S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/12/2015 - 05:15

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ రాష్ట్రంలో అందరికీ విద్యుత్ స్కీంను అమలు చేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖతో తెలంగాణ ప్రభుత్వం అవగాహనా ఒప్పందం ఖరారు చేసింది. ఈ అవగాహనా ఒప్పందంపై తెలంగాణ రాష్ట్ర ఇంధన కార్యదర్శి అరవింద్ కుమార్, కేంద్ర విద్యుత్ శాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి అరోరా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సంతకాలు చేశారు.

12/12/2015 - 05:14

హైదరాబాద్, డిసెంబర్ 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికీ విద్యుత్ స్కీంను అమలుపరచడంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఈ విధానాలను ఇతర రాష్ట్రాలతో పంచుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి ప్రదీప్ కుమార్ పూజారి ఏపి ట్రాన్స్‌కో, డిస్కాం అధికారులను కోరారు.

12/12/2015 - 05:13

హైదరాబాద్, నార్సింగి, డిసెంబర్ 11: కంటి ఆపరేషన్లు నిర్వహించటంలో దక్షిణ భారతదేశంలోనే పేరుగాంచిన సరోజినీదేవి కంటి ఆసుపత్రికీ నీటి ఎద్దడి తప్పలేదు. గడిచిన మూడురోజుల నుంచి ఆసుపత్రికి నీటిని సరఫరా చేసే పైప్‌లైన్‌లో తలెత్తిన లోపాల కారణంగా సరఫరా స్తంభించింది.

12/12/2015 - 02:54

హైదరాబాద్, డిసెంబర్ 11: ‘కరవుతో అల్లాడుతున్నాం. తక్షణం రెండు వేల కోట్లు సాయం చేయండి’ అంటూ సిఎం చంద్రబాబు కేంద్ర బృందాలను కోరారు. రెండు మూడేళ్లలో పూర్తిస్థాయి కరవురహిత రాష్ట్రంగా మార్చేందుకు ఆంధ్రను ఒక నమూనాగా తీసుకోవాలని సూచించారు. దేశంలో కరవును ఎదుర్కోనే రాష్ట్రాలకు ఉపశమనం కలిగించేలా శాశ్వత పరిష్కార మార్గాలు అనే్వషించాలని సూచించారు.

12/12/2015 - 02:14

గుంటూరు, డిసెంబర్ 11: గ్రామాలు, జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎన్ని వనరులు కల్పించినప్పటికీ, ప్రజా భాగస్వామ్యంతోనే సత్ఫలితాలు సాధించవచ్చని సిఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపాల్టీ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు 310 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించి, స్పీకర్ కోడెల శివప్రసాద రావును పొగడ్తలతో ముంతెచ్చారు.

12/12/2015 - 02:10

విజయవాడ, డిసెంబర్ 11: ఆంధ్రప్రదేశ్ రాజధాని బెజవాడలో సరికొత్త రాక్షస గ్యాంగ్ వెలుగులోకి వచ్చింది. ఈ మాఫియా వికృత చేష్టలు, అకృత్యాలు అంతాఇంతా కాదు. కాల్‌మనీ ముసుగులో ఎందరో మహిళలను ట్రాప్‌చేసి లైంగిక దాడులకు పాల్పడటమే కాకుండా, కొందరు పెద్దల వద్దకు వారిని పంపుతూ పనులు చక్కబెట్టుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా చాలాకాలంగా సాగుతున్న అనైతిక వ్యవహారం ఒక్కసారిగా బట్టబయలైంది.

12/11/2015 - 18:00

విజయవాడ : వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో రూ.3,760 కోట్ల నష్టం వాటిల్లిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర బృందాలకు వివరించారు. రాష్ట్రంలో వరదలు, కరవు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు ఈరోజు విజయవాడలో సీఎం చంద్రబాబుతో వేర్వేరుగా భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా వారితో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కోరారు.

12/11/2015 - 15:57

మెదక్‌: జిల్లాలో ఎమ్మెల్సీ స్థానానికి తెరాస అభ్యర్థి భూపాల్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ స్థానానికి నామినేషన్లు వేసిన తెదేపా అభ్యర్థి బాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి శివరాజ్‌పాటిల్‌ తమ నామినేషన్లను ఈరోజు ఉపసంహరించుకున్నారు. దీంతో మెదక్‌ ఎమ్మెల్సీ స్థానం తెరాస వశమైంది.

12/11/2015 - 15:23

హైదరాబాద్ : సరోజనీదేవి కంటి ఆసుపత్రిలో రోగులు ఆందోళనకు దిగారు. గత నాలుగు రోజుల నుంచి ఆసుపత్రిలో నీటి కొరత ఏర్పడింది. దీంతో 108 శస్త్ర చికిత్సలు ఆగిపోయాయి. రోగులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆందోళనకు దిగారు. రేపటిలోగా సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వటంతో రోగులు ఆందోళన విరమించారు.

12/11/2015 - 15:21

చిత్తూరు : చిత్తూరు నగర మేయర్ అనురాధ దంపతుల హత్యకేసులో మరోకరిని అరెస్టు చేశారు. చింటూ డ్రైవర్ వెంకటేష్‌ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి తల్వార్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కాగా మేయర్ హత్యకేసులో నిందితుల సంఖ్య 20కి చేరింది. చింటూ డ్రైవర్ వెంకటేష్ ఐదవ నిందితుడని డీఎస్పీ వెల్లడించారు.

Pages