దాలైనా ఎదురు చూస్తాం. పదవి లేకపోయినా ఉండగలం. గంజిపెట్టిన కడక్ చొక్కా లేకపోతే రాజకీయాల్లో ఉండలేం. చిన్నప్పటి నుంచి చొక్కామీద మోజుతో రాజకీయాల్లోకి వచ్చాను’’

02/14/2016 - 04:37

‘‘ఈ రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా ఉన్నాయి’’
‘‘ సినిమా కథ తెలిసీ, ఆందోళన చెందుతున్నట్టు నటిస్తున్న ప్రేక్షకుడిలా కనిపిసున్నావ్ నువ్వు’’
‘‘నీకన్నీ వేళాకోళాలే. తెలంగాణలో టిడిపి ఉంటుందా? విలీనం చెల్లుతుందా? రేవంత్ ఏ పార్టీలో చేరుతాడు? లోకేశ్ భవిష్యత్తు ఏమిటి? హరీశ్‌రావు తిరుగుబాటు ఎప్పుడు? అన్నీ సస్పెనే్స కదా? ’’

02/07/2016 - 01:59

‘‘నంబర్ వన్‌గా నిలవడం చాలా కష్టం’’
‘‘ ఆ కార్పొరేట్ కాలేజీ వాళ్లు ఎంసెట్‌లో నంబర్ వన్ ర్యాంకు వచ్చే అవకాశం ఉన్న వాళ్లను ముందే పసిగట్టి లక్షలకు లక్షలు ముట్ట చెప్పి కొనుక్కుంటారు’’
‘‘ టీవిలో కనిపించే ఒకటి ఒకటి ఒకటి అన్నీ మాకే అనే ప్రకటన గురించా?’’

01/31/2016 - 07:17

‘‘గందరోగళంగా కనిపిస్తున్నావ్ , నగరానికి కొత్తా?’’
‘‘కొత్త కాదు.. పాత నగరానికి మీ అందరి కన్నా చాలా పాత. ఇంతకూ నువ్వెవరివి? ’’
‘‘నేను పాదచారిని నడిచే బాట ఎక్కడైనా ఉందేమోనని వెతుకుతున్నాను. ఎక్కడ మాయమైందో తెలియడం లేదు. నువ్వేవరో? దేని కోసం నీ అనే్వషణో చెప్పనే లేదు. ’’
‘‘నేను హైదరాబాద్ నగరాన్ని. నా గురించి నేను తెలుసుకుందామని బయలు దేరాను’’

01/23/2016 - 21:54

రానీ హోటల్‌లో టీ తాగే డబ్బుతో రెండు పేపర్లు కొనుక్కోవచ్చు. ఉడిపి హోటల్‌లో టీ అయితే రెండు తెలుగు పత్రికలకు తోడు ఓ ఇంగ్లీష్ పత్రిక వస్తుంది. ఇంట్లో చానల్ ఆన్ చేస్తే 24 గంటల పాటు వార్తలు చెప్పే చానల్స్ తెలుగులో 24, ఇతర భాషల్లో మరో 64 ఉన్నాయి. ఎంత జర్నలిస్టు మిత్రుడిది అయితే మాత్రం రోజూ ఇలా వచ్చి వార్తలు అడుక్కోని వెళ్లడం నాకేమీ నచ్చలేదోయ్ కామేశం’’

01/17/2016 - 07:45

‘‘నీకు ప్రపంచ పటాల గురించి తెలుసా? ’’
‘‘ఓ సినిమాలో కృష్ణ్భగవాన్ చెప్పినట్టు మేమూ టెన్త్ పాసైన వాళ్లమే. దేశాలను గుర్తించే పరీక్షలు రాసిన వాళ్లమే. ఆబిడ్స్ హెడ్ పోస్ట్ఫాసు చుట్టూ, సికిందరాబాద్ స్టేషన్ వద్ద, రాజేశ్వర్ థియేటర్ వద్ద శ్రీరామా బుక్ డిపో ఉంది కదా? అక్కడ కూడా దొరుకుతాయి ’’
‘‘కవి హృదయం అర్ధం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటావ్! కొనుక్కోవడానికి కాదు నేనడిగింది’’

Pages