S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

05/23/2019 - 00:58

సామాన్య ప్రజలకు కలుగుతున్న సందేహం ఇది! ‘ఎన్నికల సాధికార సంఘం’ వారు రాజ్యాంగంలోని, ప్రజాప్రాతినిధ్యపు చట్టంలోని ‘నియమాల’కు అనుగుణంగా విధులను నిర్వహించాలా? లేక రాజకీయ మహాశయుల ‘నిర్దేశాల’కు అనుగుణంగా విధులను నిర్వహించాలా??- అన్నది జన మానస సీమలలో దాదాపు రెండు నెలలపాటు కొనసాగిన ఈ ‘మీమాంస’. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుండి ఈ ‘మీ మాంస’ కూడ మొదలైపోయింది.

05/22/2019 - 01:37

జమ్మూకశ్మీర్‌ను కల్లోలగ్రస్తం చేస్తున్న బాహ్య శత్రువులను అంతర్గత విరోధులను నిరోధించడానికి, నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలకు ఇది కొత్త ఊపు... జమ్మూకశ్మీర్‌కు సంబంధించినంతవరకు ఐక్యరాజ్యసమితి ‘మానవాధికార మండలి’- హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ -హెచ్‌ఆర్‌సి-తో సంప్రదింపుల ప్రక్రియను రద్దుచేస్తున్నట్టు మన ప్రభుత్వం ప్రకటించడం ఈ కొత్త ఊపు!

05/21/2019 - 02:50

విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు జరగడానికి రంగం సిద్ధం అవుతుండడం సమాంతర పరిణామం. ఎన్నికల ప్రక్రియ ప్రచారపు హోరు సద్దుమణిగింది. ఉత్కంఠ కూడ కొంత తగ్గిపోయింది. యథాపూర్వంగా మరో ఐదేళ్లు కేంద్ర ప్రభుత్వాన్ని ‘భారతీయ జనతాపార్టీ’ నిర్వహించగలదన్న ‘నిర్ధారణ’ ఈ ఉత్కంఠ తగ్గిపోవడానికి ప్రాతిపదిక.

05/18/2019 - 01:35

వరంగల్లుకు చెందిన లక్ష్మణ్ సుధాకర్ అనే ఉపాధ్యాయుడు సామాజిక మాధ్యమాల ద్వారా ఓ సందేశాన్ని ప్రసారం చేశాడు. ‘వేసవిలో నీటిచుక్క దొరకక పిచ్చుకలు, పావురాలు తదితర పక్షులు, ప్రాణులు దప్పికతో అల్లాడిపోతుంటాయి. ఒక మట్టి పిడతలో కాని ఇతర పాత్రలలో కాని నీరు నింపి మన ఇంటి ప్రహరీగోడల మీద, ఇంటి కప్పుమీద ఉంచుదాము. ఆ ప్రాణులు దప్పిక తీర్చుకుంటాయి..’ అన్నది ఆ సందేశం!

05/17/2019 - 02:20

ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో హింసను నిరోధించలేకపోవడం మన రాజ్యాంగ వ్యవస్థలో నిహితమై ఉన్న ఘోర వైఫల్యం. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో చివరి దశ ప్రచారం ఒకరోజు ముందుగానే ముగిసిపోవడం ఈ ఘోర వైఫల్యానికి పరాకాష్ఠ. ఏడు దశలుగా దేశమంతటా ‘సాగతీత’కు గురి అయిన ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల చివరి దశ ‘మత ప్రదానం’ పంతొమ్మిదవ తేదీన- ఆదివారం జరుగనుంది.

05/16/2019 - 02:01

మిత్రదేశాల పట్ల ఆధిపత్య ధోరణి దశాబ్దుల తరబడి అమెరికా విదేశాంగ విధానంలో నిహితమై ఉన్న దౌత్య దౌర్జన్యం. ఈ ‘‘దౌర్జన్యాన్ని’’ మన ప్రభుత్వం రెండు దశాబ్దులకు పైగా సహించవలసి వస్తోంది. ఇరాన్ దేశం నుంచి మన దేశం ఇంధన తైలాన్ని, ఇంధన వాయువులను కొనరాదన్నది మన ప్రభుత్వాన్ని నియంత్రించడానికి అమెరికా ప్రభుత్వం అమలు జరుపుతున్న వ్యూహంలో వర్తమాన ఘట్టం...

05/15/2019 - 01:51

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో ఏర్పాటు చేయదలచిన ‘సమాఖ్య కూటమి’ ప్రభుత్వం ‘మరీచికలో మధుర జలం’ వంటిది కాదు. ఎందుకంటె మరీచిక- ఎండమావి-లో మధుర జలాన్ని- తీయని నీటిని- అనే్వషించే వారికి ‘నీరు కన్పించడం’ సహజం. అది చివరికి భ్రాంతిగా మిగిలిపోతుంది. అయినప్పటికీ వెదకుతున్నంత సేపుఎండమావిలో ‘లేని నీరు’ ఉన్నట్టుగానే వెదికేవారిని ఊరించడం సహజం.

05/14/2019 - 01:51

ఆధిపత్యం కోసం కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం లేదా పరోక్ష యుద్ధం ప్రత్యక్ష యుద్ధంగా మారుతుండడం అంతర్జాతీయ వర్తమాన వైపరీత్యం. చైనా నుండి దిగుమతి అవుతున్న వస్తువులపై అమెరికా ప్రభుత్వం భారీగా సుంకాలను పెంచడం ప్రచ్ఛన్న యుద్ధం- కోల్డ్‌వార్- ప్రత్యక్ష యుద్ధంగా మారుతుండడానికి నేపథ్యం.

05/11/2019 - 00:18

ఇన్ని ఘోరాలు జరిగిపోతున్నప్పటికీ, తెలుగునేల నుంచి మాత్రమే గాక దేశంలోని అనేక ప్రాంతాల నుంచి సౌదీ అరేబియాకు, పారశీక సింధుశాఖ దేశాలకు ఉద్యోగార్థులు వెడుతుండడమే విస్మయకరం. కరీంనగర్ జిల్లా తిమ్మాపురం మండలం మక్తాపల్లి గ్రామానికి చెందిన వీరయ్య అనే ‘ఒంటెల కాపరి’ విషాదగాథ సౌదీ అరేబియాలోని సంపన్న యజమానుల పైశాచిక ప్రవృత్తికి సరికొత్త ఉదాహరణ.

05/10/2019 - 01:22

‘ఎంత మంచి సినిమా అయినా వసూళ్లు ప్రధానంగా విడుదలైన తర్వాత నాలుగు రోజులే ఉంటాయి.. మరోపక్క పైరసీ వల్ల సినిమాలకు నష్టం జరుగుతోంది.. అలాంటప్పుడు పెద్ద సినిమాలు అనుకొన్న వసూళ్లు సాధించాలంటే టిక్కెట్ ధరలు పెంచక తప్పదు..’ అని ఓ ప్రముఖ సినీ నిర్మాత కొత్త భాష్యం చెప్పాడు.

Pages