క్రీడాభూమి

చివరి క్షణాల్లో రెండు గోల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్సెలీ, జూన్ 16: చివరి క్షణాల్లో నమోదైన రెండు గోల్స్ యూరో 2016 సాకర్ టోర్నమెంట్‌లో ఫ్రాన్స్‌ను ప్రీ క్వార్టర్స్ చేర్చాయి. ఈ పోటీల్లో అన్ని జట్లూ వ్యూహాత్మకంగా రక్షణాత్మక విధానాలను కొనసాగిస్తున్నాయని ఫ్రాన్స్, అబ్బేనియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ స్పష్టం చేసింది. ఆరంభం నుంచి మొదలైన మితిమీరిన డిఫెన్సివ్ ఆట దాదాపుగా చివరి వరకూ కొనసాగింది. మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయంగా కనిపించింది. చివరి నిమిషంలో ఆంటోనీ గ్రీజ్మన్ చేసిన గోల్‌తో ఫ్రాన్స్‌కు అత్యంత కీలకమైన ఆధిక్యం లభించింది. ఇంజురీ టైమ్ ఆరో నిమిషంలో దిమిత్రీ పయెట్ మరో గోల్ చేశాడు. దీనితో ఫ్రాన్స్ 2-0 తేడాతో అల్బేనియాను ఓడించి ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. పయెట్ గోల్ ఫ్రాన్స్ ఆధిక్యాన్ని పెంచినప్పటికీ, మొదటి గోల్ చేసిన గ్రీజ్మన్‌కే జర్మనీని గెలిపించిన ఘనత దక్కుతుంది. అల్బేనియా రక్షణ వలయాన్ని అతను సమర్థంగా ఛేదించి, కీలక సమయంలో గోల్‌ను నమోదు చేశాడు. కాగా, రుమేనియా, స్విట్జర్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరొక గోల్ చేశాయి. మ్యాచ్ 18వ నిమిషంలోనే పెనాల్టీ కార్నర్‌ను బగ్డాన్ స్టాన్కూ గోల్‌గా మలిచాడు. ద్వితీయార్ధంలో స్విట్జర్లాండ్‌కు అద్మిర్ మెహ్మదీ ఈక్వెలైజర్‌ను అందించాడు. ఆతర్వాత గోల్స్ నమోదు కాకపోవడంతో మ్యాచ్ డ్రా అయింది. స్లొవేకియాతో జరిగిన మ్యాచ్‌లో రష్యా ఓటమిపాలైంది. మ్యాచ్ 32వ నిమిషంలో వ్లాదిమిర్ వీస్, 45వ నిమిషంలో మారెక్ హామ్సిక్ గోల్స్ చేసి, స్లొవేకియాను 2-1 ఆధిక్యంలో నిలిపారు. మ్యాచ్ ముగింపు దశలో రష్యాకు డెనిస్ గ్లూషకొవ్ కంటితుడుపు గోల్‌ను అందించాడు.

చిత్రం ఫ్రాన్స్‌కు కీలక గోల్ అందించిన ఆంటోనీ గ్రీజ్మన్