S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/30/2018 - 02:08

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అత్యంత ప్రమాద పరిస్థితిలో ఉంది కాబట్టి మనం కలసికట్టుగా జాతిని దేశాన్ని రక్షించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెదేపా అధినేత చంద్రబాబు ఆమధ్య యుగళగీతం ఆలపించారు. బద్ధ శత్రువులైన కాంగ్రెస్, తెదేపాలు ఇలా ‘దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలం’టూ ఘనమైన ప్రకటనలు చేయడం రాజకీయాల్లో లబ్ది కోసం కాదా? భిన్న ధ్రృవాలైన ఈ నేతల మాటలను జనం విశ్వసిస్తారా?

12/28/2018 - 22:22

‘కొత్త ఆలోచనలను చేయకపోవటం కంటే పాత ఆలోచనల నుండి బయటపడకపోవటమే నష్టదాయకం’ అని ప్రఖ్యాత ఆర్థిక శాస్తవ్రేత్త జాన్ మీనార్డ్ కీన్స్ అంటాడు. ఆర్థిక విధానాల వల్ల సుదీర్ఘకాలంలో ఒనగూరే ప్రయోజనాల కంటే స్వల్పకాలంలో జరిగే లాభనష్టాలను జాగ్రత్తగా అంచనా వేసి, సమీప భవిష్యత్‌కు అనుగుణమైన విధానాలకే ప్రాధాన్యతను ఇవ్వాలన్నది కీన్స్ అభిప్రాయం.

12/28/2018 - 00:56

తరగతి గదిలో ఉపాధ్యాయుడు కొన్ని ప్రశ్నలడుగుతాడు. ఉపాధ్యాయుడు పిల్లల్లో అహంభావం తక్కువ చేయాలన్న ఉద్దేశంతో వారి గ్రాహ్యశక్తికి మించిన ప్రశ్నలను అడుగుతాడు. అలాంటి సమయంలో పిల్లలు పడుతున్న ఆలోచనల నొప్పులను చూస్తే ఒక టీచర్‌గా ఆనందమేస్తుంది. ఇలాంటి సంఘటనలు కేవలం క్లాస్‌రూమ్‌లోనే కాదు, స్కూల్‌లో, ప్లేగ్రౌండ్‌లో కూడా తటస్థపడుతూ ఉంటాయి. అవి పుస్తకంలో ప్రశ్నలైతే విద్యార్థి ఠకీమని సమాధానం చెప్పేస్తాడు.

12/27/2018 - 01:22

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం కొత్తపుంతలు తొక్కుతూ సందర్శకులకు ఆహ్లాదం కలిగిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ‘విజన్’కు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగం విస్తరిస్తోంది. సహజ సిద్ధంగా ఉన్న అన్ని అవకాశాలను పర్యాటక శాఖ సద్వినియోగం చేసుకుంటోంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు వివిధ ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వం అమలు చేస్తోంది.

12/26/2018 - 01:13

దేశ ఆర్థిక వృద్ధి రేటు 9-10 శాతం సాధించాలని, 2022-23 సంవత్సరం నాటికి రూ.28 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ‘నీతి ఆయోగ్’ ఇటీవల వ్యూహపత్రాన్ని ప్రకటించింది. దేశం ఇప్పుడొక సంధియుగంలో ఉందని, గతంలో కోల్పోయిన అవకాశాల్ని సరిదిద్దుకునే సమయమిదని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అభిప్రాయపడ్డారు.

12/25/2018 - 01:47

ప్రపంచంలోకెల్లా జనాభాపరంగా రెండవ స్థానంలో వున్న మన భారతదేశంలో యువత పరంగా ప్రథమస్థానంలో వుంది. భారతదేశానికి అతి పెద్ద వరం ఆ దేశంలో వున్న యువతేనని ఇటీవలి కాలంలో అమెరికా, చైనా, రష్యా అధ్యక్షులు ప్రకటించడం చూస్తుంటే మనకు ఎంత మంచి సంపద లభించిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలోవున్న యువత వంటి మానవ వనరులతో మేము అద్భుతాలను సాధించగలమని ఫ్రాన్స్ అధ్యక్షులు స్వయంగా సెలవిచ్చారు.

12/22/2018 - 22:21

ఛ త్తీస్‌గఢ్ అనగానే మావోయిస్టులు గుర్తుకొస్తారు. ఆ రాష్ట్రంలోని అబూజ్‌మాడీ అటవీ ప్రాంతాన్ని ‘‘విముక్తి ప్రాంతం’’గా చేసుకుని సమాంతరంగా జనతన సర్కారు నడుపుతున్నారని వినికిడి. సామ్రాజ్యవాదుల పెట్టుబడిదారుల, దళారి- బూర్జువా వర్గాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతోందని ఆదివాసీల చేత మావోయిస్టులు అసహజ రీతిలో చెప్పిస్తున్నారు.

12/21/2018 - 23:08

అజనాభము, ఆర్యావర్తనము, ధర్మభూమి, కర్మభూమి అనబడే విశిష్ఠ పదాలతో పిలువబడే భరతవర్షము, భరత ఖండము, భారతదేశము అనబడే మన దేశము తొలి మనువుచే పరిపాలించబడిన భూభాగమే పుణ్యభూమి హిందుస్థానము. ఈ హిందుస్థానములోనే మానవ సృష్టి ప్రారంభమైనదని వేద శాస్త్ర పురాణ ప్రమాణములచే పరిశోధనాత్మకమైన కృషి సల్పిన మేధావులు నిరూపించినారు.

12/21/2018 - 01:11

చిన్నపిల్లల సంచుల్లో పుస్తకాలను నింపడం కన్నా వారి మనసుల్లో జీవిత ఆశయాలు నింపాలి. ‘నేను నిరర్థకుణ్ణి.. నేను బలహీనుణ్ణి.. నేను పెద్దవాళ్లు ఆడుకునే కీలుబొమ్మను..’ అనే ఆలోచనలు వారి మెదళ్లలోకి రాకూడదు. ‘నాకు ఒక అస్తిత్వం ఉంది.. నాకొక వ్యక్తిత్వం ఉంది.. నాకూ లక్ష్యాలున్నాయి..’ అనే ఆలోచనలు వారిలో బలంగా ఉంటాయి. పిల్లల్లో వ్యక్తిత్వాన్ని పెంచాలి.

12/19/2018 - 03:55

‘‘నా మాతృభూమిని ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేయాలనుకున్నా... నా త్యాగం మరెందరికో స్ఫూర్తినిస్తుంది. హిందూస్థాన్ స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంది. భారత్‌లోని ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబాన్ని ఎక్కబోతున్న మొట్ట మొదటి అదృష్టవంతుడిగా గర్వపడుతున్నా..’’ -అంటూ అష్ఫాఖుల్లా ఖాన్ ఉరితాడును ముద్డాడి మెడలో తానే వేసుకున్నాడు.

Pages