సంపాదకీయం

సింధియా ‘చర్య’..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యోతిరాదిత్య సింధియా గత సంవత్సరం ఆగస్టులో కాంగ్రెస్ ‘అధికార విధానం’తో విభేదించడం ఇప్పుడు చాలామంది రాజకీయ ఉత్కంఠగ్రస్తులకు బహుశా గుర్తులేదు. గుర్తున్నవారికి జ్యోతిరాదిత్య ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నిష్క్రమించడం, భారతీయ జనతాపార్టీలో ప్రవేశించడం ఆశ్చర్యం కలిగించడం లేదు! జమ్మూకశ్మీర్‌కు లభిస్తుండిన రాజ్యంగ ప్రత్యేక ప్రతిపత్తి రద్దయిపోవడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న ఘటన! ఈ ప్రత్యేక ప్రతిపత్తి కారణంగా ఏడు దశాబ్దులకు పైగా జమ్మూకశ్మీర్ ప్రజలకు మాత్రమేకాక మొత్తం దేశ ప్రజలకు జరిగిన కష్టనష్టాలు జగత్ ప్రసిద్ధమైన కఠోర వాస్తవాలు... అందువల్ల ఈ దేశం పట్ల మమకారం కల వారందరూ జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కట్టబెట్టిన రాజ్యాంగపు మూడువందల డెబ్బయ్యవ అధికరణం రద్దయిపోవడంవల్ల ప్రహర్ష పరిప్లుతులయ్యారు. రాజకీయ పక్షాల విధాన విభేదాలకు అతీతంగా ఈ ‘రద్దు’ను ప్రశంసించిన మాతృదేశ మమకార స్వభావులలో జ్యోతిరాదిత్య సింధియా ప్రముఖుడు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ‘రద్దు’ను వ్యతిరేకిస్తూ గట్టిగా రోదిస్తుండిన సమయంలో జ్యోతిరాదిత్య వంటి అతికొద్దిమంది కాంగ్రెస్ నాయకులు మాత్రమే ‘రద్దు’కు అనుకూలంగా ప్రతిస్పందించారు! ‘పార్టీ’ సంకుచిత ప్రయోజనాలకంటె జాతి విస్తృతహితం ప్రధానమన్న ఆదర్శానికి జ్యోతిరాదిత్య సింధియా వంటివారు అరుదైన ప్రతీకలు! ‘‘జమ్మూకశ్మీర్ మొత్తం దేశంతో సర్వసమగ్ర తాదాత్మ్యం చెందడానికి’’ మూడువందల డెబ్బయ్యో అధికరణం రద్దు దోహదం చేయగలదన్నది జ్యోతిరాదిత్య ఆవిష్కరించిన చారిత్రక ప్రకటన... కాంగ్రెస్ పార్టీ అంతర్గత వైరుధ్యాలు ఈ ప్రకటనతో మరింత ప్రస్ఫుటించాయి. జ్యోతిరాదిత్య మంగళవారం కాంగ్రెస్ నుంచి నిష్క్రమించడం ఈ అంతర్గత వైరుధ్యాలకు పరాకాష్ఠ.
జమ్మూకశ్మీర్ వ్యవహారంలో జ్యోతిరాదిత్య ప్రదర్శించిన ఈ జాతీయభావ సైద్ధాంతిక నిష్ఠా ‘నికషం’పై మొత్తం ఆయన రాజకీయ జీవన ప్రస్థాన క్రమాన్ని ‘నిగ్గు’తేల్చాలని ప్రయత్నించడం సరికాదు. నిజానికి ‘నికషం’- గీటురాయి- సైతం మారిపోతూ ఉండడం రాజకీయ రంగం చరిత్ర! ‘‘రానురాను రాగి తేలిపోవడం’’అన్నది సామాజిక రంగంలో విలువలు సన్నగిల్లిపోతుండడానికి ప్రతీకగా మిగిలిన లోకోక్తి! కానీ రాజకీయాలలో ‘‘రాగి’’ కలిస్తే కాని రాణించడం కష్టం అన్నది వ్యవహార వాస్తవం! లోకమాన్య బాలగంగాధర తిలక్ కాలంనాటి రాజకీయ సంస్కారాలు వేఱు, సర్దార్ వల్లభ భాయిపటేల్ వంటివారు ప్రస్ఫుటింపచేసిన రాజకీయ నైతిక నియమాలు వేఱు... లాల్‌కృష్ణ అద్వానీ వంటివారు నిలబెట్టిన విలువలు వేఱు... నడచిపోతున్న రాజకీయంలో నిబద్ధతలు వేఱువేఱు... వ్యూహాలు ప్రతివ్యూహాలు ఎత్తులు పైఎత్తులు అన్ని రాజకీయ పక్షాలను ప్రభావితం చేస్తున్న సమకాలంలో పాత ‘గీటురాళ్ల’పై కొత్త విలువలను నిగ్గుతేల్చడం ‘‘ఎండమావిలోని నీరు’’... అందువల్ల ‘గీటురాళ్లు’ మారిపోయాయి. అచ్చపు బంగారం ఈ ‘గీటురాళ్ల’పై నిగ్గుతేలదు. ‘రాగి’ కలిసిన బంగారమే ఆభరణం- అన్నది తేలుతున్న కొత్త ‘నిగ్గు’!! అందువల్ల 2018నాటి శాసనసభ ఎన్నికల తరువాత ఈ ‘‘కాంగ్రెస్ నాయకుడైన’’ జ్యోతిరాదిత్య మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయి ఉండినట్టయితే గత ఏడాది ఆయన ‘‘జమ్మూకశ్మీర్’’ విషయంలో ఈ జాతీయతత్త్వ నిష్ఠను ప్రదర్శించి ఉండేవాడా?? ఇప్పుడు కాంగ్రెస్‌ను వదిలిపెట్టేవాడా?? అన్నవి సద్యస్ఫురణలు... వీటికి జవాబులు ఎప్పటికీ దొరకవు! అందువల్ల సింధియా నిష్క్రమణవల్ల కాంగ్రెస్‌కు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గొప్ప నష్టం జరిగిందన్నది మాత్రమే స్పష్టంగా నిగ్గుతేలిన వాస్తవం! ఆయన ‘్భజపా’ప్రవేశం ‘‘తప్పిపోయిన బిడ్డ స్వగృహానికి తిరిగి రావడం కావచ్చు...’’ ఎందుకంటె జ్యోతిరాదిత్య నాయనమ్మ విజయరాజ సింధియా ‘్భరతీయ జనసంఘం’లోను ఆ తరువాత ‘్భరతీయ జనతాపార్టీ’లోను గొప్ప నాయకురాలు! జ్యోతిరాదిత్య సింధియా మేనత్తలు వసుంధర రాజే, యశోధరా రాజేలు ‘్భజపా’లో ప్రముఖ నాయకురాండ్రు... వసుంధరమ్మ మూడుసార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడ! ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి! జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా ‘్భరతీయ జన సంఘం’నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చినవాడు! అందువల్ల జ్యోతిరాదిత్యకు హారతి ఇచ్చి ఆహ్వానించడానికై ఈ మేనత్తలిద్దరూ ‘్భజపా’ గుమ్మంముందు వేచి ఉండడం ఆశ్చర్యం కాదు...
కాంగ్రెస్ గెలిస్తే జ్యోతిరాదిత్య మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయిపోతాడన్నది కాంగ్రెస్‌వారు 2018నాటి శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ చేసిన ప్రచారం. కాంగ్రెస్ దాదాపు గెలిచింది! బహుజన్ సమాజ్, సమాజ్‌వాదీ పార్టీల సహాయంతో ‘శాసనసభ’లో ‘సంఖ్యాధిక్యం’- మెజారిటీ- కూడ సాధించింది. కానీ జ్యోతిరాదిత్యకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు, వృద్ధ నాయకుడు కమల్‌నాథ్ ఊహించని రీతిలో ముఖ్యమంత్రి అయ్యాడు. రాజస్థాన్‌లో సచిన్ పైలట్ వలె మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య ఉప ముఖ్యమంత్రి కూడ కాలేదు. 2019నాటి లోక్‌సభ ఎన్నికలలో ఆయన పరాజయం పాలుకావడం గోరుచుట్టుపై రోకటి పోటు... ఇప్పుడు ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కూడ దక్కనివ్వని ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌పై జ్యోతిరాదిత్య ఇలా ‘‘కసి తీర్చుకున్నాడ’’న్నది అవకాశవాద ప్రధాన వ్యాఖ్యాతలు చేస్తున్న ప్రచారం! కమల్‌నాథ్ మఖ్యమంత్రిత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఇలా ‘‘కసి తీరడం...’’ సైద్ధాంతిక విభేదాలు వైరుధ్యాలుగా పరిణమించినప్పుడు సొంత రాజకీయ పక్షాన్ని వదలిపెట్టడం తప్పు కాకపోవచ్చు, సైద్ధాంతిక సామ్యం విధాన సమానత్వం ఉన్న మరో పక్షంలో చేరిపోవడం ఒప్పుకావచ్చు! అందువల్ల సిద్ధాంత ప్రాతిపదికపై సింధియా ఇలా పార్టీని మారుతున్నట్టయితే ఆయన కొంతకాలం అధికార పదవులకు దూరంగా ఉండాలి, కేంద్ర మంత్రివర్గంలో చేరరాదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల తరువాత మాత్రమే ఆయన కేంద్ర మంత్రి పదవిని స్వీకరించాలి! మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ఎలాగూ ఆయనకు దక్కదు...
ఎందుకంటె మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ఈ మొత్తం తతంగానికి కేంద్ర బిందువు! 2018నాటి శాసనసభ ఎన్నికలలో నిజానికి ఏ పక్షానికి కూడ ‘సంఖ్యా బాహుళ్యం’-మెజారిటీ-లభించలేదు. ఇతర పార్టీల మద్దతుతో ‘కాంగ్రెస్’ సంఖ్యా బాహుళ్యాన్ని కూడగట్టగలిగింది! అందువల్ల ‘విజయం’ వెంట్రుక వాసిలో తప్పిపోయినప్పటినుంచీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చినప్పటినుంచి ‘్భజపా’నేత శివరాజసింగ్ చౌహాన్‌కు బహుశా నిద్ర పట్టడం లేదు, ‘్భజపా’వారికి మధ్యప్రదేశ్‌లో ఊపిరి ఆడడం లేదు! అందువల్ల కర్నాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యెడుయూరప్ప స్ఫూర్తి మధ్యప్రదేశ్ ‘్భజపా’ను ఆవహించింది. ‘్ఫరాయింపుల చట్టం’లోని నిబంధనలకు భంగం కాని రీతిలో ఫిరాయింపులను ప్రోత్సహించడం ఈ స్ఫూర్తి! అందువల్లనే ‘్భజపా’ ప్రభుత్వం ఏర్పాటునకు వీలుగా కాంగ్రెస్ శాసనసభ్యులు కొందరు కర్నాటకలో తమ పదవులకు రాజీనామా చేశారు! ఇదే కథ ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో పునరావృత్తం అవుతోంది! కాంగ్రెస్ సభ్యులు కొందరు శాసన సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఫలితంగా కర్నాటకలో వలెనే మధ్యప్రదేశ్‌లో కూడ ‘్భజపా’ శాసనసభలో ‘సంఖ్యా బాహుళ్యం’ సాధిస్తోంది!! మహారాష్టల్రో ‘్భజపా’ గత శాసనసభ ఎన్నికలలో గెలిచింది. ‘‘శివసేన’’ కాంగ్రెస్ కూటమిలోకి ఫిరాయించడంతో దేవేంద్ర ఫడ్నవీస్‌కు మళ్లీ ముఖ్యమంత్రి పదవి దక్కలేదు! దీనికి ప్రతిగా ‘్భజపా’ అదే రీతిని మధ్యప్రదేశ్‌లో అమలుజరుపుతోంది. బదులుకు బదులు... ఇవీ విలువలు...