S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/02/2015 - 18:22

ముంబయి: స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 51 పాయింట్లు నష్టపోయి 26,117 వద్ద అదేవిధంగా నిఫ్టీ 23 పాయింట్లు నష్టపోయి 7,931 సూచీ వద్ద ముగిశాయి.

12/02/2015 - 06:32

ముంబయి, డిసెంబర్ 1: ఊహించినట్లే కీలక వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) యథాతథంగానే ఉంచింది. మంగళవారం ఇక్కడ జరిగిన ఐదో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల జోలికి ఆర్‌బిఐ వెళ్ళలేదు. సెప్టెంబర్ 29న నిర్వహించిన ద్రవ్యసమీక్షలో అనూహ్యంగా రెపో, రివర్స్ రెపోలను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఈసారి విరామం ప్రకటించింది.

12/02/2015 - 06:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: జర్మనీ ఆటోరంగ దిగ్గజం ఫోక్స్‌వాగన్ దేశీయంగా భారీ స్థాయిలో వాహనాలను రీకాల్ చేయనుంది. నిబంధనలను ఉల్లంఘించి కాలుష్య ప్రమాణాల్లో తిరస్కరించబడిన ఉత్పత్తులతో రూపొందిన డీజిల్ ఇంజిన్లను వాడినట్లు ప్రభుత్వ ఆదేశిత విచారణలో తేలడంతో 3.23 లక్షల వాహనాలను వెనక్కి తీసుకుంటోంది.

12/02/2015 - 06:25

విజయవాడ, డిసెంబర్ 1: ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ అధికారులు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సిగరెట్ షాపులపై దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 35 రకాల విదేశీ బ్రాండెడ్ సిగరెట్లను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు.

12/02/2015 - 06:25

హైదరాబాద్/కొత్తగూడెం/గోదా వరిఖని, డిసెంబర్ 1: ఈ ఆర్థిక సంవత్సరం నవంబర్‌తో ముగిసిన మొదటి 8నెలల్లో తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి సంస్థ తన చరిత్రలోనే అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపులో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

12/02/2015 - 06:24

హైదరాబాద్, డిసెంబర్ 1: జిఎంఆర్ గ్రూపు చైర్మన్ జిఎం రావుకు దుబాయ్‌లో జరిగిన కార్యక్రమంలో ఏబిఎల్‌ఎఫ్ జీవిత సాఫల్య అవార్డును ఆసియా బిజినెస్ లీడర్‌షిప్ ఫోరం ప్రకటించింది. వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్య నాయకత్వ వ్యక్తిత్వంతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన జిఎంఆర్ గ్రూపు చైర్మన్ జిఎం రావుకు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు మంగళవారం తెలిపింది.

12/01/2015 - 17:10

ముంబయి : స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెనె్సక్స్ 23పాయింట్లు లాభపడి 29,169వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 19పాయింట్లు లాభపడి 7,954 పాయింట్లు వద్ద ముగిసింది.

12/01/2015 - 07:04

ముంబయి, నవంబర్ 30: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించే సంస్థల కోసం సోమవారం కొత్త లిస్టింగ్ నిబంధనలను తీసుకొచ్చింది. పలు కీలక నిర్ణయాల్లో భాగంగా దీన్ని తీసుకురాగా, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)తోపాటు ఇతర అన్ని లిస్టింగ్ నిబంధనలను మార్చి కొత్తగా పరిచయం చేసింది.

12/01/2015 - 07:02

ఆర్జీ-3 డివిజన్ జిఎం వెంకట రామయ్య

12/01/2015 - 07:01

ప్రకటించిన భారతీ ఎయిర్‌టెల్ * మెరుగైన సేవలపై దృష్టి

Pages