S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

04/11/2019 - 01:12

మత ప్రదాతల హృదయ సీమలలో ప్రజాస్వామ్య భావతరంగాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయన్నది జరిగిన ప్రచారం. ప్రచారం మంగళవారం ముగిసింది. నగరాల నుండి పట్టణాలకు, పల్లెలకు వెళ్లి ‘మత ప్రదానం’ చేయడానికి- వోటు వేయడానికి- మత ప్రదాతలు- వోటరులు- ఉత్సాహం చూపిన దృశ్యాలు మంగళవారం, బుధవారం మాధ్యమాలలో విస్తృతంగా ఆవిష్కృతమయ్యాయి.

04/10/2019 - 05:11

మాల్‌దీవుల పార్లమెంటుకు జరిగిన ఎన్నికలలో ‘మాల్ దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ’- ఎమ్‌డీపీ- ఘన విజయం సాధించడం మన దేశానికి లభించిన మరో వ్యూహాత్మక విజయం. చైనా నౌకాదళాలు మన దేశానికి మూడువైపులా ఉన్న సముద్ర జలాలలో నిరంతరం సంచరిస్తూ ఉండడం ఈ వ్యూహాత్మక విజయానికి సమాంతర నేపథ్యం!

04/09/2019 - 04:21

లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత తాము ‘అమలు జరుప తలపెట్టిన’ ప్రగతి పథకాల గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివిధ రాజకీయ పక్షాలవారు తమ వాగ్దాన పత్రాలలో వివరించారు. వివరిస్తున్నారు! ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలలో గెలవదలచుకున్న ప్రధాన పక్షాలవారు కూడ తమ వాగ్దాన ప్రణాళికలను ఇదివరకే ఆవిష్కరించారు. ‘జాతీయతానిష్ఠ’ భారతీయ జనతాపార్టీవారు సోమవారం ఆవిష్కరించిన ‘సంకల్ప పత్రం’లోని ప్రధాన అంశం!

04/05/2019 - 22:42

యామిని ముగిసిన క్షణమున
ఆమని శోభలు మెరిసెను,
సుమ దళముల పరిమళముల
అమలిన సీమలు మురిసెను..
జనగణ మానస వనముల
యుగయుగముల ‘ద్యుతి’కలిగెను,
సమయపథం శుభ ‘వికారి’
విమల రథంతో వెలిగెను....

04/05/2019 - 01:40

‘ఏ షరతుల మీదైతే కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమయ్యిందో ఆ షరతులు నెరవేరనందున మా ప్రాంతం ఈ దేశం నుంచి కచ్చితంగా విడిపోతుంది.. అప్పుడు మరింత తీవ్రరూపంలో పోరాటం తప్పదు.. ఆ పోరాటానికి నేనే నాయకత్వం వహిస్తా.. రాజ్యాంగంలోని 370, 35ఏ అధికరణలను రద్దు చేస్తే జమ్మూ కశ్మీర్ భారత్ నుంచి విడిపోవడం ఖాయం.. 2020 సంవత్సరం నాటికి మేం కోరుకొనే స్వయం ప్రతిపత్తి ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..

04/04/2019 - 04:29

హిందూ బీభత్సం- అన్న పదాలను కల్పించిన రాజకీయ పక్షాల వారిని ‘వోటర్’లు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో శిక్షిస్తారన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచార సభలలో చెబుతున్న మాట! కానీ ఈ ‘‘హిందూ బీభత్స’’- హిందూ టెర్రర్- శబ్ద ‘ప్రయోక్త’లను, సృష్టికర్తలను ‘వోటర్’లు ఇదివరకే 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలో శిక్షించడం చరిత్ర.

04/03/2019 - 02:16

లోక్‌సభ ఎన్నికల ‘మతప్రదాన’-పోలింగ్- ఘట్టం సమీపిస్తున్న సమయంలో అక్రమ ప్రవేశకుల సమస్య చర్చకు రావడం సహజం! దశాబ్దుల తరబడి బంగ్లాదేశ్ నుంచి చొరబడిన అక్రమ ప్రవేశకులు ‘సక్రమ భారతీయులు’గా మారిపోతుండడం దశాబ్దుల కుట్ర. అక్రమ ప్రవేశకులను వోటర్ల జాబితాలకెక్కించి వారి ‘వోట్ల’ను పొందడానికి రాజకీయ పక్షాలవారు కొందరు కృషిచేసినట్టు కూడ ప్రచారమైంది!

04/02/2019 - 02:56

జవహర్‌లాల్ నెహ్రూకు ‘‘కాళ్లు మేఘాలలో ఉంటాయి..’’ అని లార్డ్ వౌంట్ బాటెన్ మహాత్మా గాంధీతో చెప్పాడట! చరిత్రలో ఈ సంగతి నమోదయి ఉంది. ‘‘నేల మీద నిలబడి ఆలోచించగల నాయకుడు సర్దార్ వల్లభ భాయి పటేల్..’’ అని కూడ మహాత్మునితో వౌంట్ బాటెన్ చెప్పినట్టు చరిత్ర! అందువల్ల ప్రభుత్వంలో పటేల్ ఉండి తీరాలన్నది వౌంట్ బాటెన్ గాంధీకి చెప్పిన మాట! 1947లో పటేల్ ఉప ప్రధాని పదవి నుంచి ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని భావించాడట!

03/29/2019 - 22:51

గెలవడం మాత్రమే రాజకీయ పక్షాల అభ్యర్థుల ఎంపికకు ఏకైక ప్రాతిపదికగా మారి ఉండడం నడుస్తున్న ఎన్నికల చరిత్ర. నిర్లజ్జ అన్ని రాజకీయ పక్షాలనూ నిలువునా ముంచెత్తుతోంది. ‘మా ప్రత్యర్థులది అవకాశ వాదం, మాది ఆదర్శ తత్త్వం..’ అని ప్రతి రాజకీయ పక్షం వారూ హోరెత్తిస్తున్నారు.

03/29/2019 - 05:18

లోక్‌సభ ఎన్నికల తరువాత ‘భారతీయ జనతాపార్టీ’ లేని ‘కూటమి’- ఫ్రంట్- కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని ప్రచారం చేస్తున్న వారిలో రెండు రకాలవారున్నారు. కాంగ్రెస్ లేకుండా మిగిలిన ‘భాజపా’ వ్యతిరేక దళాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మొదటి ‘శ్రేణి’ లక్ష్యం. కాంగ్రెస్‌ను కలుపుకొని ‘కూటమి’ని కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నవారు రెండవ ‘శ్రేణి’...

Pages