S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

09/13/2019 - 22:13

మన సౌర కుటుంబానికి వెలుపల ఉన్న ఒక ‘గ్రహం’లో నీటి నిక్షేపాలు నెలకొని ఉన్నట్టు ఐరోపా అమెరికా అంతరిక్ష పరిశోధక శాస్తవ్రేత్తలు గురువారం ధ్రువీకరించడం సరికొత్త ఆవిష్కరణ. మన భూమిని పోలిన ఈ ‘మహాభూమి’- సూపర్ ఎర్త్- మన భూగోళానికి నూట పదకొండు కాంతి సంవత్సరాల దూరంలో నెలకొని ఉందట!

09/13/2019 - 03:50

గోవంశ పరిరక్షణకు సమగ్రమైన బిల్లును రూపొందించి, పార్లమెంటుకు సమర్పించి చట్టం చేసినట్టయితే ప్రజలు సంతోషిస్తారు, ప్రకృతి సంతోషిస్తుంది, వ్యవసాయ భూమి పరిపుష్టం అవుతుంది. ఆవులను దూడలను కోడెలను పెయ్యలను ఎద్దులను పెంచడం వల్ల వ్యవసాయానికి కావలసిన సహజమైన ఎఱువులు లభిస్తాయి. ఫలితంగా వ్యవసాయ భూమి నిరంతరం పరిపుష్టం అవుతుంది. వ్యవసాయం విష రసాయనాల ఎఱువుల నుంచి, కాలుష్యం నుంచి విముక్తం అవుతుంది.

09/12/2019 - 04:28

నేపాల్‌లో ఇంధన తైలం ధరలు లీటరుకు రెండు రూపాయలు చొప్పున తగ్గిపోవడం మంగళవారం నాటి పరిణామం. భారత నేపాల్ దేశాల మధ్య ఇంధనం సరఫరా చేసే ‘గొట్టపు మార్గం’- పైప్‌లైన్- పనిచేయడం ఆరంభం కావడం ఇందుకు కారణం. మన బిహార్‌లోని మోతీహారీ నుంచి నేపాల్‌లోని నారాయణీ ప్రాంతంలోని ‘అమ్‌లేఖ్ గంజ్’వరకు ఏర్పడిన ఈ గొట్టపు మార్గం ఉభయ దేశాల మధ్య సరికొత్త స్నేహ వారధి.

09/11/2019 - 01:42

జమ్మూ కశ్మీర్‌లో విధించిన ‘నియంత్రణల’ను సడలించాలని ఐక్యరాజ్యసమితి ‘మానవ అధికార మండలి’- హ్యూమన్ రైట్స్ కౌన్సిల్- వారు పిలుపునివ్వడం విచిత్రమైన వ్యవహారం. మన దేశంలోని ఒక ప్రాంతంలో జరుగుతున్న రాజ్యాంగ బద్ధమైన సార్వభౌమ అధికార అనుగుణమైన ప్రజాహితకరమైన కార్యక్రమాలకు ఐక్యరాజ్యసమితి ‘మండలి’ వారు ‘బాధతో’ స్పందించడం హద్దులను అతిక్రమించిన అభినయం.

09/10/2019 - 02:09

తెలుగు భాషా ప్రాంతీయ అధ్యయన కేంద్రం కర్నాటకలోని మైసూరు నుంచి తెలుగు నేలకు తరలిరావడం హర్షణీయ పరిణామం. మహాకవి తిక్కన క్రీస్తుశకం పదమూడవ శతాబ్దిలో వేదవ్యాసుని సంస్కృత మహాభారతంలోని పదహైదు పర్వాలను తెలుగులో వ్రాశాడు. ‘విక్రమ సింహపురి’గా వినుతికెక్కిన నెల్లూరు మహాకవి తిక్కన సోమయాజి జీవించిన ప్రాంతం.

09/06/2019 - 21:47

మన ఫ్రభుత్వం 2015లో ఆరంభించిన ‘ప్రాచ్యదిశా కార్యాచరణ’- యాక్ట్ ఈస్ట్- ‘దూర ప్రాచ్య దిశా కార్యాచరణ’- యాక్ట్ఫ్‌ర్ ఈస్ట్-గా పరిణతి చెందడం ప్రధాని నరేంద్ర మోదీ బుధ, గురువారాలలో జరిపిన రష్యా పర్యటనలో ప్రస్ఫుటించిన ప్రధాన ఇతివృత్తం.

09/06/2019 - 00:18

అంగడి తిండిని అదే పనిగా తినడంవల్ల చిత్ర విచిత్ర వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందన్నది ధ్రువపడిన వాస్తవం. చాక్లెట్లు, పిజ్జాలు, ఐస్‌క్రీమ్‌లు, చిప్పులు, సుగర్ కాండీలు, హోమ్ బర్గర్‌లు, పింజల్‌లు, సాస్‌లు, విష రసాయన పరిమళాల- ఆర్ట్ఫిసియల్ ఫ్లేవర్‌లు- శీతల పానీయాలు, వంటలు మెరిసిపోయేందుకు వాడుతున్న రంగులు వంటివి ‘అంగడి తిండి’-జంక్‌ఫుడ్-లో కొన్ని మాత్రమే!

09/05/2019 - 02:06

మన ఆర్థిక వ్యవస్థ ‘వాటాల విపణి’- స్టాక్ మార్కెట్- జాలంలో ఇరుక్కొని ఉండడం తరతరాల వైపరీత్యం. ఈ వైపరీత్యం మన దేశానికి దాపురించిన విదేశీయ వాణిజ్య వారసత్వం, బ్రిటన్ దురాక్రమణ వారసత్వం! ఐరోపావారి వాణిజ్య విస్తరణ, చైనా వస్తువుల దురాక్రమణ మన ప్రగతిని నిలదీస్తున్న వికృత పరిణామాలు... మన ‘స్థూల జాతీయ ఉత్పత్తుల’- గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- పెరుగుదల వేగం మందగించి పోవడానికి ఇదంతా నేపథ్యం.

09/04/2019 - 02:01

పగలంతా పంచెలు నేశాను, దీపం తేరా దిగనేస్తాను... అన్నది సామెత! కానీ ఈ సామెతను కేంద్ర ప్రభుత్వం నిజం చేసినట్టుంది. బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి చొఱబడిన విదేశీయుల సంఖ్య రెండు కోట్లని మూడు కోట్లని దశాబ్దుల తరబడి ప్రచారం జరిగింది. వీరిలో కనీసం కోటి మంది అస్సాంలోనే తిష్ఠవేసి ఉన్నారని కూడ ప్రచారమైంది.

08/30/2019 - 21:33

పాకిస్తాన్‌లో నివసిస్తున్న సిక్కులపై జిహాదీల అత్యాచారాలు తీవ్రతరం అవుతుండడం నానక్ గురుదేవుని ‘సార్థ పంచ శతజయన్తి’- ఐదువందల యాబయ్యవ పుట్టినరోజు- ఉత్సవాలకు నేపథ్య వైపరీత్యం. నానక్ గురుదేవుడు జన్మించిన ‘నంకానా సాహిబ్’ ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది!

Pages