జనాంతికం - బుద్దా మురళి

అదిగో.. నవలోకం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మిమ్ములను డిస్ట్రబ్ చేసినందుకు క్షమించాలి.. కుటుంబరావు గారేనా?’’
‘‘అవును’’
‘‘నమస్కారం. నేను కుక్కుటేశ్వరరావును.. మున్సిపల్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాను. మున్సిపల్ పర్మిషన్ పూర్తయింది. సమయం ఇస్తే మేమే ఇంటికి వచ్చి ఇస్తాం.’’
‘‘ 50 వేలు కావాలన్నారు కదా? ఆ ఏర్పాట్లలోనే ఉన్నా.. చెయ్యి కాస్త టైట్‌గా ఉంది.’’
‘‘అయ్యో.. కుటుంబరావు గారూ.. మీరింకా ఏ లోకంలో ఉన్నారు. సార్! ఇప్పుడు అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేవు. మీరు లంచం ఇచ్చినా తీసుకోని నేనేం చేసుకోవాలి. ఇప్పుడన్నీ ఆన్‌లైన్ లోనే. ఆన్‌లైన్‌లో లంచం ఆప్షన్ లేనే లేదు. అవన్నీ మరిచిపోండి. ఆఫీసుకు వస్తే, కప్పు కాఫీ తాగి నాలుగు కబుర్లు చెప్పుకుందాం. ఓపిక లేదంటే ఇంట్లోనే ఉండండి.. నేనే వచ్చేస్తున్నా..’’
‘‘ఏమోయ్.. కాస్త చెయ్యి గిల్లు. ఈరోజు అన్నీ విచిత్రాలే జరుగుతున్నాయి. పొద్దునే్న పాస్‌పోర్టు వెరిఫికేషన్ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లానా? కత్తిలాంటి అమ్మాయిలు ఇద్దరు రిసెప్షన్‌లో ఉన్నారు. సినిమా షూటింగ్‌లో హీరోయిన్లు అనుకున్నాను. కాదట.. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వారిని మర్యాదగా పలకరించేందుకు ప్రత్యేకంగా నియమించుకున్నారట! ఏయిర్ హోస్టస్‌ల మాదిరిగా.! ఇప్పుడేమో మున్సిపల్ ఆఫీసు నుంచి ఫోన్.. కలా? నిజమా? నమ్మలేకపోతున్నా..’’
‘‘పెళ్లిచూపుల్లో మీ దొంగ చూపులు చూసినప్పుడే అర్థమైంది మీరేంటో? పుట్టుకతో వచ్చిన బుద్ధి ఎక్కడికెళుతుంది? ఎటిఎంకు వెళ్లి తగలడండి.’’
‘‘ఎప్పుడో చిన్నప్పుడు చూశా ఇంత పెద్ద ‘క్యూ’లను. మళ్లీ ఇప్పుడు..’’
‘‘బాయ్ సాబ్.. ‘క్యూ’లో మీ వెనక ఉన్నాను. నీళ్లు తాగి వస్తాను. అప్పటి వరకు నా చెప్పులు ‘క్యూ’లో ఉంటాయి. కాస్త చూడండి’’
‘‘అంబానీ గారూ.. మీరా..? నమ్మకలేపోతున్నాను. మీరేంటి సార్ ఈ క్యూలో’’
‘‘బ్రదర్.. మీరు వాస్తవ లోకంలోకి వచ్చినట్టు లేదు. ప్రధానమంత్రి పుణ్యమాని కుటుంబరావు, అంబానీ అంతా ఒకటే.. అంతా ఒకే లైను. నా వెనుక కొద్ది దూరంలో అనిల్ అంబానీ, అదానీ, జిందాల్, అగర్వాల్ .. అంతా నిలబడ్డారు.’’
‘‘సార్! నా చెయ్యి గిల్లండి సార్! నమ్మలేకపోతున్నాను’’
‘‘ఏంటయ్యా కుటుంబరావ్.. ఎన్నిసార్లు చెయ్యి గిల్లిచ్చుకుంటావు. ఇది నిజం .. నువ్వు చూస్తున్నది నిఝంగా నిజం.. నల్లధనంపై మోదీ ఎక్కు పెట్టిన బాణంతో లోకమే మారిపోయింది. ఇప్పుడు అంతా ఒకటే.. అంబానీ అయినా, లోకేశ్ అయినా, మోడీ అమ్మ అయినా, సోనియా కొ డుకు అయినా ఎటిఎం వద్ద క్యూలో నిలబడాలి.’’
‘‘ సార్.. ఒక్క సెల్ఫీ ప్లీజ్’’
‘‘కుటుంబరావు.. నువ్వు ఇంకా ఈ లోకంలోకి రాలేదయ్యా! సెల్ఫీ ఎంటీ సిల్లీగా? ఇప్పుడు అందరం ఒక్కటే.. పక్క బ్యాంక్‌లో లైన్ తక్కువగా ఉందని అమితాబ్, ఐశ్వర్యారాయ్ కూడా క్యూలో ఉన్నారు. మాల్యా ఒక్కడు ముందే తప్పించుకుని దేశం దాటి పోయాడు. లేకపోతే అతను కూడా మన లైన్‌లోనే ఉండేవాడు. ఎటిఎంలో డబ్బులు ‘డ్రా’ చేసుకోగానే ఇరానీ హోటల్‌లో వన్‌బై టూ టీ తాగి, ఉస్మానియా బిస్కట్లు తిని మాట్లాడుకొని వెళదాం కావాలంటే ’’
‘‘ఏమో సార్.. కళ్లముందు కనిపిస్తున్నా నమ్మలేక పోతున్నాను’’
‘‘చెప్పాను కదా.. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు దేశంలో పేదలు, సంపన్నులు, మధ్యతరగతి అనే తేడా ఏమీ లేదు అంతా ఒకటే’’
‘‘ఒకటే ఎలా అవుతాం సార్? మీరు తీసుకున్న వేల కోట్ల రుణాలు రద్దు చేసేశారు. ఇంటి రుణం మాత్రం నన్ను కట్టమంటున్నారు’’
‘‘ఇదిగో.. దేశం ఇంత ముందుకు పోతుంటే నువ్వు మరీ ఇంత సంకుచితంగా ఆలోచించడం ఏమీ బాగాలేదోయ్ కుటుంబం. మేం అన్ని వేల కోట్లు రూపాయలు రుణం చెల్లించలేం కాబట్టి మా లెక్కలు అటక మీద పడేశారు. నువ్వు నెల నెలా ‘ఇఎంఐ’ కట్టగలవు కాబట్టి నిన్ను అడుగుతున్నారు. ఇంత ‘జెలసీ’ మంచిది కాదు. దేశం అంటే కొంత భక్తి కూడా ఉండాలి. ’’
‘‘సారీ ఏదో పేపర్లో కనిపిస్తే అడిగాను అయినా అంతా ఒకే క్యూలో ఉన్నప్పుడు అంతరాలెందుకు? దేశం కోసం మనం ఈ మాత్రం ఓర్చుకోలేమా? ’’
‘‘అలా అన్నావు బాగుంది. నీలో గొప్ప దేశభక్తుడు కనిపిస్తున్నాడు. కుటుంబం నువ్వు ఎటు వైపు వెళ్లాలి? ’’
‘‘ఎజి ఆఫీసుకు వెళ్లాలి. 9జి నంబర్ బస్సులో వెళతాను. మీరు..? ’’
‘‘అరె.. ఇంకేం అందరం షేరింగ్ ఆటోలో వెళదాం. నేను, నువ్వు అదానీతో పాటు మొత్తం పది మందిమి కాస్త సర్దుకొని కూర్చున్నామంటే బస్సు చార్జీ కన్నా సగం ఖర్చుతో వెళతాం.’’
‘‘సార్.. మీరు దేవుడు సార్ ! మీ నాన్న గల్ఫ్‌లో పెట్రోల్ బంకులో పని చేసేప్పుడు నాణాలను చెలామణి చేయడం కన్నా కరిగించడం వల్ల ఎక్కువ లాభం అని గుర్తించి అక్కడి నుంచి ఎదిగాడని కథలు కథలుగా చదివి ఆశ్చర్యపోయా? ఇప్పుడు మిమ్ములను చూస్తున్నాను. నా జీవితం ధన్యమైంది. కలలో కూడా ఊహించని నవలోకంలో నేను ఉన్నా..’’
***
‘‘ఏమోయ్.. నేను ఎటిఎం దగ్గర ఉండాలి కదా? ఇంట్లో ఉన్నానేంటి? ఇదిగో నవలోకం.. వెలసే మన కోసం... ఈ పాట టీవిలో వస్తోందా?
‘‘బ్యాంక్‌కు వెళ్లి రమ్మంటే కునుకు తీసి వెళతానన్నారు’’
‘‘ఇది కలే కావచ్చు.. కానీ కాబోయే నిజం. నవ లోకం వస్తుందని నాకు కలొచ్చింది’’
‘‘నవలోకం సరే.. ఆ ‘క్యూ’లు ఏంటి? ’’
‘‘ఇంకెన్ని రోజులు డిసెంబర్ 30 .. 50 రోజులు ఓపిక లేదా? ఆ తరువాత అంతా సర్దుకుంటుంది’’
‘‘ఆగిపోయిన పెళ్లిళ్లు’’
‘‘డిసెంబర్ 31 తరువాత అవుతాయిలే.. ఏం కొంప మునిగింది?’’
‘‘మరి క్యూలో ఆగిపోయిన గుండెలు..’’
‘‘డిసెంబర్ 30 తర్వత పని చేస్తాయిలే తొందరెందుకు? ’’
‘‘పోయిన ప్రాణాలు తిరిగి వచ్చి.. అనాథలుగా మారిన ఆ కుటుంబాలకు అండగా నిలిస్తే అంతకన్నా ఇంకేం కోరుకుంటాం’’
‘‘ఏదో ‘్ఫ్ల’లో అనేశాను.. కానీ చనిపోయిన వారు మళ్లీ ఎలా బతుకుతారు పంకజం..?’’
‘‘ఏమో.. గుర్రం ఎగరావచ్చు, నవలోకం రావచ్చు. పైకి పోయిన వారు తిరిగి రావచ్చు. పురాణాల్లో ఇలాంటివి మనం ఎన్ని చూడలేదు?’’
‘‘లేదు పంకజం.. ఏమీ జరగదు. డిసెంబర్ 30 తర్వాత జనవరి ఒకటి వస్తుంది.. అద్భుతాలేమీ జరగవు..’’
*