S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/08/2019 - 22:28

స్కూల్ ప్రిన్సిపాల్ ప్రతిక్షణం సహచర అధ్యాపకులకు నీడగా ఉండాలి. ‘బీ విత్ ద స్ట్ఫా’ అంటే వారికి ప్రతి క్షణం అండగా ఉండాలని అర్థం. ప్రభుత్వం వైపునుంచి ఉపాధ్యాయులకు ప్రతి ఘడియలో వృత్తిపరమైన సలహాలివ్వటానికి ఏర్పడిన అధికారి ప్రిన్సిపాల్. తరగతి గదిలోనైనా ప్రిపరేషన్‌లోనైనా ఎన్నో వృత్తిపరమైన సమస్యలు రావొచ్చును. ప్రిన్సిపాల్ అయినవారు సహచర అధ్యాపకులకు ఆచరణ యోగ్యమైన సలహాలు ఇస్తూ ఉండాలి.

02/06/2019 - 00:33

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 16 స్థానా లు గెలుస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు విసిరిన సవాల్‌ను తాను ఛాలెంజ్‌గా తీసుకుంటున్నట్టు ప్రజా గాయకుడు గద్దర్ ఈమధ్య ఓ సన్మాన సభలో ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల వేడి ఇంకా రాజుకోలేదు, కేసీఆర్ అలాంటి సవాల్ విసరనూ లేదు. 16 స్థానాలు గెలుస్తామని సందర్భోచితంగా చెప్పిన దాన్ని ‘విసిరిన సవాల్’గా భావిస్తే ఏమిటి అర్థం?

02/04/2019 - 23:55

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన తాత్కాలిక బడ్జెట్‌లో రైతులకు 6 వేల రూపాయలను మూడు విడతలుగా చెల్లించాలన్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ సహాయం రైతులకు ఎంతోకొంత ఊరట కలిగించనున్నది. ఈమధ్య కాలంలో కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు పోటీపడి రైతులకు రాయితీలు, ఆర్థిక సహకారాలు అందించటంలో ముందుకు దూసుకెళుతున్నాయి.

02/02/2019 - 23:50

నిస్వార్థంగా సమాజసేవ చేసిన చాలామంది సామాన్యులు, అతి సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘పద్మ’ అవార్డులను ప్రకటించింది. బయ టి ప్రపంచానికి తెలియకుండా, ప్రచారానికి దూరంగా ‘అజ్ఞాతం’గా పనిచేస్తూన్న అసాధారణ సామాన్యుల సేవానిరతిని గుర్తించి, గౌరవించడం గొప్ప విషయం. ఒక కొత్త ఒరవడి పద్మ అవార్డుల విషయంలో ఈమధ్య ప్రారంభమైంది.

02/01/2019 - 21:52

మన దేశంలో అతి ప్రధానమైన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. ఇటీవల జరిగిన నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం 2017-18లో దేశంలో 6.1 శాతంగా నిరుద్యోగం వున్నదని, గత 45 ఏళ్ళలో ఇది ఈ స్థాయికి చేరడం మొదటిసారి అని తేటతెల్లమైంది. 2011-12లో 2.2 శాతం ఉన్న నిరుద్యోగిత 2017-18నాటికి 6.1 శాతానికి చేరుకున్నదంటే కారణం పాలక పక్షాల నిర్లక్ష్యమే అనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.

02/01/2019 - 04:13

ప్రపంచమంతా నేడు ఫిన్లాండ్ దేశం వైపు చూస్తోంది. అక్కడి ప్రగతి రహస్యం ఆ దేశ ప్రజలల్లోనే ఉంది. పిల్లలు, ఉపాధ్యాయుల్లోనే ఆ రహస్యం దాగి ఉన్నది. ఉపాధ్యాయ వృత్తికిచ్చిన గౌరవం, సామాజిక స్థాయి, ఉపాధ్యాయులకు ఆ వృత్తిపైన అంకిత భావం, ఉపాధ్యాయుణ్ణి ఎంపిక చేసే పద్ధతి ఇవే ఫిన్లాండ్ ప్రగతికి కారణాలు. దీనికితోడు ఆ దేశంలో ఉండే సంప్రదాయాలు, ఆచారాలు కూడా తోడ్పడినాయి.

01/31/2019 - 00:24

దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ చాలామంది నేతలు ఈవీఎంల ట్యాంపరింగ్ పై పదే పదే మాట్లాడుతున్నారు. ఈ విషయమై ప్రస్తుతం పెద్ద దుమారమే చెలరేగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా చాలామంది రాజకీయ నాయకులు ఈవీఎంలను విశ్వసించడం లేదు. వాటి నిర్వహణ, వినియోగంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

01/30/2019 - 02:01

సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె రాజకీయ ప్రవేశానికి ప్రసార మాధ్యమాలు అవసరం లేనంతగా ప్రచారాన్ని కల్పిస్తున్నాయి. కొందరైతే ప్రియాంకను మరో ఇందిరా గాంధీ అని అభివర్ణిస్తున్నారు. నిజంగా అటువంటి పరిస్థితి ఉన్నదా? ఆమె రాక.. పడిపోతున్న కాంగ్రెస్ ‘గ్రాఫ్’ను నిలబెట్టగలదా?

01/29/2019 - 01:46

దేశవ్యాప్తంగా ‘మహాగటబంధన్’పై చర్చ జోరుగా జరుగుతున్నది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షనేతలంతా ఏకమవుతామని అంటున్నారు. కర్నాటకలో దొడ్డిదారిన సంకీర్ణ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజున చాలామంది విపక్ష నేతలు కలసి పోజులిచ్చారు. ఆ తరువాత ఎవరి దారి వారిదే. తాజాగా ఈ కూటమిలో ఎవరికివారు ప్రధాని కావాలనుకుంటున్నారు. మాయావతి, అఖిలేశ్ జట్టు కట్టారు. మాయావతికి ప్రధాని కావాలనుంది.

01/27/2019 - 01:50

కేంద్రంలో బీజేపీ నాలుగేళ్ల ఎనిమిది నెలల అస మర్థ పాలనతో దేశం అన్ని రంగాలలో దివాలా తీసింది. అప్పుల పాలైంది. తాజా గణాంకాల ప్రకారం మోదీ పాలన కాలంలో అప్పులు 50 శాతం పెరిగిపోయాయి.

Pages