S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

08/16/2019 - 22:01

మన రక్షణ పటిమ క్రమంగా ‘చేవ’తేలుతోందన్నది నిరాకరింపజాలని నిజం. కానీ ఈ కరకుతనంలో కొంత మెతకతనం కూడ నిహితమై ఉండడం కూడ నిరాకరింపజాలని నిజం! ఈ మెతకతనం మన విదేశాంగ విధానం! ‘ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి’ వారు మన జమ్మూ కశ్మీర్ గురించి ‘జనాంతిక’- క్లోజ్‌డ్ డోర్- మంతనాలను సాగించాలని గురువారం నిర్ణయించడానికి ఈ మన విదేశాంగ విధానపు మెతకతనం కూడ కొంత కారణం.

08/16/2019 - 02:01

మహాత్మా గాంధీ సార్థ శత జయన్తి- నూట యాబయ్యవ జయన్తి- సం వత్సర ఉత్సవాలు జరుగుతుండడం డెబ్బయి మూడవ భారత స్వాతంత్య్ర దినోత్సవానికి చారిత్రక నేపథ్యం. మహాత్మా గాంధీ స్వచ్ఛతకు ప్రతిరూపంగా భాసించడం చరిత్ర. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలలో మహాత్మా గాంధీ ప్రబోధించిన స్వచ్ఛతను ప్రస్తావించడం ఈ చరిత్రకు అనుగుణం.

08/15/2019 - 05:53

మధుర మధుర మాతృ మమత
మది మదిలో పండాలి..
సుధానిహిత భ్రాతృప్రేమ
ఎద ఎద ఉప్పొంగాలి..
చందమామ సొగసు వంటి
స్నేహం విరబూయాలి..
అందరమూ కలసి మెలసి
అభ్యుదయము పంచాలి!

08/14/2019 - 05:08

గుడ్లగూబలు వికృతంగా విలపిస్తున్నాయి. సమీకృత వైవిధ్య భావ కిరణ సమగ్ర సూర్యుడు మళ్లీ ఉదయిస్తున్నాడు. సూర్య దర్శనాన్ని సహించలేని ఈ ‘‘ఉలూక రాజులు’’ స్వయం విదారక రోదనలను ఆవిష్కరిస్తుండడం నడుస్తున్న చరిత్ర. ఈ ‘ఉలూక’ సమూహాలు ప్రస్తుతం పళనియప్పన్ చిదంబరం వంటి వారి రూపాలను ధరించి ఉండడం కాల వైపరీత్యం.

08/13/2019 - 04:03

నిజమే..! ‘అంతటివారు’ వారు.. వారంతటివారు వారే! వారు తప్ప కాంగ్రెస్ మహాసంస్థను నడిపించడానికి మరో దిక్కులేదు! ఈ సంగతి ఇప్పుడిలా మరోసారి ధ్రువపడింది. సోనియా గాంధీ మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం ఈ ధ్రువీకరణ. నూట ముప్పయి మూడేళ్ల కాంగ్రెస్ మహా రాజకీయ సంస్థలో అధ్యక్ష పదవిని నిర్వహించగలవారు ఆమె, ఆమె కుటుంబ సభ్యులు మాత్రమేనన్నది ఈ ధ్రువీకరణ!!

08/09/2019 - 22:47

తల్లి పొత్తిళ్లలో నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసికందును ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడి, ఆపై క్రూరంగా హతమార్చిన కామోన్మాది ప్రవీణ్‌కు వరంగల్ జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని అన్ని వర్గాల వారూ ముక్తకంఠంతో హర్షిస్తున్నారు.

08/08/2019 - 22:41

మన దేశానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష బీభత్సకాండను కొనసాగించడానికి అవకాశాలు తగ్గిపోయాయి కాబట్టి ప్రచ్ఛన్న బీభత్సకాండను ఉద్ధృ తం చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం పూనుకొంది. తమ దేశంలోని మన రాయబారి- హైకమిషనర్- అజయ్ విసారియాను బహిష్కరించడం ఈ ప్రచ్ఛన్న బీభత్సకాండలో ఒక అంశం మాత్రమే! మన దేశంతో వాణిజ్య సంబంధాలను రద్దుచేసుకుంటున్నట్టు పాక్ ప్రభుత్వం బుధవారం ప్రకటించడం కూడ దౌత్య దౌర్జన్యంలో భాగం.

08/07/2019 - 23:08

దాదాపు ఇరవై రెండేళ్ల క్రితం, భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రతినిధి మండలి సమావేశాలు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగాయి. 1998లో లోక్‌సభ ఎన్నికలకు పూర్వరంగం అది. ‘్భజపా’ ప్రధానమంత్రి అభ్యర్థి అటల్ బిహారీ వాజపేయి పాల్గొన్న మాధ్యమ ప్రతినిధుల సమావేశంలో ఎక్కువ ప్రశ్నలకు అప్పటి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సుషమా స్వరాజ్ సమాధానాలను చెప్పింది.

08/07/2019 - 02:14

రాజ్యాంగంలోని మూడువందల డెబ్బయ్యవ అధికరణం రద్దయిపోవడం జమ్మూ కశ్మీర్ సమగ్రతా సాధనకు శ్రీకారం మాత్రమే. భౌగోళిక సర్వసమగ్రతా సాకారం ఇంకా సిద్ధించవలసి ఉంది. అఖండ భారత్ ముక్కలు చెక్కలు కావడం, భారత్‌లో అవిభాజ్యమైన జమ్మూ కశ్మీర్ ముక్కలు చెక్కలు కావడం సమాంతర పరిణామాలు. ఈ ఉభయ విపరిణామాలకు ప్రధాన కారకుడు 1946 నుంచి 1964 వరకు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ ‘అధి నాయకుడు’ జవహర్‌లాల్ నెహ్రూ.

08/06/2019 - 01:50

విజయం ఇది, కశ్మీరీ
జాగృత జన మనోరథం,
విజయం ఇది, మాతృదేశ
భక్తికి మంగళ శిఖరం,
విజయం ఇది, మహోదధీ
మథన జనిత మధుకలశం,
భరత మాతృ నయనాంచల
స్ఫురిత హర్షవర్ష జలం....

Pages