S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనాంతికం - బుద్దా మురళి

10/20/2016 - 22:09

‘‘రోజురోజుకూ అవినీతి పెరిగిపోతోంది’’
‘‘ఏంట్రోయ్.. నువ్వు కూడా విలువల కోసం పరితపిస్తున్నావ్! బాగానే సంపాదించినట్టున్నావ్! మాదకద్రవ్యాల వ్యాపారం ఏమైనా మొదలుపెట్టావా? ’’

10/14/2016 - 00:25

‘‘్ఛ..్ఛ .. బుద్ధి లేకపోతే సరి.’’
‘‘ఏంటోయ్ టీవీ చూస్తూ తిడుతున్నావ్ ఎవరిని?’’
‘‘ఇంకెవరినీ అదిగో వాళ్లనే’’
‘‘అక్కినేని రొమాంటిక్ హీరోగా వెలిగిపోతున్న ‘మురళీకృష్ణ’ సినిమా కాలం వాడివి. కళ్లతోనే హీరోయిన్లు శృంగారాన్ని ఒలికించే కాలం కాదిది. హీరో,హీరోయిన్ల సాంగ్ అంటే వాత్సాయనుడి భంగిమలే. దీనికే ఇలా ఫీలయితే ఎలా? ’’

10/01/2016 - 23:55

ఉద్వేగపూరితమైన వాతావరణం.. ‘కమాండర్’ గతంలో ఎప్పుడూ లేనంత సీరియస్‌గా ఉన్నారు.. ఆగస్టు దాటి రెండు నెలలు అవుతోంది.. టెన్షన్‌కు కారణం ఏమై ఉంటుందా? అని ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో టీవీలో బ్రేకింగ్ న్యూస్‌లు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు.. ముష్కరులను మట్టుపెట్టిన భారత సైన్యం. భారత్‌కు బాసటగా నిలిచిన అనేక దేశాలు. మేము సైతం భారత్ వెంటే అని ప్రకటించిన ఇరాన్..

09/25/2016 - 00:57

‘‘ప్రపంచం చాలా మారిపోయిందన్నయ్యా!’’
‘‘ చిన్న వయసులో అంత వైరాగ్యం’’
‘‘మీడియాలో ఉన్నందుకు మనకు అన్నీ తెలుస్తాయనుకుంటాం. ఏ స్టోరీని ఎలా కవర్ చేయాలనుకుంటే ప్రపంచం అలానే ఉందనుకుంటాం. కానీ కాదన్నయ్యా ప్రపంచం చాలా మారిపోయింది.’’
‘‘ఏమైంది?’’

09/18/2016 - 03:05

‘‘నాంచారయ్య మనవడిని అని చెప్పుకోవడానికి మించిన అదృష్టం ఈ జీవితానికి ఇంకోటి లేదు’’
‘‘నాంచారయ్య నటుడా? గొప్ప సాహితీకారుడా? గురజాడ సమకాలీనుడా? దాశరథి క్లాస్‌మెట్‌నా? శ్రీశ్రీ మిత్రుడా? ’’
‘‘అలాంటిదేమీ లేదు’’
‘‘స్వాతంత్య్ర సమర యోధుడా? వీర సైనికుడా?’’
‘‘కాదు ’’
‘‘మరేంటి?’’

09/11/2016 - 04:08

‘‘వాళ్లిద్దరూ ఎన్టీఆర్ సావిత్రిలా, అక్కినేని వాణిశ్రీలా, శోభన్‌బాబు జయలలితలా, రాజబాబు, రమాప్రభలా చెట్టాపట్టాలేసుకొని తిరిగే వారు కదా? ఇప్పుడేమైంది. అలా తిట్టుకుంటున్నారు.’’
‘‘ఎన్టీఆర్, అక్కినేనిల మునిమనవళ్లు, దూరపు బంధువులు కూడా హీరోలయ్యారు. నువ్వు అక్కడే ఆగిపోయావు’’
‘‘ మరీ సాంకేతికంగా తప్పులను వెతికి చూడకు. ఆ పంచాయితీ ఏంటో తెలిస్తే చెప్పు’’

09/04/2016 - 00:12

‘‘ఆ దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటావ్?
‘‘స్టే’’
‘‘నువ్వు రాజకీయం మాట్లాడుతున్నావ్’’
‘‘జీవితమే రాజకీయం.’’
‘‘స్టే అనగానే నువ్వు ఏదో ఊహల్లోకి వెలుతున్నావ్’’
‘‘రాజకీయం కాదా? ఐతే ఇంకే స్టే ఉంటుంది చెప్పు’’

08/28/2016 - 01:10

‘‘రాంగోపాల్ వర్మ నరుూమిజంపై మూడు సినిమాలు తీస్తారట! ఆయన కన్నా ముందే ప్రేక్షకులు నరుూమ్‌పై వర్మ సినిమా ఖాయం అనుకున్నారు. ’’
‘‘ప్రేక్షకులు మరీ రాటుతేలిపోయారు.’’
‘‘మూడు సినిమాలు తీసేంత నేరాలున్నాయా? ’’
‘‘నరుూమ్ పేరు వినగానే అలా అయిపోయావు. భయపడ్డావా?’’

08/21/2016 - 00:45

‘‘ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది? దిగులెందుకు?’’
‘‘సమస్య ఏమిటో తెలియకుండానే పరిష్కారం చూపడం మీ మేధావులకే చెల్లు’’
‘‘ స్నేహితుడివని పలకరిస్తే,మేధావి అని అంత పెద్ద తిట్టు న్యాయమా? ఇంతకూ నీ సమస్య చిరంజీవి 150వ సినిమా హిట్టవుతుందా? లేదా? అనేనా? ’’
‘‘చిరంజీవి అన్నయ్య రాజకీయాల్లోకి వచ్చాక నేను కూడా రాజకీయాల గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నాను. నా సమస్య సినిమా గురించి కాదు..’’

08/14/2016 - 05:15

‘‘తాతా ఓ కథ చెప్పవా?’’
‘‘నా పోలీసు జీవితంలో నేను పాల్గొన్న సాహస కథ చెబుతా! ఆ ఆపరేషన్‌లో ప్రాణాలతో బయటపడింది నేనొక్కడినే’’
‘‘చెప్పు తాతా’’
‘‘నరుూమ్ అని మా కాలంలో నరరూప రాక్షసుడు. భూమిని చుట్ట చుట్టి తన జేబులో పెట్టుకున్న భయంకర రాక్షసుడు. అరాచకాలు మితిమీరిపోవడంతో పోలీసు అధికారులు ఇండియన్ పీనల్ కోడ్ పుస్తకాలను ముందేసుకుని కూర్చున్నారు.’’

Pages