క్రీడాభూమి

కుర్రాళ్లు ఉతికేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే, జూన్ 15: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లను గెల్చుకొని, సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ చివరిదైన మూడో వనే్డలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. జట్టులో ఎక్కువ సంఖ్యలోవున్న యువ ఆటగాళ్లు బుధవారం జింబాబ్వేను ఉతికేశారు. ఇంకా 169 బంతులు మిగిలి ఉండగానే, పది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించారు. జస్‌ప్రీత్ బుమ్రా బృందం బౌలింగ్‌లో రాణించి జింబాబ్వేను 123 పరుగులకే కట్టడి చేయగా, ఈ సిరీస్‌లోనే కెరీర్‌ను ఆరంభించిన లోకేష్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఫైజ్ ఫజల్ కూడా అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్‌తోనే వనే్డల్లో అరంగేట్రం చేసిన అతను అజేయంగా అర్ధ శతకాన్ని సాధించాడు. అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్ 124 పరుగుల లక్ష్యాన్ని కేవలం 21.5 ఓవర్లలోనూ ఛేదించింది, జింబాబ్వేకు వైట్‌వాష్ వేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే ఆరంభం నుంచే తడబడింది. 19 పరుగుల వద్ద హామిల్టన్ మసకజాను లోకేష్ రాహుల్ క్యాచ్ అందుకోగా ధవళ్ కులకర్ణి అవుట్ చేశాడు. 16 బంతులు ఎదుర్కొన్న హామిల్టన్ ఒక ఫోర్ సాయంతో 8 పరుగులు చేశాడు. చాము చిబాభా, ఉసి సిబాండ జింబాబ్వేకు మెరుగైన స్కోరును అందించేందుకు విఫలయత్నం చేశారు. క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నంలో నింపాదిగా ఆడిన చిబాభా 66 బంతులు ఎదుర్కొని, 27 పరుగులు చేసి యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రాకు దొరికిపోయాడు. సెకండ్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన తిమిసెన్ మరుమాతో కలిసి సిబాండ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అయితే, 89 పరుగుల స్కోరువద్ద సిబాండను చాహల్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు పంపాడు. టాప్ స్కోరర్‌గా నిలిచిన సిబాండ 71 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 38 పరుగులు చేశాడు. మరుమా 29 బంతుల్లో 17 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌కాగా, ఆ వికెట్ పడిన తర్వాత జింబాబ్వే మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. మాల్కం వాలర్ (8), ఎల్టన్ చిగుంబురా (0), రిచర్డ్ ముతుంబామీ (4), కెప్టెన్ గ్రేమ్ క్రెమర్ (0), వనాదా ముపరివా (1), డొనాల్డ్ తిరిపానో (2) సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారు. జింబాబ్వే 42.2 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటయ్యే సమయానికి నెవిల్లె మజవా 10 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 22 పరుగులకు నాలుగు వికెట్లు కూల్చి జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్‌ను దారుణంగా దెబ్బతీశాడు. యుజువేంద్ర చాహల్ 25 పరుగులకు రెండు వికెట్లు సాధించాడు. ధవళ్ కులకర్ణి, అక్షర్ పటేల్‌కు చెరొక వికెట్ లభించాయి. మొత్తం మీద భారత బౌలర్లు అద్వితీయ ప్రతి భతో జింబాబ్వేను సమర్థంగా కట్టడి చేశారు.
ఆడుతూ.. పాడుతూ..
కేవలం 124 పరుగుల విజయ లక్ష్యాన్ని అందుకోవడానికి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత ఓపెనర్లు లోకేష్ రాహుల్, ఫైజ్ ఫజల్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతూ పాడుతూ బ్యాటింగ్‌ను కొనసాగించారు. జింబాబ్వే బౌలర్లు వీరిపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. 21.5 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా టీమిండియా 125 పరుగులు సాధించి, జింబాబ్వేను పది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. రాహుల్ 70 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 63, ఫజల్ 61 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచారు.

స్కోరుబోర్డు
జింబాబ్వే ఇన్నింగ్స్: హామిల్టన్ మసకజా సి రాహుల్ బి ధవళ్ కులకర్ణి 8, చాము సిబాభా సి బుమ్రా బి యుజువేంద్ర చాహల్ 27, ఉసి సిబాండ సి అండ్ బి యుజువేంద్ర చాహల్ 38, తిమిసెన్ మరుమా బి బుమ్రా 17, మాల్కం వాలర్ రనౌట్ 8, ఎల్టన్ చిగుంబురా సి ధోనీ బి బుమ్రా 0, రిచర్డ్ ముతుంబామీ సి రాహుల్ బి బుమ్రా 4, గ్రేమ్ క్రెమర్ ఎల్‌బి అక్షర్ పటేల్ 0, నెవిల్లె మజవా నాటౌట్ 10, ఎక్‌స్ట్రాలు 8, మొత్తం (42.2 ఓవర్లలో ఆలౌట్) 123.
వికెట్ల పతనం: 1-19, 2-55, 3-89, 4-104, 5-104, 6-104, 7-104, 8-108, 9-110, 10-123.
బౌలింగ్: బరీందర్ శరణ్ 8-0-40-0, ధవళ్ కులకర్ణి 6.2-1-17-1, జస్‌ప్రీత్ బుమ్రా 10-1-22-4, అక్షర్ పటేల్ 10-2-16-1, యుజువేంద్ర చాహల్ 8-0-25-2.
భారత్ ఇన్నింగ్స్: లోకేష్ రాహుల్ నాటౌట్ 63, ఫైజ్ ఫజల్ నాటౌట్ 55, ఎక్‌స్ట్రాలు 8, మొత్తం (21.5 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా) 126.
బౌలింగ్: డొనాల్డ్ తిరిపానో 5-1-15-0, నెవిల్లె మజివా 5-0-25-0, వనాదా ముపరివా 6-0-43-0, గ్రేమ్ క్రెమర్ 4-0-26-0, చాము చిబాభా 1.5-0-15-0.

చివరి వనే్డలో అజేయంగా 63 పరుగులు చేసిన భారత ఓపెనర్ లోకేష్ రాహుల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సిరీస్‌లో కెరీర్‌ను ఆరంభించిన అతను రెండు సార్లు ఈ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. కాగా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా భారత యువ స్పిన్నర్
యుజువేంద్ర చాహల్ ఎంపికయ్యాడు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ స్థానాన్ని అతను సమర్థంగా భర్తీ చేశాడు.

నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు
హరారే: జింబాబ్వే నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు 104 పరుగుల స్కోరువద్ద తిమిసెన్ మరుమాను బుమ్రా బౌల్డ్ చేశాడు. తర్వాతి బంతికే అతను ఎల్టన్ చిగుంబురాను ధోనీ క్యాచ్ అందుకోగా పెవిలియన్‌కు పంపాడు. ఆ రెండు బంతులు బుమ్రా వేసిన ఓవర్‌లో చివరివికాగా, తర్వాతి ఓవర్‌ను అక్షర్ పటేల్ వేశాడు. అతని మొదటి బంతికే మాల్కం వాలర్ రనౌటయ్యాడు. తర్వాతి బంతిలో అతను గ్రేమ్ క్రెమర్‌ను ఎల్‌బిగా అవుట్ చేశాడు. మొత్తం జింబాబ్వే వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతర్వాత కోలుకోలేక, 123 పరుగులకే ఆలౌటైంది.

‘వెటరన్’ ఫజల్ అరంగేట్రం!
హరారే: లోకేష్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఫైజ్ ఫజల్‌కు ఇది తొలి వనే్డ. అయితే, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతనిని వెటరన్‌గానే పేర్కొంటారు. మొదటి వనే్డ ఆడే సమయానికి అతని వయసు 30 సంవత్సరాల 282 రోజులు. 2000లో సమీర్ ధిగే తర్వాత భారత వనే్డ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వారిలో ఎక్కువ వయసుగల ఆటగాడిగా ఫజల్ పేరు రికార్డు పుస్తకాల్లో చేరింది. 31 ఏళ్ల వయసున్న ధిగేను సెలక్టర్లు వనే్డ జట్టుకు ఎంపిక చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఫజల్ ఎంపిక పట్ల కూడా చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ తదితర స్టార్లకు విశ్రాంతినివ్వడంతో జట్టులోకి ఎక్కువ మంది యువ ఆటగాళ్లను సెలక్టర్లు జింబాబ్వే టూర్‌కు ఎంపిక చేశారు. అయితే, ఓపెనర్లుగా కరుణ్ నాయర్, లోకేష్ రాహుల్ రాణిస్తారో లేదోనన్న అనుమానంతో, ముందు జాగ్రత్త చర్యగా ఫజల్‌కు అవకాశం కల్పించారు. మొదటి రెండు వనే్డలతోపాటు సిరీస్‌ను గెల్చుకున్న తర్వాత, చివరిదైన మూడో వనే్డలో ప్రయోగం చేసే ఉద్దేశంతో ధోనీ ఫజల్‌కు అవకాశం ఇచ్చాడు. దానిని అతను సద్వినియోగం చేసుకున్నాడు.