S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/17/2016 - 05:42

లండన్, జూన్ 16: చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ మరోసారి నిలకడలేని ఆటతో అభిమానులను నిరాశ పరచింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ని 2-4 తేడాతో చేజార్చుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే భారత గోల్‌పోస్టుపై దాడులకు ఉపక్రమించిన ఆస్ట్రేలియాకు 20వ నిమిషంలో ట్రెంట్ మిటన్ తొలి గోల్‌ను అందించాడు. 23వ నిమిషంలో అరాన్ జలెవ్‌స్కీ మరో గోల్‌ను సాధించిపెట్టాడు.

06/17/2016 - 05:41

ముంబయి, జూన్ 16: రియో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు పతకాన్ని సాధించే అవకాశాలు దాదాపు లేవని మాజీ ఆటగాడు వీరేన్ రస్క్విన్హా వ్యాఖ్యానించాడు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ కోచ్ రోలాండ్ ఆల్ట్‌మన్స్ భారత ఆటగాళ్లకు సమర్థమైన మార్గదర్శకం చేయలేకపోతున్నారని విమర్శించాడు. ఈ పరిస్థితుల్లో భారత జట్టు ఒలింపిక్స్ పతకాన్ని గెల్చుకోవడం కష్టమేనని అన్నాడు.

06/17/2016 - 05:39

జొహానె్నస్‌బర్గ్, జూన్ 16: రెండు కాళ్లూ లేకపోయినా, కృత్రిమ కాళ్లతోనే పరుగులు తీస్తూ, ప్రపంచ మేటి అథ్లెట్‌గా ఎదిగిన ఆస్కార్ పిస్టోరియస్ తన గర్ల్‌ఫ్రెండ్ రీవా స్టీన్‌క్యాంప్ హత్య కేసులో మళ్లీ జైలు ఊచలు లెక్కించడం ఖాయంగా కనిపిస్తున్నది.ఈ కేసులో చివరి దశ వాదోపవదాలు కొనసాగుండగా, త్వరలోనే కోర్టు తుది తీర్పునివ్వనుంది.

06/17/2016 - 05:37

మార్సెలీ, జూన్ 16: చివరి క్షణాల్లో నమోదైన రెండు గోల్స్ యూరో 2016 సాకర్ టోర్నమెంట్‌లో ఫ్రాన్స్‌ను ప్రీ క్వార్టర్స్ చేర్చాయి. ఈ పోటీల్లో అన్ని జట్లూ వ్యూహాత్మకంగా రక్షణాత్మక విధానాలను కొనసాగిస్తున్నాయని ఫ్రాన్స్, అబ్బేనియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ స్పష్టం చేసింది. ఆరంభం నుంచి మొదలైన మితిమీరిన డిఫెన్సివ్ ఆట దాదాపుగా చివరి వరకూ కొనసాగింది. మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయంగా కనిపించింది.

,
06/17/2016 - 05:35

న్యూఢిల్లీ, జూన్ 16: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి రవి శాస్ర్తి, సందీప్ పాటిల్ మధ్య ద్విముఖ పోటీ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈనెల 21 నుంచి 24 వరకు ధర్మశాలలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కీలక సమావేశం జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నిర్వాహణతోపాటు పాలనా వ్యవహారాలను పారదర్శకంగా నిర్వహించడం వంటి పలు అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.

06/17/2016 - 05:29

గోవా, జూన్ 16: నిధుల దుర్వినియోగానికి, మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై గోవా క్రికెట్ సంఘం (జిసిఎ) అధికారులు ముగ్గురని పోలీసులు అరెస్టు చేశారు. సంఘం అధ్యక్షుడు చేతన్ దేశాయ్, కార్యదర్శి వినోద్ ఫడ్కే, కోశాధికారి అక్బర్ ముల్లా భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ఫిర్యాదు వచ్చాయని, కోర్టు వారెంటు జారీ చేయడంతో వారిని నిర్బంధంలోకి తీసుకున్నామని గోవా పోలీసులు తెలిపారు.

06/16/2016 - 07:57

హరారే, జూన్ 15: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లను గెల్చుకొని, సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ చివరిదైన మూడో వనే్డలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. జట్టులో ఎక్కువ సంఖ్యలోవున్న యువ ఆటగాళ్లు బుధవారం జింబాబ్వేను ఉతికేశారు. ఇంకా 169 బంతులు మిగిలి ఉండగానే, పది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించారు.

06/16/2016 - 07:55

ముంబయి, జూన్ 15: టీమిండియా కోచ్ పదవికి 57 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, క్రికెట్ సలహా మండలి ఆ జాబితాను 21కి కుదించింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) మాజీ కార్యదర్శి, జాతీయ సెలక్టర్ సంజయ్ దగ్దాలే సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ మండలిలో మాజీ క్రికెటర్లు సచిన్ తెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ సభ్యులుగా ఉన్నారు. బోర్డుకు అందిన దరఖాస్తులను వీరు క్షుణ్ణంగా పరిశీలించారు.

06/16/2016 - 07:55

లండన్, జూన్ 15: చాంపియన్స్ ట్రోఫీ హాకీలో మొదటిసారి ఫైనల్ చేరాలన్న ఆశతో, గురువారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో పోరాటానికి సిద్ధమవుతున్నది. రెండు నెలల క్రితం ఇపోలో జరిగిన అజ్లాన్ షా హాకీ టోర్నీలో ఆసీస్ చేతిలో భారత్ రెండు మ్యాచ్‌ల్లో పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే, ఇప్పుడు ప్రపంచ చాంపియన్ జట్టుకు షాకివ్వాలన్న పట్టుదలతో ఉంది.

06/16/2016 - 07:54

ఫిలడేల్ఫియా, జూన్ 15: అలెక్సిస్ సాంచెజ్ కీలక సమయంలో రెండో గోల్స్‌తో రాణించడంతో కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో చిలీ క్వార్టర్ ఫైనల్స్ చేరింది. సాంచెజ్‌తోపాటు ఎడ్యుయార్డో వర్గాస్ కూడా ‘డబుల్’తో రాణించాడు. వీరిరువురి ప్రతిభ పనామతో జరిగిన మ్యాచ్‌లో చిలీకి 4-2 తేడాతో విజయాన్ని అందించింది. మ్యాచ్ ఐదో నిమిషంలోనే పనామాకు మిగుల్ కామర్గో తొలి గోల్‌ను అందించాడు.

Pages