రాష్ట్రీయం

బెజవాడలో రాక్షస గ్యాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: ఆంధ్రప్రదేశ్ రాజధాని బెజవాడలో సరికొత్త రాక్షస గ్యాంగ్ వెలుగులోకి వచ్చింది. ఈ మాఫియా వికృత చేష్టలు, అకృత్యాలు అంతాఇంతా కాదు. కాల్‌మనీ ముసుగులో ఎందరో మహిళలను ట్రాప్‌చేసి లైంగిక దాడులకు పాల్పడటమే కాకుండా, కొందరు పెద్దల వద్దకు వారిని పంపుతూ పనులు చక్కబెట్టుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా చాలాకాలంగా సాగుతున్న అనైతిక వ్యవహారం ఒక్కసారిగా బట్టబయలైంది. గ్యాంగ్ బారినపడి జీవితాలు పాడుచేసుకున్న బాధితులు వందల సంఖ్యలోనే ఉన్నారు. పైగా చీకటి వ్యవహారంలో నగరానికి చెందిన పలువురు ప్రముఖులున్నారు. బాధితులు నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్‌ను కలిసి గోడు వెలిబుచ్చుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ బృందాలు గ్యాంగ్‌లోని కీలక వ్యక్తితోపాటు, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పరారీలో ఉన్నారు. వివరాల్లోకి వెళితే... పటమటకు చెందిన యలమంచిలి శ్రీరామమూర్తి అలియాస్ రాము అనే వ్యక్తి చాలాకాలంగా రాజకీయ, పోలీసు, ప్రముఖుల అండదండలతో కాల్‌మనీ, వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈయనతో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపారస్తులకు పరిచయం ఉంది. వీరిలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రత్నకుమారి సోదరుడు చెన్నుపాటి శ్రీను, ఏపిఎస్‌పిడిసిఎల్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీరు మార్లపూడి సత్యానందం, మరికొందరున్నారు. వీరంతా మాఫియాగా ఏర్పడి ఫైనాన్స్ కోసం వచ్చే వారికి డబ్బు సాయంచేసి, తర్వాత అప్పు తీర్చమంటూ వేధింపులకు గురి చేసేవారు. ఈక్రమంలో సదరు వ్యక్తులను తమ అధీనంలోకి తీసుకుని వారి భార్య, లేక సోదరి ఇలా వారి కుటుంబీకులను తమవద్దకు పంపాలంటూ లొంగ దీసుకుంటున్నారు. అదే నేరుగా మహిళలే అప్పు కోసం వీరిని సంప్రదిస్తే, ముందుగా వారిని, ఆ తర్వాత వారి కుమార్తెలను, తద్వారా స్నేహితురాళ్లను ట్రాప్ చేస్తారు. ఈవిధంగా నగరంలో సుమారు రెండు మూడొందల మంది మహిళలు, యువతులు వీరిబారిన పడి జీవితాలు పోగొట్టుకున్నారు. వీరికి లొంగిపోయిన మహిళలు, యువతులపై లైంగిక చర్యలకు పాల్పడటమే కాకుండా వీరికున్న సిండికేట్ల వద్దకు పంపుతూ, అదేవిధంగా రాజకీయనేతలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు సరఫరా చేస్తూ వీరి వ్యక్తిగత, వ్యాపార పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఇందుకు పోలీసుశాఖలోని కొందరు డిఎస్పీ, సిఐస్థాయి అధికారులకూ గ్యాంగుతో సన్నిహిత సంబంధాలున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. వీరి చెరలోని మహిళలు, యువతులకు మద్యం తాగించి స్టార్ హోటళ్లలో వారి నగ్న దృశ్యాలు చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేస్తూ వీరి కార్యకలాపాలు చేసుకుపోతున్నారు. ఈక్రమంలో ఓ బాధితురాలు పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈమె తన కుమార్తె ఇంజనీరింగ్ సీటు డబ్బు కోసం ఫైనాన్సియర్‌ను ఆశ్రయిస్తే డబ్బు ఇచ్చిన గ్యాంగులోని పెద్ద మనుషులు తొలుత ఆమెను, తర్వాత ఆమె కుమార్తెను లైంగికంగా వేధించి జీవితాలు నాశనం చేశారు. ఈక్రమంలో మరికొందరు బాధితులు ముందుకురావడంతో వారి వివరాలు గోప్యంగా ఉంచి సీపి ఆదేశాలతో టాస్క్‌పోర్స్ ఏసిపిలు ప్రసాద్, మురళీధర్, ఎస్‌ఐలు సురేష్‌రెడ్డి, శ్రీనివాస్ సిబ్బందితో నిఘా ఉంచి కీలక నిందితుడైన యలమంచిలి రాముతోపాటు పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లోని చెన్నుపాటి శ్రీను, ఎలక్ట్రికల్ డిఇఇ ఎం సత్యానందం ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.