S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

04/25/2019 - 01:31

తెలంగాణలో ‘ఇంటర్ మీడియట్’ పరీక్ష తప్పిన భ్రమకు గురి అయి అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం ‘వాణిజ్య ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్- రాక్షసక్రీడలో వర్తమాన ఘట్టం! దేశంలోని అన్ని జీవన రంగాలను వాణిజ్య బీభత్సం ఛిద్రం చేస్తోంది, ముక్కలు చెక్కలు చేస్తోంది. భారతీయ స్వభావాన్ని విధ్వంసం చేస్తున్న ఈ వాణిజ్య బీభత్సం వౌలిక కారణం.

04/24/2019 - 01:55

హేమంత కర్కరే అన్న ఉన్నత పోలీస్ అధికారిని తాను శపించానని అందువల్లనే ఆయన దుర్మరణం పాలయ్యాడని ‘ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సాధ్వి’ ‘ప్రవచించడం’ వౌలిక హైందవ జాతీయ ప్రవృత్తికి విరుద్ధం. ఆ తరువాత ఆమె క్షమార్పణ చెప్పడం ద్వారా తప్పును దిద్దుకొంది. కానీ సంయమనంతోను, ఇతరులకు ఆదర్శంగాను వ్యవహరించవలసిన ఈ సంన్యాసిని ఇలా మాట్లాడడమే విస్మయకరం!

04/23/2019 - 02:10

శ్రీలంకలో ఆదివారం జరిగిన భయంకర బీభత్స విస్ఫోటన ధ్వనులు భారతీయుల హృదయ సీమలలో సైతం విషాద ప్రకంపనలు సృష్టించడం సహజం. శ్రీలంక భద్రత భారత భద్రతతో ముడివడి ఉంది, శ్రీలంక చరిత్ర భారత చరిత్రతో అనుసంధితమై ఉంది. శ్రీలంక సాంస్కృతిక వారసత్వానికి, భారతీయ సాంస్కృతిక వారసత్వానికీ మధ్య సమానత్వం నెలకొని ఉంది. శ్రీలంక ప్రజలకూ, భారతీయ ప్రజలకూ మధ్య అనాదిగా మమకార బంధం ఏర్పడి ఉంది.

04/19/2019 - 21:54

బడి ఎగ్గొట్టి ‘బలుసకాయల’ కోసం పుట్టల వెంట గుట్టల వెంట తిరిగిన ఆకతాయి పిల్లల మూకవలె.. కర్నాటకలోని లక్షలాది మత ప్రదాతలు- వోటర్స్- విహారయాత్రలకు వెళ్లిపోయారట. అందువల్లనే పదునాలుగు కర్నాటక లోక్‌సభ నియోజకవర్గాలలో గురువారం నాడు కేవలం అరవై ఎనిమిది శాతం ‘మత ప్రదానం’- పోలింగ్- జరిగిందట!

04/19/2019 - 01:52

జమ్మూ కశ్మీర్‌లోని ‘అధీన రేఖ’- లైన్ ఆఫ్ కంట్రోల్- ఎల్‌ఓసీ- గుండా పాకిస్తాన్‌తో జరుగుతున్న ‘సీమాంతర వాణిజ్యం’ తాత్కాలికంగా రద్దుకావడం హర్షణీయ పరిణామం! కానీ, లోక్‌సభ ఎన్నికల తరువాత అధికార పదవీ బాధ్యతలను స్వీకరించే మన ప్రధానమంత్రికి పాకిస్తాన్ ‘ప్రధాని’గా చెలామణి అవుతున్న ప్రచ్ఛన్న బీభత్సకారుడు ఇమ్రాన్‌ఖాన్ జూన్‌లో ‘తటస్థ పడనున్నాడన్నది’ జరుగుతున్న ప్రచారం.

04/18/2019 - 03:34

రాజకీయ వేత్తలు ప్రధానంగా ప్రాంతీయ దళాధినేతలు ‘బహుళ’ ప్రజాస్వామ్య వ్యవస్థ వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నారు. ఎన్నికల సమయంలో, ప్రత్యేకించి లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ మహదాకాంక్షలు మరింతగా సమావిష్కృతవౌతుండడం దశాబ్దుల చరిత్ర. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలలో పోటీచేస్తున్న ప్రాంతీయ రాజకీయ పక్షాలకు ఈ ‘బహుళ’ ప్రజాస్వామ్యం ప్రధాన ప్రచార ఇతివృత్తం కావడం ఈ చరిత్రకు అనుగుణం.

04/17/2019 - 02:09

సూడాన్ దేశపు అధ్యక్షుడుగా మూడు దశాబ్దులుగా చెలామణి అయిన జిహాదీ బీభత్సకారుడు, నిరంకుశ నరరూప రాక్షసుడు ఒమర్ అల్ బషీర్ పదవీచ్యుతుడు కావడం శుభపరిణామం. దాదాపు ఇరవై లక్షల మంది ఇస్లాం మతేతర ప్రజలను హత్యచేయించిన ఒమర్ అల్ బషీర్ ‘మానవ సమాజ వ్యతిరేకి’ అని 2008లో ‘అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం’ నిర్ధారించింది. కానీ ఈ నర రూప పిశాచాన్ని చైనా దశాబ్దులుగా సమర్ధించడం అంతర్జాతీయ వైపరీత్యం.

04/16/2019 - 05:19

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి భారతీయ జనతాపార్టీ నాయకుడు ఆదిత్యనాథ యోగి మూడురోజులపాటు ‘‘ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని’’ ‘ఇసి’ ఆదేశించడం అపూర్వ, అపురూప పరిణామం! ‘బహుజన సమాజ్ పార్టీ’ అధినాయకురాలు మాయావతి కూడ రెండు రోజులపాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ‘ఇసి’ నిర్దేశంచడం ‘‘నోళ్లు పారేసుకొనే’’ రాజకీయ ప్రదర్శనలకు మరో నిరోధం!

04/12/2019 - 22:53

బ్రిటన్ దురాక్రమణకు వ్యతిరేకంగా మన దేశం జరిపిన స్వాతంత్య్ర సమర చరిత్రలో అత్యంత విషాద ఘట్టం ‘జలియన్‌వాలా బాగ్’లో జరిగిన పైశాచిక మారణకాండ. ఐరోపీయ బీభత్స స్వభావానికి చెఱగని భయంకర చారిత్రక సాక్ష్యం ఈ మారణకాండ!

04/12/2019 - 04:40

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవనం ప్రాతిపదికగా రూపొందిన చలనచిత్రం- బయోగ్రాఫికల్ పిక్చర్- బయోపిక్- విడుదలను-ప్రదర్శనను- నిలిపి వేయడం ‘ఎన్నికల సాధికార సంఘం’-ఎలక్షన్ కమిషన్-ఈసీ- వారి స్వతంత్ర, నిష్పక్ష ప్రవృత్తికి నిదర్శనం.

Pages