S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనాంతికం - బుద్దా మురళి

03/10/2017 - 00:19

‘ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్లు మూసుకున్నావా?’.. అంటూ పాట వస్తుంటే అక్కడ ‘అక్కినేని’ కనిపించడం లేదు.. భక్తతుకారాం కనిపిస్తున్నాడు.
‘‘ఎంత మధురమైన గాత్రం.. ఎంత భక్తి.. ఇప్పటి వాళ్లు ఎన్ని జన్మలెత్తినా భక్తతుకారాం లాంటి సినిమా తీయలేరు. ఏమంటావు?’’
‘‘ఏమీ అనను’’

03/03/2017 - 00:46

‘‘ఏమైంది..? అలా ఉలిక్కిపడి లేచి పిచ్చిచూపులు చూస్తున్నారు? గ్యాస్ సిలిండర్‌కు వంద రూపాయలు పెంచగానే అలా వెర్రిచూపులు చూడాలా? అచ్చే దిన్ అంటే ఈ మాత్రం భరించాలి తప్పదు’’
‘‘్ధరలు తగ్గితే పిచ్చిచూపులు చూస్తానేమో కానీ, బడ్జెట్ రోజు సిగరెట్ల ధర, రోజూ పప్పుల ధర, వారానికోసారి పెట్రోల్ ధర పెరిగితే ఆశ్చర్యపోయేంత పిచ్చోన్ని కాను.’’
‘‘మరి ఆ ఉలికిపాటు ఎందుకు?’’

02/24/2017 - 00:51

‘‘నీ వెనక కోట్ల రూపాయల ఆస్తి, సారా వ్యాపారం, వడ్డీ వ్యాపారం లేక బాగా ఆదాయం తెచ్చి పెట్టే ఎన్‌జివో ఏమన్నా ఉందా? మరేముందని పోజులు కొడుతున్నావ్’’
‘‘నా వెనుక అణగారిన జనం ఉన్నారు. నా మెదడులో విప్లవ భావాలు ఉన్నాయి? మా ఇంట్లో గుట్టలు గుట్టలుగా ఎర్ర పుస్తకాలున్నాయి?’’
‘‘ఓ జెండా ఉంది, దాన్ని మోసేందుకు ఓ కర్ర ఉంది. అది కూడా చెప్పు’’

02/17/2017 - 01:22

‘‘తిరుపతయ్య తన కుమార్తెకు ఎక్కడెక్కడో పెళ్లి సంబంధాలు చూశారు. యాధృచ్చికంగా సినిమా హాలులో కలిసిన కాలేజీ క్లాస్‌మెట్ అందరికీ నచ్చడంతో ఆ సంబంధమే ఖాయం చేశారు. ఎవరికి ఎక్కడ రాసి పెట్టి ఉంటే అక్కడ అవుతుంది’’

02/10/2017 - 00:59

‘‘తెలుగు పాపులర్ సినిమా తమిళ్ డబ్బింగ్ చూస్తున్నట్టుగా ఉంది?’’
‘‘న్యూస్ చానల్స్‌లో సినిమానా?’’
‘‘తెలుగునాట 1995లో జరిగింది. 22ఏళ్ల తరువాత ఇప్పుడు తమిళనాడులో జరుగుతోంది. కథ పాతదే కానీ, కాలానికి తగ్గట్టు పాత్రలను కొంత మార్చారు. ఇక్కడ ఎన్టీఆర్ సమాధి వద్ద కనిపించిన సీనే్ల అక్కడ- చెన్నైలో మెరీనా బీచ్ వద్ద జయలలిత సమాధి వద్ద కనిపిస్తున్నాయి ’’

02/03/2017 - 20:50

టీవీలో జబర్దస్త్ చూస్తున్నావా?’’
‘‘ ఇవాళ పంచమి.. అలాంటివి చూస్తామా? ’’
‘‘బడ్జెట్ వార్తలు వింటున్నట్టున్నావ్! జన్‌ధన్ ఖాతాల్లో వేస్తానన్న 15 లక్షల గురించి ఏమైనా చెప్పాడా? ’’
‘‘లేదు’’
‘‘ఇంతకీ జన్‌ధన్ ఖాతాల్లో ఎంత వేస్తారట!’’
‘‘లేదు’’
‘‘పెద్దనోట్ల రద్దుతో ఎంత నల్లధనం బయటపడిందో చెప్పాడా? ’’
‘‘లేదు’’
‘‘మరేం వింటున్నావ్ ?’’

01/27/2017 - 02:51

‘‘ఏదో రుబ్బుతున్న సౌండ్ వస్తోంది. ఏం రుబ్బుతున్నావ్..?’’
‘‘చరిత్ర సృష్టిస్తున్నాను.. తెలుగు సినిమాలో చరిత్ర సృష్టించే ‘చరిత్ర కథ’ రాస్తున్నాను.’’
‘‘కథ చెప్పు.. ఒక ప్రేక్షకుడిగా నాకు నచ్చితే ఆ కథ సూపర్ హిట్ అయినట్టే!’’
‘‘మాకు కావలసింది మీలాంటి అభిమానులే. కథ చెబుతా.. కానీ మధ్యలో డౌట్లు అడగవద్దు ’’

01/20/2017 - 01:54

‘‘మొన్న సిటీలో మా బంధువుల ఇంటికి వెళ్లాను.. కాలనీలో రాత్రి దొంగతనం జరిగింది.’’
‘‘మీరో రాజరాజ నరేంద్రులు, మీ బోషాణంలో దొంగతనం జరిగితే దొంగలను పట్టుకునే బాధ్యత సైన్యాధ్యక్షుడైన నాకు అప్పగించినట్టు ఆ పోజులేంటి? ఈ రోజుల్లో దొంగతనాలు జరగని కాలనీలు ఉంటాయా? ఇది కామన్’’

01/13/2017 - 02:18

‘‘యుద్ధం చూస్తాం అని పిల్లలు ఒకటే గోల..’’
‘‘శివ సినిమా చూసి వావ్ తెలివైన దర్శకుడు తెలుగునాట పుట్టాడు అని అనుకుంటే తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు థర్డ్ క్లాస్ సినిమాలతో పోటీ పడి అవే నయం అనిపించేంతగా వర్మ ఎదిగిపోయాడు. ఆ సినిమాలకు రానంటే రాను.. మీరు వెళ్లండి’’

01/05/2017 - 23:54

‘‘ఏం
టీ.. అలా మెలికలు తిరిగిపోతున్నావ్..! ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నావ్! చెప్పు.. ’’
‘‘మబ్బు అడ్డం వస్తే సూర్యుడు కనిపించడు
బస్సు అడ్డం వస్తే స్కూటర్ కనిపించదు
మనం కోరుకున్నప్పుడు బస్సు రాదు
వచ్చిన బస్సు మన ఇంటికి పోదు.. ఇదేరా జీవితం’’

Pages