S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

05/09/2019 - 01:24

ఐదుమంది భారతీయ నావికులను ఆఫ్రికా ఖండపు నైజీరియా సముద్ర తీరంలో ఓడదొంగలు అపహరించుకొని పోవడం ఆశ్చర్యకరం కాదు. నైజీరియా తీరంలో గత కొనే్నళ్లుగా జిహాదీ బీభత్సకారులు, ఓడదొంగలు విశృంఖల విహారం చేస్తుండడం ఇందుకు కారణం. గత ఏడాది ఫిబ్రవరిలో ఇరవైమంది భారతీయ వాణిజ్య నావికులను ఓడదొంగలు అపహరించుకొని పోవడం ఈ ‘విశృంఖల జిహాదీ బీభత్స విస్తరణ’ ఫలితం.

05/08/2019 - 01:30

మానవుడు కల్పించుకున్న ‘ప్రగతి భ్రాంతి’- ఇల్యూషన్ ఆఫ్ డెవలప్‌మెంట్-కి పది లక్షల తరగతుల జీవరాసులు బలిఅయిపోతున్నాయన్నది పర్యావరణ శాస్తవ్రేత్తల అధ్యయన నివేదికలో జరిగిన నిర్ధారణ. ‘పారిస్’ పర్యావరణ పరిరక్షణ అంగీకారానికి అనుగుణంగా జరుగుతున్న వివిధ దేశాల సమన్వయ అధ్యయనంలో భాగంగా ఈ నివేదికను రూపొందించారు.

05/07/2019 - 01:17

దేశ విద్రోహపు చరిత్ర పునరావృత్తం అవుతుండడం ప్రచారం కాని మహా విషయం. క్రీస్తుశకం 1498లో మొదలై 1947 వరకు నడచిన చరిత్రకు ఇది పునరావృత్తి. వాస్కోడిగామా అనే పోర్చుగీసు బీభత్సకారుడు మన దేశంలో అడుగుపెట్టడం 1498 నాటి కథ. 1947లో బ్రిటన్ ముష్కరులు దేశం నుండి నిష్క్రమించేవరకు విదేశీయులు మన దేశాన్ని కుళ్లగించి వేయడం అప్పుడు నడచిన చరిత్ర.

05/03/2019 - 23:05

గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారి ‘వాణిజ్య అనుమతి’ రద్దుకాకపోవడం ఆర్థిక బీభత్సకాండను అరికట్టే నాథుడు దేశంలో లేడన్న వాస్తవానికి మరో ధ్రువీకరణ. ‘ఇంటర్ మీడియట్’ పరీక్షను తప్పినట్టు భ్రాంతి చెందిన అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తెలంగాణ అంతటా ఆవిష్కృతమైన విషాద దృశ్యం. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్‌లో గురువారం మరో విద్యార్థి ఈ ‘భ్రాంతి’కి బలైపోయాడు.

05/03/2019 - 01:28

తోడేలు ‘దూకడం’ మానుకోదు! ఒకచోట తోక ముడిచిన తోడేలు మరోచోట దూకుతుంది, వేరొకచోట నక్కుతుంది. అందువల్ల ‘ఐక్యరాజ్యసమితి’లో ‘తోక ముడిచిన’ చైనాకు మన దేశం పట్ల సుహృత్‌భావం వెల్లివిరిసినట్టు కాదు.

05/02/2019 - 01:51

మానవ ‘మేధ’కున్న పరిమితులు ఇలా మరోసారి ధ్రువపడినాయి. హిమాలయ పర్వతశ్రేణులలో కనిపించిన ‘మంచుమనిషి’ పాదముద్రలు ఈ సరికొత్త ధ్రువీకరణ! ఈ మంచుమనిషికి ‘యతి’ అని ఎవరు ఎప్పుడు నామకరణం చేశారన్నది స్పష్టం కాని విషయం. కానీ ‘యతి’ మళ్లీ కన్పించాడన్నది మంగళవారం, బుధవారం ప్రచారమైన వ్యవహారం! ఈ ‘మంచుమనిషి’ పద ముద్రలు కనిపించడం ఇది మొదటిసారి కాదు. గతంలో అనేకసార్లు ఈ ‘పద చిహ్నాల’ను అనేకమంది గుర్తించారట.

05/01/2019 - 01:33

నోటిలో కాలుపెట్టుకోవడం కాంగ్రెస్ అధ్యక్షుడిగా చెలామణిలో ఉన్న రాహుల్ గాంధీ అనే రాజకీయ విదూషకునికి పరిపాటి! నోటిలో వేలుపెట్టుకోవడం శిశువుల ప్రవృత్తి కావచ్చు, మాన్పించడానికి తల్లిదండ్రులు మహాయాతన పడుతున్నారు, మాన్పిస్తున్నారు కూడ. కానీ నోటిలో కాళ్లు పెట్టుకుంటున్న రాహుల్ గాంధీ వంటి వారిని మాన్పించడం సాధ్యం కాదు.

04/30/2019 - 01:17

అక్షరాలు అజరామర
భావానికి రూపాలు
అక్షరాలు విశ్వ విహిత
నాద జనిత రాగాలు
అక్షరాలు ఎద విరిసిన
అనుభూతుల పరిమళాలు
‘అమ్మా’ అను పసిపాపల
పరిశోధక స్వరాలు..!

04/26/2019 - 22:24

నిర్బంధ గృహాలలో ఉన్న విదేశీయులను తాత్కాలికంగా విడుదల చేయాలన్న అస్సాం ప్రభుత్వ ప్రతిపాదనను సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించడం అంతర్గత భద్రత పరిరక్షణకు దోహదం చేస్తున్న పరిణామం. విడుదల చేయాలని ప్రతిపాదిస్తున్న అస్సాం ప్రభుత్వాన్ని గురువారం సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం వారు అభిశంసించడం ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులకు గుణపాఠం వంటిది.

04/26/2019 - 02:02

సముద్రం వైపు పరుగులు తీస్తున్న నీటిని నిరోధించి పొలాల వైపు నడిపించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి శ్లాఘనీయం. ‘సేద్యం’, ‘వ్యవసాయం’ అన్న పదాలకు సంస్కృత భాషలో సమాన పదం ‘‘కృషి’’. గత ఐదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ‘వ్యవసాయం’ చేస్తోందని చెప్పడం అతిశయోక్తి కాదు. ‘వ్యవసాయం’ అంటే పంట, పచ్చదనం, పర్యావరణానికి పరిమళం, ప్రజలకు భోజనం!

Pages