S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

11/15/2019 - 01:27

చైనా చొఱబాటును వ్యతిరేకిస్తూ నేపాల్‌లో నిరసన ప్రదర్శనలు తీవ్రతరం అవుతుండడం, హాంకాంగ్‌లో కొనసాగుతున్న ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి సమాంతర పరిణామం. నియంతృత్వ ఏకపక్ష రాజ్యాంగ వ్యవస్థ నెలకొని ఉన్న చైనాలో ‘్భగమైన’ హాంగ్‌కాంగ్ నగర రాజ్యంలో మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడి ఉంది. ‘ఒక దేశం-రెండు వ్యవస్థలు’ అన్న ఒప్పందం హాంగ్‌కాంగ్‌కూ చైనాకూ మధ్య ఇరవై రెండేళ్ల క్రితం కుదిరింది.

11/14/2019 - 01:48

వ్రతం చెడినా ఫలితం దక్కలేదు. శివసేన ఇలా వ్రతం చెడింది, సైద్ధాంతికంగా దివాలా తీసింది. మహారాష్ట్ర రాజకీయ రంగంలో దశాబ్దుల పాటు ‘సైద్ధాంతిక నిబద్ధత’కు శివసేన పార్టీ ఒక ఆదర్శం. ఆ ‘ఆదర్శం’ భయంకర అవకాశవాదంగా పరిణమించడం విస్మయకరమైన విపరిణామం. మహారాష్టల్రో రాజకీయ సంక్షోభం ఏర్పడడానికి ఊహించని రీతిలో గత మూడు వారాలుగా ప్రస్ఫుటించిన శివసేన దిగజారుడుతనం ఏకైక కారణం.

11/13/2019 - 01:51

ఇది కేవలం తెలుగుభాష మనుగడకు సంబంధించిన సంక్షోభం కాదు. ఇది భారతీయ భాషల సమష్టి అస్తిత్వ పరిరక్షణకు సంబంధించిన వ్యవహారం. ప్రాథమిక, మాధ్యమిక విద్యాబోధన మాధ్యమ భాషను మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న విచిత్ర విన్యాసాలను ఈ ప్రాతిపదికపై నిర్ధారణ చేయవలసి ఉంది. ఈ విచిత్ర విన్యాసాలు ఇప్పటివి కావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో సైతం ప్రదర్శించినవి.

11/12/2019 - 00:02

భారత రాజ్యాంగ ప్రక్రియ క్రమానుగత వికాస చరిత్రలో టీఎన్ శేషన్ ఒక ప్రజాస్వామ్య అద్భుతం.. భారత ప్రజాస్వామ్య ప్రాంగణానికి ఆయన ఒక నైతిక ప్రాకారం! ‘్భరతీయ పాలనా సేవ’- ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్-ఐఏఎస్- అధికారి ఒకరు భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి జరిపిన కృషికి శేషన్ పరాకాష్ఠ.

11/10/2019 - 00:22

విజయం ఇది, స్వజాతీయ
హృదయ గగన శుభోదయం
విజయం ఇది, తరతరాల
విభవ స్వప్న సాకారం..
విజయం ఇది, సర్వోన్నత
న్యాయం పలికిన సత్యం,
భరతమాతృ చరితనందు
మరో మధుర మధుమాసం..

11/08/2019 - 22:32

కావా బాలా? ‘కాంచనమాలా!’
కస్యాః పుత్రీ? ‘కనకలతాయాః!’
కిమ్ వా హస్తం? ‘తాలజపత్రం!’
కోవా లేఖా? ‘క,ఖ,గ,ఘ..’

11/08/2019 - 01:52

అడవులను ధ్వంసం చేయడం వల్ల, విచ్చలవిడిగా మాంసాహారాన్ని భుజించడం వల్ల ప్రపంచ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందన్నది దాదాపు పదకొండువేల మంది ప్రముఖ శాస్తవ్రేత్తలు ముక్తకంఠంతో చెబుతున్న మాట. చెప్పినమాట కొత్తది కాదు. దశాబ్దుల తరబడి శాస్తవ్రేత్తలు, మేధావులు, విద్యాధికులు, పర్యావరణ పరిరక్షక ఉద్యమకారులు చెబుతున్న మాట ఇది.

11/07/2019 - 01:48

మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కడం అన్న సామెతకు బహుశా ఇది మరో కార్యాచరణ.. వాణిజ్య ప్రపంచీకరణను భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నెత్తికెత్తి 2014లో నిష్క్రమించిన కాంగ్రెస్ వారు ఇప్పుడు భాజపాను విమర్శిస్తున్నారు. ఈ ‘ప్రపంచీకరణ ఆర్థికనీతి’ భాజపా నిర్వాహక కేంద్ర ప్రభుత్వం మెడలో గుదిబండలా వేలాడుతోంది.

11/06/2019 - 01:27

ఆగ్నేయ ఆసియా దేశాల కూటమితోను, చైనా తదితర సంపన్న దేశాలతోను ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం’ ఒప్పందం కుదుర్చుకొనడానికి మన ప్రభుత్వం నిరాకరించడం జాతీయ ప్రయోజన పరిరక్షణకు అనుగుణమైన పరిణామం! వ్యూహాత్మకంగాను దౌత్యపరంగాను దక్షిణ, పూర్వ ఆసియా దేశాల మధ్య మన దేశం ‘ఒంటరి’ కావడానికి ఈ నిర్ణయం దోహదం చేయడం సమాంతర విపరిణామం!

11/05/2019 - 03:13

దేశ రాజధాని ‘ప్రపంచ కాలుష్య రాజధాని’గా పేరు మోసిందని జరిగిన నిర్ధారణ ‘జీవన సౌలభ్య’- ఈజ్ ఆఫ్ లివింగ్- సూత్రాన్ని వెక్కిరిస్తోంది. దేశ ప్రజల జీవన సౌలభ్యం మెరుగుపడకుండా నిరోధిస్తున్న వైపరీత్యాలలో అతి ప్రధానమైనది పర్యావరణ కాలుష్యం. ఆర్థిక అసమానతలు, పేదరికం జీవన సౌలభ్యానికి విఘాతకరం. అంతకంటే ప్రమాదకరమైనది కాలుష్య బీభత్సం.

Pages